– రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం న్యూఢిల్లీ పర్యటనలో, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు పాల్గొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ తో సమావేశాలు జరిగాయి. ఈ చర్చల్లో రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల నిర్మాణం, జల వనరుల సమర్థ వినియోగం, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై దృష్టి సారించబడింది.
ఈ సమావేశాలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రంతో సమన్వయాన్ని బలోపేతం చేస్తూ, ఒక స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను అందించాయి. ఎంపీ సానా సతీష్ బాబు ఈ పర్యటనను “రాష్ట్ర అభివృద్ధికి ఒక సుస్థిర పునాది” అని అభివర్ణించారు.