Suryaa.co.in

Andhra Pradesh

కన్నీరు పెట్టించిన పాట

చంద్రబాబు అక్రమ అరెస్ట్ను నిరసిస్తూ, ఆయన రాష్ట్రానికి చేసిన సేవలను గుర్తు చేస్తూ విజయవాడ తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం పేరుతో కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ గద్దె అనురాధ రూపొందించిన పాట ఎంతో మందిని కన్నీరు పెట్టించింది. ఈ పాటను మంగళగిరిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నారా లోకేష్ ఆవిష్కరించగా అక్కడ మీటింగ్ కు హాజరైన ప్రతి ఒక్కరూ కూడా ఆ పాటను చూసి భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు.పాటను చాలా చక్కగా రూపొందించిన గద్దె అనురాధను నారా లోకేష్ స్టేజీ వద్దకు పిలిచి మాట్లాడగా, గద్దె అనురాధ నారా లోకేష్ ను చూసి ఒక్కసారిగా భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు.

LEAVE A RESPONSE