(చాకిరేవు)
అడిగినట్లు రీపోలింగ్ పెట్టారు. ప్రజాస్వామ్యంలో అర్హతలేని అర్భకులు మాత్రం—ఒకవైపు బహిష్కరణ అంటూ బోసిపోయిన నినాదాలు, మరోవైపు “ఇంకా ఏదో జరగబోతోంది” అంటూ ఊహాజనిత స్క్రోలింగులతో ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచే ప్రయత్నం చేస్తున్నారు.
జగన్ నియమించిన నీలం సాహ్ని గారి నేతృత్వంలోని ఎన్నికల కమిషన్, పులివెందులలో రెండు కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహిస్తోంది. 30 ఏళ్లుగా నామినేషన్ వేసే అవకాశం లేకుండా బంధించబడిన పులివెందుల ప్రజలకు, ఈసారి మాత్రం కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓటు వేసే అవకాశం కలిగింది.
కానీ ప్రజలపై నమ్మకం లేని సంధింటి చివరి పాలేగాళ్లు మాత్రం—ఇది జీర్ణించుకోలేక, బహిష్కరణల పేరుతో బూతుల బాట పట్టారు.
చూస్తుంటే…
వీరి గొంతెమ్మ కోరికల ప్రకారం 11 నామినేషన్లలో వీరి నామినేషన్ తప్ప అన్నీ తిరస్కరించి, ఏకగ్రీవం ప్రకటిస్తే గానీ—పులివెందుల రాజ్యాంగ నిర్మాత తాత రాజారెడ్డి ఆత్మ, దానిని అమలుచేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి ఆత్మ శాంతించదట!
ఇది ప్రజాస్వామ్యమా? లేక ఓటు హక్కును బంధించే కుట్రల పునరావృతమా?
ఈసారి మాత్రం, మొట్టమొదటి సారిగా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరుగుతున్నాయి.
అందుకే వీరి ఏడుపులు, పెడబొబ్బలు, స్క్రోలింగ్ డ్రామాలు—ఆల్ టైం హై.
ఇది శ్రవణానందకరం.
బులుగు మీడియా మొత్తం ఏకమై ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నా.. అసలు సిసలైన అంబేడ్కర్ రాజ్యాంగం అమలవుతోంది అని ప్రజలు సంతోషిస్తున్నారు.