Suryaa.co.in

Telangana

దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ రాబోతుంది

-సూర్యుడు ఉన్నంత వరకు హిందూత్వం, సనాతన ధర్మం
-బీఆర్ఎస్ ఎంఐఎం లు ఒకటే
-ఆరువేల మదర్సాలను బంద్ చేయించాం
-వచ్చే ఏడాది మరో వెయ్యి మదర్సాలనూ మూసివేస్తా.
-ఓవైసీ ఇంట్లో కూడా వస్తా.. ఏం చూస్తాడో?
-అస్సోం సీఎం హిమంత బిశ్వ శర్మ

సూర్యుడు ఉన్నంత వరకు హిందూత్వం, సనాతన ధర్మం ఉంటుంది.ఓవైసీ… హిందువులను నీవు ఏం చేయలేవు.హిందువులు జాగృతం అయ్యారు.పదేళ్ళ క్రితం అయోధ్య లో మందిరం అవుతుంది అని అనుకోలేదు.కానీ ఈ ఏడాది ఆలయ నిర్మాణం పూర్తయింది.370 ఆర్టికల్ పోతుందని ఎవరూ అనుకోలేదు. దేశం లో యూనిఫాం సివిల్ కోడ్ రాబోతుంది.

భారతదేశం నిజమైన సెక్యులర్ దేశం కాబోతుంది.తెలంగాణలో రామరాజ్యం రాబోతుంది.అస్సోం లో 98 రూపాయల కే పెట్రోల్ వస్తుంది.. కానీ తెలంగాణ లో 108 రూపాయలు ఉంది.. అస్సోం లో ప్రభుత్వ ఉద్యోగులకు జీతం 1వ తేదీన వస్తుంది.

తెలంగాణలో ఒకటవ తారీఖున రాదు. 50 వేల ఉద్యోగాలు కూడా తెలంగాణ లో ఇవ్వలేదు. తెలంగాణ ప్రభుత్వం పేరు డిల్లీ లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఢిల్లీ లో ప్రభుత్వ పెద్దలు మద్యం వ్యాపారం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎంఐఎం లు ఒకటే. బీఆర్ఎస్ వీఆర్ఎస్ తీసుకోవాల్సిన సమయం వచ్చింది.భారతదేశం విశ్వగురు స్థానంలో నిలుస్తుంది.ఈ రోజు పాకిస్థాన్ పరిస్థితి చూడండి. హిందూ దేవుళ్ళ ను నమ్మని వారి పరిస్థితిని చూడండి వారు ఎలా ఉందో దుస్థితి.ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లో నెంబర్ వన్ కాబోతుంది.

మీరు ఒక్క సారి కేరళ స్టోరీ చూడాలి. హిందూ యువతులను ఉగ్రవాదులు గా ఎలా తయారు చేస్తారో చూపించారు. లవ్ జిహాద్ అరికట్టేందుకు నేను ప్రయత్నం చేస్తున్నాను. ఆరువేల మదర్సాలను బంద్ చేయించాం.ఓవైసీ నన్ను చూసుకుంటా అని బెదిరించారు. వచ్చే ఏడాది మరో వెయ్యి మదర్సాలనూ మూసివేస్తా. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తాను.. ఓవైసీ ఇంట్లో కూడా వస్తా.. ఏం చూస్తాడో చూడాలి. రజాకర్ రాజ్యం పోవాల్సిన అవసరం ఉంది.బండి సంజయ్ ఆధ్వర్యంలో పార్టీ ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నాను. తెలంగాణ మార్పు వస్తుంది… రామరాజ్యం వస్తుంది అని అస్సాం లో చెప్తాను.

LEAVE A RESPONSE