Suryaa.co.in

Telangana

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలోనే శ్వేత పత్రం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

తెలంగాణ ఆర్థిక పరిస్థితి పై త్వరలోనే శ్వేత పత్రం విడుదల చేయనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో రాష్ట్రంలో ఆర్థిక అసమానతలతో కూడిన ఫ్యూడల్ సమాజం నిర్మితమైందని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆరోపించారు. ఖమ్మంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి పౌరుడికీ జవాబుదారీగా ఉండేలా వ్యవస్థలను తీర్చిదిద్దటమే తమ ప్రభుత్వం ముందున్న ప్రధాన లక్ష్యమన్నారు.

ప్రజా ప్రభుత్వంలో రాజకీయ పార్టీలకు అతీతంగా సూచనలు తీసుకుంటామని తెలిపారు. గత పదేళ్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై త్వరలోనే శ్వేత పత్రం విడుదల చేస్తాం. బీఆర్ఎస్ పాలనలో సంపద దోపిడీకి గురైంది. వనరులను దుర్వినియోగం చేశారు. సరైన సమయంలో సరైన వేదికపై ఈ శ్వేతపత్రాన్ని విడుదల చేస్తాం. ప్రజల కోసం మాత్రమే అధికారులు పనిచేయాలి. వారు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చి చెప్పుకోవచ్చు అని భట్టి విక్రమార్క అన్నారు.

LEAVE A RESPONSE