– మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపణ
నల్గొండ : యూరియా కోసం ధర్నా చేసిన గిరిజన యువకుడు సాయి సిద్దు నాయక్ పై వాడపల్లి పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని యువకుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. సాయి సిద్దు ను అతని స్వగ్రామం అయిన దామరచర్ల మండలం, కొత్తపేట తండా లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్, భూపాల్ రెడ్డి, భగత్ కుమార్, విజయసింహా రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్ధార్థ పరామర్శించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడారు.
రాష్ట్రంలో ఆటవిక, అరాచక రాజ్యం నడుస్తోంది.. పోలీస్ లను అడ్డం పెట్టుకొని అరాచక పాలన చేస్తుండు రేవంత్ రెడ్డి…..కాంగ్రెస్ నాయకులు చెప్తే అక్రమ కేస్ లు పెట్టి దాడులు చేస్తున్నారు పోలీసులు.. కొత్తపేట తండా లో యూరియా ధర్నాలో పాల్గొన్నందుకు సాయి సిద్దు అనే గిరిజన యువకుణ్ణి పోలీసులు ఇంతలా కొడతారా? అని సూటిగా ప్రశ్నించారు.
ఇంత దారుణం ఉంటుందా, విచక్షణ రహితంగా కొట్టారు పోలీసులు.. అసలు దోషులు కాంగ్రెస్ నాయకులు.. హామీలు ఇచ్చి ఎగొట్టారు కాంగ్రెస్ నాయకులు.. వాళ్ళను కొట్టాలి… సాయి సిద్దును కొట్టిన పోలీసులు లపై చర్యలు తీసుకోవాలి.. అంతే జిల్లా ఎస్పీ పోలీసులను వెనకేసుకొని వస్తుండు….. జిల్లాలో ఎస్పీ లు కూడా కాంగ్రెస్ నాయకులు లాగా పని చేస్తున్నారు.. జిల్లాలో అమాయకులను కేస్లల్లో ఇరికించి కొడుతున్నారు.. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని ఆరోపించారు.
కార్యక్రమంలో దుర్గంపూడి నారాయణరెడ్డి, చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి, బాలాజీ నాయక్, అంగోతు హాతిరాం నాయక్, కుందూరు వీర కోటిరెడ్డి, బాబయ్య , కుర్ర శ్రీను నాయక్, ధనావత్ ప్రకాష్ నాయక్, శ్రీను నాయక్, లింగా నాయక్, పీసీకె ప్రసాద్, బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.