Suryaa.co.in

Andhra Pradesh

హై టెక్నాలజీ కెమెరాలు కోసం హత్య చేసిన యువకుడు

-ఈవెంట్ బుకింగ్ ఉందని పిలిచి హతమార్చారు
-మృతదేహాన్ని మూలస్థానంలో పాతిపెట్టారు

మధురవాడ: బక్కన్నపాలెంకి చెందిన ఫోటో గ్రాఫర్ పోతిన సాయి విజయ్ పవన్కళ్యాణ్ వయసు 23 ఆన్లైన్ ఈవెంట్స్ చేస్తూ ఉండేవాడు, తండ్రి పోతిన శ్రీను ఆటో డ్రైవర్ , తల్లి పోతిన రమణమ్మ, కార్ షెడ్ జంక్షన్ లో ఫాన్సీ వ్యాపారం చేస్తుంటారు, గత పదిరోజులుగా షణ్ముఖ తేజ ఫోటో గ్రాఫర్ అనే 19 ఏళ్ళ యువకుడు, ఆన్లైన్ బుకింగ్ పేరుతో పోతిన సాయితో పరిచయ మయ్యాడు.

షణ్ముఖ తేజ సాయి వద్ద హై టెక్నాలజీ కెమెరాలపై మోజు పడ్డాడు, ఆ కెమెరాలు సుమారు 15 లక్షలు విలువ ఉంటుంది అని అంచనా ఆ కెమెరాలను ఎలా అయినా దక్కించుకోవాలని పన్నాగంతో పోతిన సాయి కి పెద్ద ఈవెంట్ ఉంది రావులపాలెంలో ఆ ఈవెంట్ కి నీ దగ్గర ఉన్న కెమెరాలతో ఇద్దరం కలిసి చేద్దాం ఆ ఈవెంట్ చేస్తే సినిమాలలో అవకాశం వస్తుంది అని ఆశ చూపి ప్రతీ రోజు సోషల్ మీడియాలో చాట్ చేస్తూ మాట్లాడేవారు అయితే సోమవారం ఫిబ్రవరి 26వ తేదీ పోతిన సాయి రావులపాలెం తన కెమెరాలతో కార్ షెడ్ వద్ద బస్ ఎక్కి రైల్వేస్టేషన్ లో ట్రైన్లో రాజమండ్రి దిగాడు.

షణ్ముఖ సాయి రాజమండ్రిలో కారు అద్దెకు తీసుకుని రాజమండ్రిలో పిక్ అప్ చేసుకుని ఆలుమూరు రావులపాలెం పరిసర ప్రాంతంలో షణ్ముఖ సాయి ని తీసుకు వెళ్లారు, పోతిన సాయికి అనుమానంతో తప్పించుకునే అవకాశం లేక కారు వెనుక భాగం ఫోటో తన తల్లికి పంపి షణ్ముఖ సాయి ఫోన్ నెంబర్ ఇచ్చి తెలియని వారితో ఈవెంట్ కి వచ్చాను నా ఫోన్ అవ్వక పొతే ఇచ్చిన నెంబర్ కి ఫోన్ చెయ్యండి అని చెప్పి ఆఖరి సారి మాట్లాడినట్లు సమాచారం.

తల్లి కుమారుడు సాయి ప్రమాదంలో ఉన్నట్టు గమనించలేక సరే అన్నది. ఎప్పుడు ఈవెంట్ కి వెళ్లిన ప్రతీరోజు మాట్లాడే కొడుకు ఫోన్ స్విచ్ అఫ్ రావటంతో కొడుకు ఇచ్చిన నెంబర్ కూడా స్విచ్ అఫ్ రావటంతో ఆందోళన చెంది ఫిబ్రవరి29న పీఎంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పీఎంపాలెం పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా పలు కీలక ఆధారాలను సేకరించి రావులపాలెం షణ్ముఖ సాయి గా గుర్తించారు, శుక్రవారం మార్చ్1వ తేదీన పోతిన సాయి కుటుంభ సభ్యులతో పీఎంపాలెం సీఐ రామకృష్ణ ఆదేశాలతో రావులపాలెం సమీపంలో ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారం వెళ్లగా షణ్ముఖ సాయి అప్పటికే పరారీలో ఉన్నాడు. తల్లి తండ్రులను విచారించగా పోతిన సాయిని హత్య చేసి ఆ కెమెరాలను పైన గదిలో పెట్టి తాళం వేసిన గదిని సీఐ ఆదేశాలతో గది తాళలను పగలగొట్టగా గదిలో కెమెరాలు లభ్యమయ్యాయి.

కెమెరాలను షణ్ముఖ సాయి తండ్రిని విశాఖపట్నం పీఎంపాలెం పోలీస్ స్టేషన్ కి తరలించారు, హత్య చేసిన షణ్ముఖ సాయి తన వద్ద ఉన్న వేరొక నెంబర్ ని సేకరించిన పోలీసులు ట్రేస్ చెయ్యగా అన్నవరంలో లొకేషన్ ట్రేస్ అవ్వగా పోలీసులు లొకేషన్ ని రీచ్ అయ్యేసరికి ఫోన్ అఫ్ రావటంతో తప్పించుకున్నట్లు సమాచారం, శనివారం మరో కీలక ఆధారం సేకరించిన పోలీసులు షణ్ముఖ సాయికి ముఖ పుస్తకం ద్వారా విశాఖపట్నం కంచరపాలెం అమ్మాయితో పరిచయం ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు ఆ అమ్మాయిని, ఆమె తల్లిని పీఎంపాలెం పోలీస్ స్టేషన్ కి తీసుకు వచ్చి విచారించి ఆమె తో షణ్ముఖ సాయి తో చాటింగ్ చేయించారు.

ఆమె మెసేజ్ కి స్పందించటంతో పోలీసులు సకాలంలో షణ్ముఖ సాయిని వలపన్ని పట్టుకున్నారు, అనంతరం విచారించగా పోతిన సాయి ని హత్య చేసినట్లు నిర్ధారించి తేజ ఇచ్చిన సమాచారంతో మృతదేహన్ని గురించి మృతుని కుటుంభ సభ్యులకు సమాచారం అందించారు, మృతుని కుటుంభ సభ్యులు వారి బాధను చూసేవారి కళ్ళలలో కన్నీరు వచ్చే విచారణ ఘటనతో మధురవాడ బక్కన్నపాలెంలో తీవ్ర విషాదం నెలకొంది.

 

LEAVE A RESPONSE