Suryaa.co.in

Andhra Pradesh

ఏ2 ఫోన్ పోయిందని నాటకాలు ఆడుతున్నాడు

• లిక్కర్ స్కామ్ లో తన పాత్ర, జగన్ రెడ్డి పాత్ర బయటపడకూడదనే ఏ2 ఫోన్ పోయిందని నాటకాలు ఆడుతున్నాడు
• ఈడీ నాలుగు తగిలిస్తే విజయసాయి ఫోన్ బయటకువస్తుంది
• తప్పుచేయడం తప్పుడు ఆధారాలతో తప్పించుకోవాలని చూడటం ఏ2కి వెన్నతో పెట్టినవిద్య
• వీఐపీల అడ్డా తాడేపల్లి ప్యాలెస్ లో ఫోన్ పోవడం అంత ఆషామాషీకాదు
టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి కే.ఎస్.జవహర్

ఏ2 విజయసాయిరెడ్డి లిక్కర్ స్కామ్ నుంచి బయటపడటానికే తనక్రిమినల్ తెలివితేటలు ప్రదర్శిస్తూ ఫోన్ పోయిందని నాటకాలు ఆడుతున్నాడని, ఈడీ అధికారులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంటేనే లిక్కర్ స్కామ్ అసలుదొంగలు గుట్టురట్టు చేయగలరని, దొంగబుద్ధితో వ్యవహరిస్తున్న విజయసాయి ఆటకట్టించగలరని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి కే.ఎస్.జవహర్ స్పష్టంచేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడిన వివరాలు….క్లుప్తంగా మీకోసం!

“దొంగది దొంగబుద్ధే అన్నట్లుగా ఏ2 విజయసాయిరెడ్డి వ్యవహరిస్తున్నాడు. ఏదైనా నేరమో, పెద్దతప్పో చేయాలనుకున్నప్పుడే నేరస్వభావం ఉన్నవారు, ముందుగా కొన్నితప్పుడు ఆధారాలు సృష్టించి, తప్పించుకోవాలనే ప్రయత్నంలో ఇలాంటి చీప్ ట్రిక్కులు ప్రదర్శిస్తుంటారు. విజయసారెడ్డి నిజంగానే పోయిందా…లేకదాచేశారా..జగన్ రెడ్డి దాక్కున్నాడా? విజయసాయి ఫోన్ ని జగన్ రెడ్డే తాడేపల్లిప్యాలెస్ నేలమాళిగలో దాచాడనే అనుమానం కలుగుతోంది. లిక్కర్ స్కామ్ బయటపడ్డాకే విజయసాయిరెడ్డి ఫోన్ పోవడంలో ఆంతర్యంఏమిటి? పోయిన ఫోన్ లో శరత్ చంద్రారెడ్డి, విజయసాయిరెడ్డిల లావాదేవీలు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లావాదేవీలు, ఇతరనిగూఢ అంశాలు దాగున్నాయనే అనుమానం కలుగుతోంది.

సముద్రపులోతులో దాగిఉండే రహస్యాలను మించిన రహస్యాలు ఏ2 ఫోన్ లో జాగ్రత్తగా ఉండిఉండొచ్చు. లిక్కర్ స్కామ్ కి సంబంధించిన వాటాలవ్యవహారం.. విజయసాయిరెడ్డికి ఎంత.. జగన్ రెడ్డికి ఎంత.. ఢిల్లీలో ఎవరికిఎంతెంత పంచారనే వివరాలు కూడా దానిలో ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా అత్యాధునిక సాంకేతికత ఉందని చెప్పుకునే ఐఫోన్ పోవడం అంత ఆషామాషీకాదు. నిజంగానే ఐఫోన్ పోతే అదిఎక్కడుందో తెలుసుకోవచ్చు. పోయిన ఫోన్ కి కచ్చితంగా విజయసాయి ఫేస్ రికగ్నైజేషన్ ఉండి ఉంటుంది. ఆయన ముఖంవద్ద ఫోన్ పెడితే అదే ఓపెన్ అవుతుంది. అదికూడా సాధ్యంకాకపోతే టెక్నాలజీ తెలిసినవారితో దాన్ని ఓపెన్ చేయించవచ్చు.

గతంలో కూడా ఈడీ విచారణలో ఏ2 ల్యాప్ టాప్ వాడటంరాదంటూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు.

గతంలో కూడా అక్రమాస్తుల విచారణకు సంబంధించి ఈడీనమోదు చేసిన కేసులవిచారణ ఎదుర్కొనేసమయంలో విజయసాయిరెడ్డి ల్యాప్ ట్యాప్ వాడటంరాదని చెప్పితప్పించుకోవాలని చూశాడు. ఈడీ తనదైనశైలిలో విచారించి రెండు పీకగానే అన్నీఒప్పుకున్నాడు. తప్పుచేసినప్పుడు వాటికి సంబంధించిన ఆధారాలు దాచడంకూడా నేరమేనని ఐపీసీ, సీఆర్ పీసీ చట్టాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పోయిందంటున్న ఫోన్ వ్యవహారం తేలాలంటే విజయసాయిని ఈడీ అధికారులు వారిదైన స్టైల్లో విచారించాలి. ఈడీ విజయసాయిరెడ్డిని తక్షణమేఅరెస్ట్ చేసి పోలీస్ ఫక్కీలో విచారిస్తేనే అసలుగుట్టు బయటపడుతుంది. తాడేపల్లి ప్యాలెస్ అంటే కట్టుదిట్టమైన భద్రతాఏర్పాట్లమధ్య వీఐపీలు ఉండేప్రదేశం..అలాంటిచోట ఫోన్ పోయే అవకాశాలుంటాయా? అక్కడేమైనా దొంగలున్నారా.. పాలకులు ఉండేప్రదేశంలో దొంగలు ఉండటం ఏమిటి? లిక్కర్ స్కామ్ కు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఆఫోన్ లో ఉండబట్టే దాన్ని దాచి నాటకాలు ఆడుతున్నారు. తన అల్లుడుని ఈడీ విచారిస్తున్నప్పుడే విజయసాయి ఫోన్ పోవడం ముమ్మాటికీ తాడేపల్లిప్యాలెస్ రహస్యమే. ఫోన్ వ్యవహారమేకాదు.. లిక్కర్ స్కామ్ కు సంబంధించి, విశాఖలో తానుతనపార్టీనేతలు సాగించిన భూకబ్జాలపై కూడా విజయసారెడ్ది నోరువిప్పాల్సిందే అని డిమాండ్ చేస్తున్నాం.

గతంలో గొడ్డలిపోటు వేసి, గొడ్డలిని, నెత్తుటిమరకలను కడిగేసినంత తేలిగ్గా, విజయసాయిరెడ్డి ఫోన్ పోయిందనిచెప్పి లిక్కర్ స్కామ్ నుంచి బయటపడదామనుకుంటున్నాడు. నేరంచేసినవాళ్లు ఎప్పటికీ తప్పించుకోలేరు. లిక్కర్ స్కామ్ ఆధారాలు దొరక్కుండా చేసేక్రమలోనే విజయసాయిరెడ్డి ఫోన్ పోయిందంటున్నాడు. విజయసాయిరెడ్డి ఫోన్ బయటకొస్తే అంతా బయటకొస్తుంది. శరత్ చంద్రారెడ్డి, విజయసాయిరెడ్డిల పాత్ర, జగన్ రెడ్డి ప్రమేయం, కనికారెడ్డి విమానాల్లో డబ్బుతరలించడం వంటి వ్యవహారాలన్నీ బయటకొస్తాయి. మొన్నటివరకు విశాఖపట్నంలో ఉన్నఏ2 తాడేపల్లికి వచ్చి, మరలా ఢిల్లీ ఎందుకు వెళ్లాడు. తనకు ఏమీ తెలియవు…ఏదీరాదని చెప్పే విజయసాయిరెడ్డి ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి అన్ని సోషల్ మీడియావిభాగాల్లో యాక్టివ్ గా ఎలా ఉంటున్నాడో కూడా ఈడీ తేల్చాలి. తనకు సంబంధించిన కుంభకోణాలు, ఇతరత్రా అవినీతి వ్యవహారాలు బయటకువచ్చినప్రతిసారీ, విజయసాయిరెడ్డి ఇలాంటి అతితెలివితేటలు చూపుతుంటాడు.విశాఖపట్నం అనే పరగణాకు రాజులా వ్యవహరిస్తున్న విజయసాయిరెడ్డి, తన ఫోన్ ని అంతతేలిగ్గా పోగొట్టుకుంటాడా.. ఆయన చెప్పేది నమ్మదగ్గ అంశమేనా” అని జవహర్ అభిప్రాయపడ్డారు.

LEAVE A RESPONSE