జగన్ రెడ్డి అవినీతి కేసుల్లో ఐఏఎస్ లను బాధ్యులుగా చేసి నేడు చంద్రబాబు గారి కేసులో ఐఏఎస్ లను బాధ్యులుగా ఎందుకు చేయలేదు పొన్నవోలు?
తలకిందుల తపస్సు చేసినా చంద్రబాబు గారిపై అవినీతి మచ్చ వేయలేవు
శాసనమండలి సభ్యులు పరుచూరి అశోక్ బాబు
చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడమే జగన్మోహన్ రెడ్డి జీవిత ఆశయమా? సకల శాఖా సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నింటికి మాట్లాడతారు. కాని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా చంద్రబాబు ని విమర్శించడం సిగ్గుచేటు. జగన్ కళ్లల్లో ఆనందం చూసేందుకే సుధాకర్ రెడ్డి రాజకీయ వ్యాఖ్యలు చేశారు. స్కిల్ డవలప్ మెంట్ మీద కేసుల్లో ఏమీ జరగలేదని ఈడీ చెప్పింది.
స్కిల్ డవలప్ మెంట్ లో 10 శాతం నిధులు రూ.330 తో పాటు రూ.40 కోట్లు జీఎస్టీ కట్టాలి. రూ.330 కోట్లల్లో రూ.70 కోట్లు డిజైన్ టెక్ సీమెన్స్ కు కట్టింది. మిగిలిన నిధులు విద్యా సంస్థల్లో స్కిల్ డవలప్ మెంట్ కింద ఖర్చు చేశారు. 3 ఏళ్ల పాటు 2,13,000 మంది విద్యార్ధులకు శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వం వాటా రూ. 330 కోట్లల్లో రూ.270 కోట్లు అవినీతి జరిగిందని వైసీపీ నాయకులు చెప్పడం హాస్యాస్యపదంగా ఉంది.
అంటే రూ.330 కోట్లల్లో రూ.60 కోట్లే స్కిల్ డవలప్ మెంట్ కింద ఖర్చు చేశారా? ప్రభుత్వం 4 విడతల్లో రూ.271 కోట్లు చెల్లించింది. అందులో సీమెన్స్ కు ఇచ్చిన రూ.70 కోట్ల రాయల్టీ ఉంది. వాళ్లు కట్టాల్సిన జీఎస్టీ ఉంది. మిగిలిన నిధులతో 42 సెంటర్లల్లో ఖర్చు చేశారా? ఆ నిధులు డ్రా చేసి తెలుగుదేశం పార్టీ చెల్లించారనేది ఆరోపణ తప్పా ఆధారం లేదు.
గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి సొమ్ము ఎటుపోయింది, ఎటు నుంచి వచ్చిందో సీబీఐ, ఈడీ స్పష్టంగా చెప్పింది. పొన్న వోలు చెబుతున్న రూ.271 కోట్లు ఎటు పోయాయో ఎందుకు చెప్పలేకపోతున్నారు. కేసు 2021లో ఫైల్ చేశారు, అప్పటి వరకు సిట్, సీఐడీ ఏం చేస్తున్నారు? మొత్తం 36 మందిపై దోషులుగా పెట్టారు. కాని ఎవరినైనా అరెస్టు చేశారా? అంటే నేరం గ్రావిటీ అందులో లేదనేది స్పష్టంగా అర్ధమయ్యింది. చంద్రబాబు గారి పేరు ఎఫ్ఐఆర్ లో లేకపోయినా ఆయనను తీసుకువచ్చారు. రూ.271 కోట్లకు చట్ట ప్రకారం బాధ్యత చంద్రబాబు అని ఎలా చెబుతున్నారు?
కిరణ్ కుమార్ రెడ్డి సమయంలో జగన్మోహన్ రెడ్డి మీద ఏసీబీ కేసు ఫైల్ చేస్తే ఒక్క ఆయననే ఎలా బాధ్యత చేస్తారు? ఐఏఎస్ అధికారులను ఎందుకు బాధ్యులుగా చేయరని వెళ్లింది పొన్నవోలు సుధాకర్ రెడ్డి కాదా? ఆ కేసు డిస్మిస్ చేస్తే హైకోర్టు, తరువాత సుప్రీంకోర్టుకు వెళ్లింది నువ్వు కాదా? కేవలం పొన్నవోలు వలనే జగన్మోహన్ రెడ్డి కేసులో ఆరుగురు ఐఏఎస్ లు సస్పెండ్ అయ్యి జీవితాలను తలకిందలు అయ్యేలా చేశారు.
శ్రీ లక్ష్మీ, భట్టాచార్య వంటి వారు అరెస్ట్ అయ్యారు. దానికి కారణం పొన్నవోలు సుధాకర్ రెడ్డి కాదా? ఆ బాధ్యత నేడు ఎందుకు వర్తించదని నిన్న ప్రశ్నిస్తున్నాం. డిజైన్ టెక్ కు డబ్బులు చెల్లించిన ప్రేమ్ చంద్రా రెడ్డి తో పాటు ఎండీలను పొన్నవోలు ఎందుకు బాధ్యులుగా చేయలేదు? నాడు చేసిన పనిని నేడు ఎందుకు చేయలేకపోయాం.
రాజ్యాంగ బద్దంగా అడ్వకేట్ జనరల్ మాత్రమే ఉంటుంది. కాని పొన్నవోలు సుధాకర్ రెడ్డి అటూ ఇటూ గాని పోస్టులో ఉంటూ రాజకీయ విమర్శలు చేయడం హేయం. చంద్రబాబు కి అన్ని తానే ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. చట్టంలో ఉన్నవే ఇచ్చారు తప్పా కొత్తగా ఏం ఇచ్చారు? చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి నంద్యాల నుంచి హెలికాప్టర్ లో తెచ్చేవాళ్లమని సజ్జల అన్నారు. అయితే ఫ్లైట్ ఎందుకు పెట్టలేదని మేము ప్రశ్నిస్తున్నాం.
ఏ.. జగన్మోహన్ రెడ్డి స్పెషల్ ఫ్లైట్లల్లో వేల కోట్ల ప్రజాధనంతో తిరగడం లేదా? జగన్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా చంద్రబాబు వెంట్రుక కూడా పీకలేవు? జగన్మోహన్ రెడ్డి ఏళ్ల తరబడి బెయిల్ మీద ఉన్నావు. చంద్రబాబు గారిని ఆపడం నీ వల్ల కాదు. ఏపీ నుంచి భయటకు వెళ్లాలంటనే జగన్మోహన్ రెడ్డికి పర్మిషన్ కావాలి.
పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రజల సొమ్ము తింటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే పరిహారం చెల్లించక తప్పదు. ప్రేమ్ చంద్రారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? కనీసం విట్ నెస్ గానైనా ఎందుకు పెట్టలేదు? పీపీ రమేష్ దగ్గర 161 తీసుకొని మళ్లీ ఆయనకు కౌంటర్ ఎలా ఇచ్చారు? టీడీపీ నాయకులు ధర్నా చేస్తే 307 కేసు పెడతారా?
రేపు 10 లక్షల మంది రోడ్ల మీదకు వస్తే అందరి మీద అవే కేసులు పెడతారా? జైల్ భరో వంటి కార్యక్రమాలు చేపడతాం. ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లు ముట్టడిస్తాం. అప్పుడేం కేసులు పెడతారు?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను వైసీపీ నాయకులు కూడా వ్యతిరేకిస్తున్నారు. అధికారం అనేది జగన్మోహన్ రెడ్డికి శాశ్వతం కాదు. టిడిపి నాయకులను అరెస్ట్ చేసి మళ్లీ అధికారంలోకి రావాలని కుటిల ప్రయత్నం చేస్తున్నారు. జగన్ రెడ్డి తల కింద తపస్సు చేసినా ఆయన మీద పెట్టిన ఏ ఒక్క కేసు నిలవలేదు. రాబోయే ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. జగన్మోహన్ రెడ్డికి చూసే దమ్ముందా?