మోడీ/బీజేపీని ఎవరు వ్యతిరేకిస్తే, వాడిని పైకి ఎత్తడం… ఎలివేట్ చేయడం ఒక వర్గానికి అదో పెద్ద రోగమైపోయింది. ఇకా రోగం కూడా ఎంతగా ముదిరిందంటే, మోడీ/ బీజేపీ మీద వ్యతిరేకత కాస్తా హిందుత్వం/భారతదేశంపై వ్యతిరేకతగా అయ్యేంతంగా… ఇకలా వ్యతిరేకించే వారిలో మరకలు… అంబీలు… గొర్రెలు.. కాంగీ…కమ్మీలు ప్రథములు… ఇక తమ్ము తాము మేధావులుగా భ్రమపడేవారు కూడా ఇదే మూకలోకి వస్తారు.
ఇక శత్రువు శత్రువు మిత్రుడు అనే లెక్క ప్రకారం మోడీ/ బీజేపీ ని తీవ్రంగా వ్యతిరేకించే ఈ రాఘవ్ ఛడ్డా అనేవాడు కాస్తా , పై ముకాలందరికీ తెగ ఇష్టుడైపోయాడు…. అందుకే గత 3/4 నెలలుగా పై మూకలన్నీ కూడా కల్సి ఈ మహానుభావుణ్ణి తెగ ఎత్తుకుంటున్నాయ్.
ఇక ఆఁ మూక అంటే ECOSYSTEM అని కూడా అర్థం చేసుకోవాలి. ఇక ఈ మహానుభావుడు రాజ్యసభలో మాట్లాడినట్టుగా చెప్పుకుంటున్న మాటలకు తెగ Elevation లు ఇస్తున్నాయ్. ఇకా Elevationలు ఎంత స్థాయికి పోయాయాంటే, ఈ రాఘవ్ ఛడ్డాఅనే వాడు “ప్రధాన మంత్రి” కావాల్సిందే అనేంతగా ప్రచారం మొదలెట్టేసాయ్.
“వందేమాతరం” గీతం రచించి 150 సంవత్సరాలైన సందర్బంగా మొన్నీ మధ్య పార్లమెంటులోని ఉభయ సభలో చర్చ జరిగినప్పుడు ఈ మహానుభావుడు మిగతా అందరికి లాగే రాజ్యసభలో మాట్లాడాడు, అయితే ఇకాయనగారి ఆఁ మాటల్ని ఆఁ ECOSYSTEM చేసిన ప్రచారానికయితే అడ్డూఆదుపే లేదు.
చివరికి ఆయనగారి హిందీ ప్రసంగపు వీడియోల్ని మన తెలుగులోకి కూడా అనువాదం చేసి, YouTube ల్లో మోత మోగించారంటే, ఇతని విషయంలో Ecosystem ఎంత చురుగ్గా పనిచేసిందో అర్థం చేసుకోవచ్చు ఇక ECOSYSTEM గనుక ఏ విషయానైనా… వ్యక్తినైనా తెగ ఎత్తుకుందంటే, అది ఖచ్చితంగా మన దేశానికి నష్టం చేసేదే అని ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాలి.
ఇక ఈ సందర్బంగా ఈ మహానుభావుడి సస్పెన్షన్ పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోడం చాలా అవసరం కదా…! మరెవేంటో తెల్సుకుందాం!! 2023లో పార్లమెంటులో “ఢిల్లీ సర్వీసెస్ బిల్లు”పై జరిగిన ప్రతిపాదిత సెలెక్ట్ కమిటీలో ఈ రాఘవ్ ఛద్దా తమ సంతకాల్ని “FORGERY” చేసి, తమ పేర్లు తమ అనుమతి లేకుండా చేర్చాడని పలువురు ఎంపీలు ఆరోపించడంతో రాఘవ్ చద్దాపై విచారణ చేసి, అది నిజమని తేలడంతో రాజ్యసభ నుండి ఇతన్ని సస్పెండ్ చేశారు.
ఇకప్పుడు ఢిల్లీలో ఇతని ఆప్ పార్టీ అధికారంలో ఉండటంతో దానిపై పెద్ద రాద్ధాంతం చేయడంతో ఆఁ విషయం కాస్తా పార్లమెంటులో ఒక ప్రధాన సమస్యగా మారింది. ఆఁ తరువాత పార్లమెంటరీ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన కేసులను పరిశీలించే ప్రివిలేజెస్ కమిటీకి పంపబడింది. దానితో ఆఁ సస్పెన్షన్ దేశవ్యాప్తంగా విస్తృత రాజకీయ చర్చకు దారితీసింది.
అయితే తన సస్పెన్షన్ను సవాల్ చేస్తూ, రాఘవ్ ఛద్దా సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. ఇక నేరస్తుల్ని వెనకేసుకురావడం… వాళ్లకు కాపు కాయడమే తన నైజమైన సుప్రీంకోర్టు, ఆఁ సస్పెన్షన్ పై యధావిధిగా “స్టే” విధించింది. అయితే తాము ప్రస్తుతం తన సస్పెన్షన్ పై “స్టే” విధించినప్పటికీ కూడా, పార్లమెంట్ హక్కుల కమిటీ సదరు “ఫోర్జరీ” పై విచారణ చేసి, అతనిపై తగిన చర్యలు తీసుకునే హక్కు సదరు కమిటీకి వుంటుందని స్పష్టం చేసింది.
ఇకప్పటి నుండి తన “ఫోర్జరీ” బాగోతం కప్పిపుచ్చుకొని, దేశ ప్రజల ద్రుష్టి మరలించడానికి రాజ్యసభలో ఇలా తెగ పెద్ద పెద్ద నీతులు చెప్పడం మొదలెట్టాడీ మహానుభావుడు.
ఇకిప్పుడు రాఘవ్ చద్దా కేవలం సుప్రీంకోర్టు తాత్కాలికంగా ఇచ్చిన “స్టే” ద్వారా మాత్రమే రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతుండడం గమనార్హం. తాను తన తోటి పార్లమెంట్ సభ్యుల సంతకాల్ని “ఫోర్జరీ” చేసినందుకే తాను రాజ్యసభ నుండి “సస్పెండ్” అయ్యననే అసలు విషయం గురించి ఎక్కడా… ఎప్పుడూ చెప్పకుండా… దాన్ని దాచేసి, కేవలం “సస్పెన్షన్” అనేదాన్ని మాత్రమే హైలెట్ చేస్తుండడం గమనార్హం.
ఇలాంటి ఓ ఫోర్జరీగాడిని.. తన చేసిన అసలు తప్పును చెప్పకుండా “సస్పెన్షన్” విషయాన్ని మాత్రమే చెప్పే వాడిని కేవలం మోడీ & బీజేపీ పై వున్న వ్యతిరేకతతో వెనకేసుకు వచ్చేవారు కొందరైతే, ఇక రాజకీయ పరిజ్ఞానం అస్సల్లేని అజ్ఞానులు మరికొందరు తెగ పైకి ఎత్తుతున్నారు.
Actually he fit for nothing and mere smart appearance and smart talking won’t make leaders. Attire attracts but doesn’t make to stand forever.
– హేజీబు శ్రీనివాసరావు
. Advocate
Ex.Addl. CGSC