-అనంతపురం మార్కెట్ యార్డులో ఏసీబీ సోదాలు
-ఎవరూ గుర్తుపట్టకుండా మారు వేషంలో వెళ్లారు
అనంతపురం : అనంతపురం మార్కెట్ యార్డులో ఏసీబీ సోదాలు జరిగాయి. యార్డులో అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు రావడంతో ఎవరూ గుర్తుపట్టకుండా మారు వేషంలో ఏసీబీ అధికారులు అక్కడికి చేరుకున్నారు. మార్కెట్ యార్డులో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని గుర్తించారు. వివరాల్లోకి వెళితే…
అనంతపురం మార్కెట్ యార్డ్ కు ముగ్గురు వ్యక్తులు లుంగీ, పాత చొక్కా, మెడలో తువ్వాలుతో లోపలికి వెళ్లారు. గొర్రెలు, ఎద్దులు కొనడానికి వచ్చారని అధికారులు భావించారు. కొద్దిసేపటికి అసలు విషయం బయటపడింది. వచ్చింది ఏసీబీ అధికారులని తెలిసి అవాక్కయ్యారు. అవినీతి చేసేవారిని పట్టుకునేందుకు ఇలా మారు వేషంలో వెళ్లారని తేలింది. యార్డులో అక్రమాలు చేస్తున్న వారి ఆట కట్టించినట్లు సమాచారం.