-8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాలను ఘనంగా నిర్వహించిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్
-యోగాభ్యాసం మనిషి యొక్క శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదపడుతుంది
-యోగాను నియమం తప్పకుండా ఆభ్యాసం చేయాలి
-ప్రపంచమంతా యోగాను అంగీకరించడం మన సంస్కృతికి దక్కిన గౌరవం అన్న నందమూరి బాలకృష్ణ
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ యొక్క ప్రత్యామ్నాయ వైద్య విధాన విభాగం యాడ్ లైఫ్ వారి ఆధ్వర్యంలో 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యాడ్ లైఫ్ యోగా విభాగాచార్యులు ఉదయ కుమార్ ప్రత్యేకమైన యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నందమూరి బాలకృష్ణ, ఛైర్మన్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ మరియు శాసనసభ్యులు, హిందుపురం అసెంబ్లీ, ఆంధ్రప్రదేశ్ వారు హాజరైనారు.
ఓంకార స్వరం పలకడంతో ప్రారంభించబడిన ఈ యోగా కార్యక్రమంలో యాడ్ లైఫ్ కు చెందిన యోగా గురువు ఉదయకుమార్ అందరిచే పలు రకములైన యోగాసనములు అభ్యాసం చేయించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ముందుగా నందమూరి బాలకృష్ణ కార్యక్రమానికి గురువుగా వ్యవహరించిన ఉదయకుమార్ ని సత్కరించారు.
అనంతరం నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ కార్యక్రమానికి హాజరైన వారికి స్వాగతం పలుకుతూ 8 వ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. 15 దేశాలతో మొదలై 175 దేశాలకు ఈ యోగా దినోత్సవం నేడు విస్తరించిందని, దీంతో ప్రపంచమంతా మన రుషులు, యోగా గురువుల గొప్ప తనాన్ని ప్రపంచమంతా అంగీకరించి గౌరవాన్నిచ్చారని తెలిపారు. ఓంకారంతో ప్రారంభించబడే ఈ యోగా
సాధన….షడ్ చక్రాల దర్శన భాగ్యం కలిగిస్తుందని, పూర్వకాలంలో మన రుషులు ఎంతో సాధన చేసి అందించిన ఈ ప్రక్రియను అందరూ కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. యోగా ద్వారా ఒక లక్ష్యం పై మనస్సు ఏకాగ్రతతో సాధించడం వీలవుతుందని చెబుతూ యోగం అంటే మనను మనం గెలుచుకోవడం అని అర్థం అన్నారు. పతంజలి మహర్షి చెప్పినట్లు చంచలమైన మనస్సును గట్టి పరచుకొని చిత్త ప్రవుత్తులను నశం చేసుకొని విజయపధాన సాగించానికి వీలవుతుందని చెప్పారు. మన గురువులు వ్యక్తి మనస్థత్వాన్ని బట్టి పలు రకముల యోగాను నిర్థేశించారని, తద్వారా మనిషిలో నిక్షిప్తమైన శక్తిని వెలికితీయడమే యోగాభ్యాస లక్ష్యమని తెలుసుకోవాలని సూచించారు. అంతే గాకుండా యోగాభ్యాసంతో అంతఃకరణ శుద్ది జరిగి, శరీర రుగ్మతలను నివారించుకోవచ్చని అంటూ యోగాను నిరంతరం అభ్యాసం చేసి దాని మంచి ఫలాలను అందుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ, ఛైర్మన్, BIACH&RI తో పాటూ జె యస్ ఆర్ ప్రసాద్, ట్రస్టు బోర్డు సభ్యులు, BIACH&RI; డా. ఆర్ వి ప్రభాకర రావు, CEO, BIACH&RI; డా. టియస్ రావు, మెడికల్ డైరెక్టర్, BIACH&RI; డా కల్పనా రఘునాద్, ఆసోసియేట్ డైరెక్టర్, అకడమిక్స్ – యాడ్ లైఫ్, BIACH&RI; డా.
ఫణి కోటేశ్వర రావు, మెడికల్ సూపర్నింటెండెంట్, BIACH&RI; డా. సుమతి, ప్రకృతి వైద్య నిపుణులు, యాడ్ లైఫ్, BIACH&RI; డా. ఉదయ్ కుమార్, యోగా గురువు, యాడ్ లైఫ్, BIACH&RI లతో పాటూ పలువురు వైద్యులు, వైద్యేతర సిబ్బంది, పారా మెడికల్ సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు, విద్యార్థిణులతో పాటూ రోగులు, వారి కుటుంభ సభ్యులు పాల్గొన్నారు.