-రాష్ట్ర అంగన్వాడీ అధ్యక్షురాలు ఆచంట సునీత
-వైస్సార్సీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పై ఫిర్యాదు
తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంటరీ అధ్యక్షులు నెట్టెం రఘురాం గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ కోశాధికారి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య సూచనల మేరకు జగ్గయ్యపేట పట్టణ పోలీస్ స్టేషన్ నందు శుక్రవారం నాడు వైస్సార్సీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పై తెదేపా నేతలతో కలిసి రాష్ట్ర అంగన్వాడీ అధ్యక్షురాలు ఆచంట సునీత ఫిర్యాదు చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ శవ రాజకీయాల నుండి పుట్టిన పార్టీ వైసిపి పార్టీ,ప్రతినిత్యం శవ రాజకీయాలు చేసుకుంటూ పబ్బం గడుపుకోవడమే వైయస్సార్సీపీకి తెలిసిన విద్య, జగన్ మోహన్ రెడ్డి గారు తన తండ్రి శవం పక్కన పెట్టుకుని ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు సేకరణ చేయడం జరిగింది వాస్తవం కాదా? లోకేష్ గారికి జనంలో పెరుగుతున్న ఆదరణ చూసి ఎదురుగా ఎదుర్కొనలేక వైసీపీ చేస్తున్నటువంటి విష ప్రచారం చాలా సిగ్గుచేటు,స్వర్గీయ నందమూరి తారక రామారావు కుమార్తె మరణించి ఆ కుటుంబం విషాదఛాయలు నెలకొన్న పరిస్థితుల్లో విరోధులైన ఒక్క నిమిషం బాధతో ఆలోచన చేస్తారు, కానీ విజయసాయిరెడ్డి, లక్ష్మీపార్వతి లాంటి మానవత్వం లేని మనుషులు వ్యవహరిస్తున్న తీరు సభ్య సమాజానికి సిగ్గుచేటు అని ఇకనైనా వారి ప్రవర్తనలో మార్పు చేసుకోవాలని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి కొటారు సత్యనారాయణ ప్రసాద్, పట్టణ పార్టీ అధ్యక్షులు మేకా వెంకటేశ్వర్లు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కన్నబోయిన రామలక్ష్మి ప్రసాద్, కౌన్సిలర్లు కంచేటి గీతారాణి, షేక్ సిరాజ్ న్, గెల్లా.సంధ్యారాణి, సూర్యదేవర ఉషారాణి,పార్లమెంట్ సెక్రటరీ గట్టిడి దుర్గాప్రసాద్, నియోజకవర్గ రైతు కమిటీ అధుక్షలు కానూరి కిషోర్,జామియా మసీదు మాజీ ప్రెసిడెంట్ సయ్యద్ అన్వర్,మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ షేక్ సత్తార్,మాజీ కౌన్సిలర్ కొర్రకూటి సైదులు, కర్లజోజి,గెల్లా వైకుంఠేశ్వరరావు, సూర్యదేవర రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.