Suryaa.co.in

Andhra Pradesh

ఒంటిమిట్ట వెళ్లే ఇష్టం లేకనే కాలు బెణికిందంటూ జగన్ డ్రామాలు

-కాలు బెణికిందన్న సాకుతో ఒంటి మిట్ట సీతారాముల వారి కళ్యాణానికి వెళ్లని జగన్ నేడు చిలకలూరిపేట పర్యటనకు ఎలా వెళ్లారు?
-సతీసమేతంగా ఒంటిమిట్ట వెళ్లే ఇష్టం లేకనే కాలు బెణికిందంటూ జగన్ డ్రామాలు
-జగన్ తన వ్యవహారశైలితో హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు
– కింజరాపు అచ్చెన్నాయుడు

కాలు బెణికిందన్న సాకుతో ఒంటి మిట్ట సీతారాముల వారి కళ్యాణానికి వెళ్లకుండా ఎగ్గొట్టిన సీఎం జగన్ నేడు చిలకలూరిపేట పర్యటనకు ఎలా వెళ్లారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. గురువారం నాడు టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. శ్రీ రాముడు ఆదర్శప్రాయుడు, ప్రతి ఒక్కరూ కొలుస్తారు, ఉమ్మడి ఏపీలో భద్రాచలంలో అంగరంగ వైభవంగా రాముల వారి కళ్యాణం చేయడం ఆనవాయితీ.ఏపీ విభజన తర్వాత ఆ సంప్రదాయాన్ని ఒంటిమిట్ట కోదండరామాలయంలో టీడీపీ ప్రభుత్వం కొనసాగించింది.నాటి సీఎం చంద్రబాబు ఒంటిమిట్ట ఆలయాన్ని అభివృద్ధి చేశారు.అధికారిక లాంఛనాలతో ఒంటిమిట్ట కోదండ రామాలయంలో కళ్యాణాన్ని జరిపించాం.కళ్యాణోత్సవానికి సీఎం దంపతుల వెళ్లడం ఆనవాయితీ.శ్రీరామ నవమి రోజున రాముల వారి కళ్యాణోత్సవానికి సీఎం జగన్ వెళ్తారని షెడ్యూల్ ఇచ్చారు.కానీ కాలు బెణికిందనే సాకుతో జగన్ ఒంటిమిట్ట వెళ్లలేదు.సతీ సమేతంగా వెళ్లాలి కాబట్టే జగన్ ఒంటిమిట్ట వెళ్లలేదు. జగన్ వేరే మతాన్ని ఆచరించొచ్చు.. కానీ సీఎం హోదాలో ఒంటిమిట్ట వెళ్లాలి కదా..? కాలు నొప్పి సాకుతో ఒంటిమిట్ట వెళ్లని జగన్ ..నిన్న జగ్జీనన్ రాం జయంతి, నేడు చిలకలూరి పేట కార్యక్రమాల్లో ఎలా పాల్గొన్నారు? ఒక్క రోజులోనే కాలు నొప్ప్పి తగ్గిందా? సీతారాముల వారి కళ్యాణానికి సతీసమేతంగా వెళ్లే ఇష్టం లేకనే జగన్ రెడ్డి కాలు బెణికిందంటూ కుంటి సాకు చెప్పారు. జగన్ రెడ్డి తన వ్యవహారశైలితో కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. పాదయాత్రలో అన్ని వేల కి.మీ నడిస్తే బెనకని కాలు, కేవలం సీతారాముల కళ్యాణం ముందు రోజే బెణుకుతుందా? పెళ్లిళ్లకు, పేరంటాలకు సతీసమేతంగా పాల్గొనే జగన్ రెడ్డి హిందూ దైవ కార్యక్రమాలకు మాత్రం ఎందుకు దూరంగా ఉంటున్నారు?తిరుమల శ్రీ వారి దర్శనానికి వెళ్లే ముందు డిక్లరేషన్ మీద జగన్ రెడ్డి ఎందుకు సంతకం పెట్టలేదు? రామతీర్ధంలో రాముడి విగ్రహం శిరస్సు ద్వంసం చేస్తే నిందితులపై చర్యలు లేవు. అంతర్వేదిలో రధం తగులపెడితే తేనే తీగలు వల్ల ప్రమాదం జరిగిందని చెప్పి పక్కన పెట్టేశారు. వైసీపీ పాలనలో పవిత్రమైన తిరుమలలో గంజాయి విక్రయాలు జరుపుతున్నారు. 4 ఏళ్లల్లో 280కి పైగా దేవాలయాలపై దాడులు జరిగితే వాటిపై చర్యలు తీసుకోలేదు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అన్ని మతాలు, కులాలకు ప్రాముఖ్యతను ఇవ్వాలి. కానీ జగన్ రెడ్డి మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తించడం సిగ్గుచేటని అచ్చెన్నాయుడు మండి పడ్డారు.

విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ……..
మంత్రి ధర్మానకు మైండ్ పని చేయడం లేదు, ధర్మాన తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ బ్యాలెన్స్ తప్పలేదు. తాను పార్టీలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు.. ప్రజా వ్యతిరేకతతో ధర్మాన బ్యాలెన్స్ తప్పారు.ధర్మాన మహిళల ముందు మీసాలు మేలేస్తున్నారు.. తొడ కొడుతున్నారు.మగాళ్లను పొరంబోకులు అంటూ ధర్మాన విపరీత వ్యాఖ్యలు చేస్తున్నారు. సీఎం జగన్, ధర్మాన కూడా మగాళ్లే కదా..? వాళ్లూ పొరంబోకులేనా..? బీసీలకు పెద్దపీట వేశామంటున్నారు, కానీ బీసీ మంత్రులు సీఎంవో కి తెలియకుండా కనీసం ఓ కానిస్టేబుల్ ని ట్రాన్సఫర్ చేయించుకోగలరా? 40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని నేనేం అబద్దాలు చెప్పడం లేదు.చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉండడమే కాకుండా ఎదురు మాకే ఆపర్లు ఇస్తున్నారు. ఒక్కరికి సీటిస్తామనే హామీ ఇస్తే.. నలుగురం వస్తామంటూ ఫోన్లు చేస్తున్నారు. వైసీపీలో ఉంటే తమకు భవిష్యత్తు ఉండదని ఆ పార్టీ నేతలకు అర్థమైపోయింది. మాతో టచ్ లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేల పేర్లు మేమేందుకు చెప్పాలి..?మాతో టచ్ లో ఉన్న ఎమ్మెల్యేల జాబితా చెప్పాలని ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేయడం పిచ్చితనమే. మేం టీడీపీలోకి వెళ్లం.. వైసీపీతోనే మా జీవితం అంటూ గంభీరంగా చెప్పే వాళ్లే టీడీపీలో చేరేందుకు ముందు వరుసలో ఉన్నారని అచ్చెన్నాయుడు అన్నారు.

LEAVE A RESPONSE