– దేశద్రోహులను పెంచిపోషిస్తున్న జగన్ లాంటి వ్యక్తులను మేథావులు ప్రశ్నించాలి
– మాజీమంత్రి కె.ఎస్.జవహర్
స్వాతంత్ర్యం కోసం పోరాడిన గాంధీని ఓ వర్గానికి అంటగట్టేలా మాట్లాడటం దుర్మార్గం. మహాత్మాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ ను పదవి నుండి తొలగించి తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. స్వాతంత్ర్య సమరయోధులను విమర్శించే విక్టర్ ప్రసాద్ లాంటి దేశ ద్రోహులను పదవుల్లో ఎలా కొనసాగిస్తారు.?
ఇవాళ గాంధీని విమర్శించిన వ్యక్తి..రేపు అంబేద్కర్ ను కూడా అవమానిస్తారు. విక్టర్ లాంటి దేశద్రోహులను జగన్ పాలుపోసి పెంచుతున్నారు. అంటరానితనాన్ని రూపుమాపేందుకు పోరాడిన గాంధీ దళిత వ్యతిరేకి ఎలా అవుతారు.? ఎస్సీల భూముల్ని మింగిన వైఎస్ కుటుంబం ఎస్సీల ద్రోహి. ఎస్సీ నిధులను మూడేళ్లుగా దారి మళ్లిస్తూ వారి జీవనోపాధిని దెబ్బతీసిన జగన్ ఎస్సీల పాలిట శాపంగా మారారు.
75 ఏళ్లలో దేశంలో ఎప్పుడూ జరగనన్ని దాడులు, హత్యలు జగన్ రెడ్డి హయాంలోనే ఎస్సీలపై జరుగుతున్నాయి. ఎస్సీ శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన జగన్ రెడ్డిని ఏనాడైనా ఈ వైసీపీ నేతలు నిలదీశారా.? దళిత యువతుల్ని మానబంగం చేసి హతమారుస్తున్న వారిని వెనకేసుకొస్తున్న జగన్ రెడ్డి ఎస్సీల వ్యతిరేకి కాక ఇంకేమవుతారు.? సమాజంలో సమానత్వాన్ని సాధించడమే లక్ష్యంగా మహాత్మాగాంధీ పరితపిస్తే..ఆయన సిద్ధాంతాలకు విరుద్ధంగా జగన్ ప్రవర్తిస్తున్నది నిజంకాదా.? విక్టర్ ప్రసాద్ లాంటి వ్యక్తులకు ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి ఇచ్చి దళితులను అణగదొక్కేలా ప్రయత్నిస్తున్నారు. తక్షణమే విక్టర్ ప్రసాద్ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.