Suryaa.co.in

Andhra Pradesh

మాంసాహారం వండటంపై చర్యలు

– కాంట్రాక్టర్‌ లైసెన్స్‌ రద్దు

పెద కాకాని :సంచలనం సృష్టించిన గుంటూరు జిల్లా పెదకాకాని మల్లేశ్వరస్వామి దేవస్థాన ప్రాంగణంలో మాంసాహారం వండిన ఘటనపై అధికారులు చర్యలు చేపట్టారు. దేవస్థానంలో మెస్‌, క్యాంటీన్‌ను అధికారులు సీజ్‌ చేశారు. కాంట్రాక్టర్‌ లైసెన్స్‌ను కూడా రద్దు చేసినట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖా గుంటూరు డిప్యూటీ కమిషనర్‌ చంద్రశేఖరరెడ్డి తెలిపారు. మరోవైపు.. బీజేపీ, పలు ధార్మిక సంఘాల నాయకులు దేవస్థానంలో శుక్రవారం ఆందోళనలు చేపట్టారు. దేవస్థాన ఆవరణలో వైసీపీ నాయకుల ఫ్లెక్సీలు ఏమిటని ప్రశ్నించారు. మెస్‌ కాంట్రాక్ట్‌ లైసెన్సును వైసీపీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య అనుచరుడు, ఎంపీటీసీ భర్త షరీ్‌ఫకు ఎలా ఇచ్చారంటూ డిప్యూటీ కమిషనర్‌ను నిలదీశారు. తొలుత పెదకాకాని గ్రామస్తులు క్యాంటీన్‌, మెస్‌ ప్రాంతాలతో పాటు ఆలయ ప్రాంగణాన్ని ఆవు పాలతో శుద్ధి చేశారు.

LEAVE A RESPONSE