– డీజీపీకి రాష్ట్ర మహిళా కమిషన్ లేఖ
– స్పెషల్ టీమ్ లతో నిఘా అవసరం : వాసిరెడ్డి పద్మ
– మహిళలపై నోరుజారొద్దని రాజకీయ పార్టీలకు ట్వీట్ తో హితవు
అమరావతి: సోషల్ మీడియాలో మహిళలను అసభ్యకరమైన పదజాలాలతో ధూషిస్తూ నీచాతినీచంగా పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ డీజీపీని కోరారు. ఈమేరకు ఆమె రాష్ట్ర డీజీపీకి శనివారం లేఖను పంపారు. రాజకీయ దురుద్దేశాలతో కుట్రపూరిత దాడులకు మహిళల్ని టార్గెట్ చేసి అవమానకరమైన వ్యాఖ్యలతో తూలనాడటం.. వివిధ రాజకీయ పార్టీల నేతల సోషల్ మీడియా పోస్టింగ్ లపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
స్పెషల్ టీమ్ ల కేటాయింపుతో నిఘా ఉంచి సోషల్ మీడియా పోకడలను కట్టడి చేయాలని వాసిరెడ్డి పద్మ ఆదేశించారు. అదేవిధంగా ‘ఐటెం’ వంటి పదాలకు జైలు శిక్షలు పడుతున్న విషయాన్ని రాజకీయ పార్టీలు గుర్తించాలని, తన ట్విట్టర్ పోస్ట్ ను అన్ని రాజకీయ పార్టీలకు ట్యాగ్ చేసి వాసిరెడ్డి పద్మ హితవు చెప్పారు.