– ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టు లపై జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర వైద్యా, ఆరోగ్య శాఖ దామోదర్ రాజనర్సింహ ఉన్నత స్థాయి సమీక్ష
హైదరాబాద్ : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని ప్రాజెక్టు లను శరవేగంగా పూర్తిచేసేలా కార్యాచరణను రూపొందించేందుకు యాక్షన్ ప్లాన్ ను అమలు చేయాలని ఉమ్మడి జిల్లా శాసనసభ్యులు జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర్ రాజనర్సింహని కోరారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నా ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో నిర్వహించనున్న సమీక్ష సమావేశం కు ముందస్తు సన్నాహా సమావేశం లో శాసనసభ్యుల అభిప్రాయాలు, వారి సూచనలు, ప్రాజెక్టులు పూర్తి చేయడానికి అవసరమైన ప్రతిపాదనల పై ఈ సమీక్షల మంత్రులు చర్చించారు.
ఈ సమీక్ష సమావేశం లో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కు చెందిన శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, డా. వంశీ కృష్ణ, పర్ణిక రెడ్డి, వీర్లపల్లి శంకర్, వాకిటి శ్రీహరి, రామ్మోహన్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, మధుసూదన్ రెడ్డి, తుడి మెగా రెడ్డి, డాక్టర్ రాజేష్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డా . మల్లు రవి, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాహుల్ బొజ్జ, ENC లు అనిల్ కుమార్, నాగేంద్ర రావు, CE లు విజయ భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రఘునాధరావు, వివిధ ప్రాజెక్టుల SE లు, ఇంజనీరింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.