Suryaa.co.in

Andhra Pradesh

కుప్పంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన జగన్ రెడ్డి

-వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డి పులివెందుల్లో గెలవడం కూడా కష్టమే
-రాష్ట్రంలో మహిళా కమీషన్ జగన్ రెడ్డి కమీషన్ లా మారింది
– రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత

జగన్ రెడ్డి మూడున్నరేళ్లల్లో చేసింది ఏమీ లేకపోయినా సరే 175 సీట్లు వస్తాయని కన్ఫిడెంట్ గా ఎలా చెప్పగలుగుతున్నారన్న అనుమానం సర్వత్రా నెలకొంది. కాని నేడు అన్నింటిని పటాపంచలు చేసే విధంగా కుప్పం నియోజకవర్గంలో వైసీపీ నాయకులు మాటలు చూస్తుంటే వీళ్ల విధానం ఇదా అని ప్రజలకు అర్ధమైంది. రాష్ట్రంలోని వైసీపీ బడా బడా నాయకులందరూ కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో సూట్ కేసులు పట్టుకొని తిరిగారు.

మొన్న కుప్పం మున్సిపల్ ఛైర్మన్ అధ్యక్షతన జరిగిన కౌన్సిలర్ల సమావేశంలో కార్పొరేటర్ భర్త మాట్లాడుతూ ఎన్నికల్లో ఒక్కో ఓటుకు రూ.5వేలు ఇచ్చాం. ఈ రోజుకు మేము చేసిన పనులకు బిల్లులు రాలేదన్నారు. డబ్బును ఏరుల్లా పారించి ఎన్నికల్లో గెలిచేందుకే బరితెగించారని ప్రజలకు అర్ధమయ్యింది. అందుకేనేమో జగన్ రెడ్డి 175 సీట్లు గెలుస్తామని పదే పదే చెబుతున్నారు. ఇన్నాళ్లు చెట్టు నీడలో ఉన్నామని ప్రజలు అనుకున్నారు కాని విషపు నాగు పడక కింద ఉన్నమని ప్రజలు తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు డబ్బులకు అమ్ముడుపోతారని జగన్ రెడ్డి భావించడం సిగ్గుచేటు. ప్రభుత్వానికి నిధులు నిల్ అయితే భారతీరెడ్డి ఖజానా ఫుల్ గా ఉంది. మద్యంపై 5 ఏళ్లపై రూ.25వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. వైన్, మైన్, శాండ్, లాండ్ ల్లో బరితెగించి వసూళ్లు చేసుకుంటున్నారు. కేవలం జగన్ రెడ్డి అండ్ కో మాత్రమే దోచుకోవాలి దాచుకోవాలి.

పక్క వాళ్లకు కనీసం వాసన కూడా రాకూడదు. 1వ తారీఖు ఉద్యోగస్థులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులేవు గాని వచ్చే ఎన్నికల్లో ఓటుకు రూ.10వేలు పెట్టి కొనేందుకు మాత్రం సిద్ధంగా ఉన్నారు. ఎస్సీల డీ ఫామ్ లాండ్ లు వెనక్కి తీసుకొని ప్లాట్ లు వేసుకొని అమ్ముంటున్నారు. గడపగడపకు వెళ్లేందుకు ధైర్యం లేదు గాని 175 కి 175 ఎలా వస్తాయి? ప్రతి ఒక్క ఎమ్మెల్యే, మంత్రిని ప్రజలు నిలదీస్తుంటే వారిపై కేసులు పెడుతున్నారు.

కుప్పం నియోజకవర్గంలో దేవుడు ఫుటో ప్లేస్ లో బాబు గారి ఫుటో ఉంటుంది. కుప్పాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత చంద్రబాబు ది. కుప్పానికి జగన్ రెడ్డి తెచ్చిన ఒక్క పరిశ్రమ పేరు చెప్పే దమ్ము ఏ ఒక్క వైసీపీ నాయకుడికి ఉందా? పులివెందులకు నీరిచ్చిన ఘనత చంద్రబాబు గారిది. పులివెందుల నియోజకవర్గంలో ఒక ఎస్సీ మహిళ నాగమ్మ చనిపోతే నిందితుల మీద ఇంత వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? మూడున్నరేళ్లల్లో 20వేల మందికిపైగా మహిళలపై అఘాయిత్యాలు, అకృత్యాలు జరిగితే ఏం చర్యలు తీసుకున్నారు? 5వేల మంది రైతుల ఆత్మహత్యలు జరిగాయి.

వైసీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా గన్ మెన్ ఇబ్బంది పెడుతున్నారని నేడు సీఎం ఇంటి దగ్గర ఒక మహిళా బ్లేడ్ తో కోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంది. జగన్ రెడ్డిని కలవనియ్యని వాళ్లు నేడు జగనన్నకు చెబుతామంటూ కార్యక్రమం పెట్టడం సిగ్గుచేటు. డబ్బులు ఎంత వచ్చాయి, ఎన్ని వచ్చాయి. టీడీపీ నాయకులపై ఎన్ని కేసులు పెట్టారు, మీడియా వాళ్లపై ఎన్ని కేసులు పెట్టారు ఇలాంటివి మాత్రమే జగనన్న వింటాడు. పులివెందుల్లో గెలిచేందుకు జగన్ రెడ్డి ట్రై చేయాలి. పాలన చేతగాక ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారేమోనని ప్రాంతాల మధ్య విధ్వేషాలు రెచ్చగొడుతున్నారు.

దొంగే దొంగ అన్నట్లుగా ఉంది
ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానిపై సోషల్ మీడియాలో దూర్బాషలాడారని ఫిర్యాదు చేస్తే ఇంత వరకు చర్యలు లేవు. అమరావతి మహిళా రైతులు పాదయాత్రకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తే గర్బం వస్తుందని వైసీపీ నాయకుడు దేవేందర్ రెడ్డి పోస్ట్ పెడితే ఇంత వరకు చర్యలు తీసుకోలేదు? మహిళా కమీషన్ కు దమ్ముంటే వీటి మీద ఎందుకు డీజీపీని కలవరు? కేవలం భారతీ రెడ్డిపై పోస్ట్ పెడితేనే చర్యలు తీసుకుంటారా? మహిళా కమీషన్ అంటే కేవలం జగన్ రెడ్డి కమీషనా? మహిళా కమీషనా?
మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల మీద డీజీపీకి ఫిర్యాదు ఇవ్వాలని మూడు సార్లు ప్రయత్నిస్తే ఇంత వరకు అతిగతి లేదు. నేడు ఆడ బిడ్డలకు రక్షణ లేదు. ఊరుకో ఉన్మాది ఉన్నారు. ఆడబిడ్డలు అఘాయిత్యాలకు పాల్పడానికి కారణం తల్లి దండ్రుల పెంపకమని హోం మంత్రి చెప్పడం సిగ్గుచేటు.

LEAVE A RESPONSE