హైదరాబాద్, జులై 05: తెలంగాణ రాష్ట్రంలో ఇంజి నీరింగ్ విద్యను అందించే 200 విద్యాసంస్థలకు అఖిల భారత సాంకేతిక విద్యామం డలి(ఏఐసీటీఈ) అనుమతి జారీ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వ, ప్రయివేట్ కళాశాలలతో పాటు 10 డీమ్డ్ వర్సిటీలు లేదా వాటి ఆఫ్ క్యాంపస్‌లు ఏఐసీటీ ఈకి దరఖాస్తు చేసి అనుమ తులు పొందాయి. ఈసారి కొత్తగా హైదరాబాద్‌లోని దేశముఖ్ వద్ద విజ్ఞాన్ డీమ్డ్ విశ్వవిద్యాలయం(గుంటూరు) ఆఫ్ క్యాంపస్ ప్రారంభా నికి ఏఐసీటీఈ పచ్చజెండా ఊపింది.
కొడంగల్ నియోజకవర్గం లోని కోస్గిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈసారి మూడు బ్రాంచీల్లో బీటెక్‌ను ప్రారంభించేందుకు అనుమతి లభించింది.