Suryaa.co.in

Andhra Pradesh

అర్చక వేతనాల పెంపుపై అఖిల భారతీయ బ్రాహ్మణ మహాసంఘం హర్షం

ఒంగోలు, ఆగష్టు 28: రాష్ట్ర ముఖ్యమంత్రి దేవాదాయశాఖపై సమీక్ష నిర్వహించి, రూ.10 వేలు వేతనం వచ్చే అర్చకులకు ఇకపై రూ.15 వేలుగా పెంచడం హర్షణీయమని అఖిల భారతీయ బ్రాహ్మణ మహాసంఘ రాష్ట్ర టెక్నికల్ డైరెక్టర్ డా. లంకా ప్రసన్న కుమార్ శర్మ అన్నారు. స్థానిక కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో అయన మాట్లాడుతూ ధూపదీప నైవేద్యాలకు ఇచ్చే మొత్తం రూ.5 వేల నుంచి 10 వేలకు పెంపు, నిరుద్యోగ వేద విద్యార్ధులకు నెలకు రూ. 3 వేలు భృతి ఇవ్వటానికి చర్యలు చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు అయన కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్రంలోని దేవాలయాల్లో ఆధ్యాత్మిక వెల్లివిరవాలని, అపచారాలకు చోటు ఉండకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించటం శుభపరిణామం అన్నారు. భక్తులు ప్రశాంతత కోసం, తమ బాధలు దేవుడితో చెప్పుకోవడం కోసం గుళ్లకు వస్తారని అలాంటి వారికి మంచి దర్శనం, చక్కటి వాతారణం కల్పించాల్సిన అవసరం ఉందని సిఎం అన్నారన్నారు. దేవాలయాల్లో పరిశుభ్రత, ప్రసాదంలో నాణ్యత, ప్రశాంత వాతావరణం కనిపించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తీసుకున్న అభివృద్ధి చర్యలపై, బ్రాహ్మణ జాతి అభివృద్ధికి దోహపడుతున్నందుకు, సంబంధిత మంత్రులకు ఆదేశాలు జారీ చేయడంపై ఎబిబిఎం తరపున డా. లంకా తమ సంపూర్ణ మద్దతు తెలిపారు.

LEAVE A RESPONSE