Suryaa.co.in

Andhra Pradesh

సభలో అందరూ చూపు లోకేష్ వైపే..

మంగళగిరి ఎమ్మెల్యేగా తిరుగులేని మెజారిటీతో విజయం సాధించిన లోకేష్ తొలిసారి శాసన సభ్యుడి హోదాలో అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ సందర్భంగా ఆయన తన మంత్రివర్గ సహచరులు శాసనసభ సభ్యుల వద్దకు వెళ్లి తనను తాను పరిచయం చేసుకుని వారిని అభినందించారు. ప్రధానంగా సభలోనే ఉన్న తన తండ్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్లిన లోకేష్ ను చంద్రబాబు అభినందించిన దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. ఈ విధంగా తండ్రి కొడుకులు ఒకే సభలో ఉండటం బహుశా విభజిత ఆంధ్రప్రదేశ్ శాసనసభ చరిత్రలో ఇదే తొలిసారి.

లోకేష్ గతంలో శాసనసభలో మంత్రి హోదాలో అడుగుపెట్టినప్పటికీ అప్పుడు ఆయన శాసన మండల సభ్యుడు. అంతేకాదు చంద్రబాబు నాయుడు.. బావమరిది నందమూరి బాలకృష్ణ. ఆయన అల్లుడు లోకేష్.. ఇలా నారా నందమూరి- కుటుంబాలు అసెంబ్లీలో సభ్యులవటం కూడా ఒక విశేషం.

LEAVE A RESPONSE