– ఎన్నికల హామీలపై ఏమాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నాడు
: మాజీ ఎంపీ మార్గాని భరత్ ఫైర్
రాజమండ్రి: చంద్రబాబు, లోకేష్‌లను సీఎంలను చేసే కాంట్రాక్టు పనులను చేయడం తప్పించి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని మాజీ ఎంపీ మార్గాని భరత్ విమర్శించారు. రాజమండ్రి లోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ టైంపాస్ చేస్తున్నాడే కానీ ఏమాత్రం సీరియస్ పొలిటీషియన్‌లా వ్యవహరించడం లేదని మండిపడ్డారు.
రాజమండ్రి పర్యటనకు వచ్చిన మంత్రి నారా లోకేష్ రౌడీలు, భూకబ్జాలు, ఇసుక దోపిడీ చేసే వారితోనే రోడ్ షో నిర్వహించడం ద్వారా వారికి తన మద్ధతుందని, వారి దోపిడీలో తనకూ వాటా ఉందనే సందేశం పంపారని భరత్ ఆరోపించారు. వైయస్సార్సీపీ హయాంలో అభివృద్ది చేసిన ప్రాంతంలోనే లోకేష్ పర్యటన సాగిందని, వైయస్ జగన్ గారు వేల కోట్లతో అభివృద్ధి చేసిన పనులకే లోకేష్ రిబ్బన్ కటింగ్‌లు చేసి వెళ్లాడని చెప్పారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక ఏడాదిన్నర పాలనలో రాజమండ్రి ప్రాంతంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి కార్యక్రమం ఏ ఒక్కటీ జరగలేదని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రశ్నిస్తుంటే వాటికి సమాధానం చెప్పుకోలేక మాజీ ముఖ్యమంత్రి వైయష్ జగన్ గారిని సైకో అంటూ దూషిస్తున్నాడని, ఖచ్చితంగా ఇలాంటి మాటలకు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.
రాజమండ్రి పర్యటనకు వచ్చిన నారా లోకేష్ భూ కబ్జాలు, ఇసుక దోపిడీ, మహిళల మీద దాడులు చేస్తున్న ముఠాలతో కలిసి తిరగడం ద్వారా వారి దోపిడీకి పూర్తి స్వేచ్ఛనిచ్చాను. అందులో నాపాత్ర కూడా ఉందనే సందేశం ప్రజలకు పంపించా రు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి రెడ్ బుక్ ను నమ్ముకున్నానని, మూడు పేజీలే వాడానని, ఇంకా పేజీలున్నాయని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నా రు. ఒక మంత్రి మాట్లాడాల్సింది ఇలాగేనా? అధికారంలోకి వస్తే మహిళల అకౌంట్లో నెలకు రూ. 1500 జమ చేస్తామని హామీ ఇచ్చి ఇవ్వకపోగా, లోకేష్ పర్యటనకు డ్వాక్రా మహిళలను బెదిరించి తరలించి రోడ్లపై తిప్పారు.
మంగళగిరి ఎయిమ్స్ని కూడా ప్రైవేటుపరం చేస్తామని, కేంద్రానికి చంద్రబాబు ప్రపోజల్ ఎందుకు పెట్టలేకపోతున్నారు. ? ఈవీఎం ఎమ్మెల్యే అనుచరుడు ఒక మైనర్ బాలిక మృతికి కారణమైనా దానిపై నారా లోకేష్ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం సిగ్గుచేటు. మృతురాలి కుటుంబానికి న్యాయం జరిగేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు.
నిడదవోలు పర్యటనకు వచ్చిన పవన్ కళ్యాణ్ కూడా అచ్చం ఇలాగే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వారిపై నోరు పారేసుకున్నారు. ఉపాధి హామీ పథకంలో రాష్ట్రంలో 18 లక్షల మందిని తొలగిస్తే తాను మంత్రిగా బాధ్యత వహించకుండా వైయస్సార్సీపీ నాయకుల కాళ్లు కీళ్లు విరిచేస్తానని చెప్పడం బాధ్యతారాహిత్యమే. కార్డుల తొలగింపుపై చంద్రబాబుని ప్రశ్నించకుండా ఇంకో 15 ఏళ్లపాటు ఆయనే సీఎంగా ఉంటాడని భజన చేయడం సిగ్గుచేటు. ఎన్నికలకు ముందు అభ్యుదయవాదిలాగా మాట్లాడి, తానొస్తే అంతా మార్చేస్తానని అరచేతిలో వైకుంఠం చూపించి తీరా గెలిచాక ప్రజలను గాలికొదిలేశారు. .
ఇదేందని ప్రశ్నించే వారిమీద కేసులు పెడతామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ బెదిరిస్తున్నారు. వీరికి ప్రజాస్వామ్యం మీద కానీ, రాజ్యాంగం మీద కానీ గౌరవం లేదు. అధికారంలో ఉన్న ఐదేళ్లు ఎంత వీలైతే అంత దోచుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు తప్పితే ఎన్నికల హామీల అమలు గురించి ఏమాత్రం చిత్తశుద్ధితో వ్యవహరించడంలేదు.
ఆఖరుకి చంద్రబాబు కోసం తనను నమ్ముకున్న కాపు కులాన్ని తాకట్టు పెడుతున్నారు. చంద్రబాబు, లోకేష్‌లను సీఎం చేసే కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ కాంట్రాక్టు వర్కులు చేస్తున్నా రు. ఏమాత్రం బాధ్యత లేన రాజకీయ నాయకుడిగా పవన్ కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తనకు కేంద్రంలో పెద్దలు తెలుసని మాటల్లో చెప్పుకుంటే సరిపోదు. కేంద్రం నుంచి నిధులు తెచ్చి అభివృద్ది కార్యక్రమాల ద్వారా తన గొప్పతనం చూపించాలని మార్గాని భరత్ అన్నారు.