Suryaa.co.in

Andhra Pradesh

సోము వీర్రాజు అరెస్ట్ కు రంగం సిద్ధం…

మండపేట లో లొంగుబాటు?

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అరెస్ట్ కు పోలీసులు రంగం సిద్ధం చేశారు.రెండు నెలలు క్రితం జొన్నడా సెంటర్ లో సోము ను పోలీసులు అడ్డుకున్నారు. ఆ సందర్భంగా ఆలమురు ఎస్ ఐ సోమన శివ

ప్రసాద్ పై సోము దురుసుగా ప్రవర్తించిన ఘటన లో పోలీసు అధికారులు ఆయనపై కేసు నమోదు చేశారు. కాగా ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ కాగా ఇప్పటికీ పెండింగ్ లోనే ఉంది. దీంతో ఆయన్ను అదుపులోకి తీసుకోవాలని పోలీసులు యత్నించారు. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న నేపద్యంలో అరెస్ట్ జాప్యం అవుతుందని పోలీసులు చెబుతున్నారు. సోము కూడా ఈ కేసు లో అరెస్ట్ కావాలని భావిస్తున్నారు. ఇందుకు మండపేట టౌన్ వేదిక గా రెండు రోజుల్లో లొంగిపోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పోలిస్ నిఘా వర్గాలకు దీనిపై సమాచారం అందింది. మండపేట లో లొంగిపోయి ఆలమురు కోర్టు కు వెళ్లి బెయిల్ తీసుకోవాలని బీజేపీ అధిష్టానం సూచించిందని తెలిసింది. కాగా సోము బిజెపి అధ్యక్షులు గా ఎన్నికై బుధవారం నాటికి రెండేళ్లు పూర్తి అయింది.సోము అరెస్ట్ పై బీజేపీ వర్గాల్లో ఉత్కంఠత నెలకొంది.

LEAVE A RESPONSE