రామోజీరావుపై యూరీరెడ్డి అతని కుటుంబసభ్యుల షేర్ల కథలన్నీసజ్జల, జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ లో భాగమే
• యూరీ రెడ్డిని నిజంగా రామోజీరావు బెదిరించి షేర్లు బదలాయించుకుంటే, ఆర్.వో.సీకి, ఎన్.సీ.ఎల్.టీకీ ఎందుకు ఫిర్యాదు చేయలేదు?
• యూరీరెడ్డి ఇంటినుంచి బయటకు రాలేకపోయినా మెయిల్ పెట్టినా, ఆనాడే షేర్ల బదిలీ ప్రక్రియ నిలిచిపోయేది కదా!
• యూరీరెడ్డిని, అతని కుటుంబాన్ని రామోజీరావు బెదిరించాడనటం, సాక్షిలో విషపురాతలతో రామోజీరావుపై కథనాలు వండివార్చడం జగన్ డైరెక్షన్ లో భాగమే• జింకా నర్సయ్యను చంపి అతని గనులు లాక్కున్నప్పుడు, బంజారా హిల్స్ లో ఇంటిపక్క స్థలం యజమానిని బెదిరించి, స్థలం లాక్కున్నప్పుడు ఎవరి చెయ్యి ఎవరిని కాటేసిందో తెలియదా సజ్జలా?
– మాజీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర
మార్గదర్శి సంస్థ డిపాజిటర్లందరూ సంస్థ నిజాయితీగా వ్యవహరించినందునే తమ జీవితాలు బాగుపడ్డాయని సంతోషంగా చెబుతున్నా కూడా ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డ రోజుకో కొత్త కథను తెరపైకి తెస్తూ, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత అయిన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుపై ఉన్న వ్యక్తిగత ద్వేషంతోనే మార్గదర్శిపై విషం చిమ్ముతోందని టీడీపీనేత, మాజీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర స్పష్టం చేశారు.
మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ…వైసీపీ ప్రభుత్వం మార్గదర్శి సంస్థ విషయంలో మోకాలికి బోడి గుండు కు ముడిపెట్టే చర్యలకు పాల్పడుతోందని ఎద్దేవాచేశారు.
యూరీ రెడ్డిని నిజంగా రామోజీరావు బెదిరించి షేర్లు బదలాయించుకుంటే, ఆర్.వో.సీకి, ఎన్.సీ.ఎల్.టీకీ ఎందుకు ఫిర్యాదు చేయలేదు? యూరీరెడ్డి ఇంటినుంచి బయటకు రాలేకపోయినా మెయిల్ పెట్టినా, ఆనాడే షేర్ల బదిలీ ప్రక్రియ నిలిచిపోయేది కదా!
మార్గదర్శి సంస్థ ఎప్పుడో అన్ని వివరాలతో ముగించేసిన అంశాన్ని నేడు జగన్ రెడ్డి, అతని ప్రభుత్వం తెరపైకి తీసుకురావడం ముమ్మాటికీ కక్షసాధింపు చర్యలోభాగమనే చెప్పాలి. 2016 సెప్టెంబర్ 20న రామోజీరావుని కలిసిన యూరీరెడ్డి, అతని కుటుంబం ఇన్నాళ్లు ఏమైంది. ఇప్పుడు బయటకు వచ్చిన యూరీరెడ్డి, తనను తుపాకీతో బెదిరించి, షేర్లు బదలాయించుకున్నారని చెప్పడం ఎవరి డైరెక్షన్లో భాగమే ఆయనే చెప్పాలి. నిజంగా యూరీరెడ్డిని అతనికుటుంబాన్ని రామోజీరావు భయపెడితే, ఆనాడే తెలంగాణ ప్రభుత్వానికో, కేంద్రప్రభుత్వానికో ఎందుకు ఫిర్యాదు చేయలేదు?
యూరీ రెడ్డి కట్టుకథలు చెప్పాడని స్పష్టంగా తెలుస్తున్నా, సాక్షిపత్రిక కథనం మాత్రం రామోజీ రావుకే యూరీరెడ్డి, అతని కుటుంబం జీవనోపాధి కల్పించిందని విషపురాతలు వండి వార్చడం నిజంగా సిగ్గుచేటు. రామోజీరావు నిజంగా బెదిరింపులకు పాల్పడి ఫోర్జరీ సంతకాలతో షేర్ల బదలాయింపునకు పాల్పడితే, ఆయనకు నిజంగా యూరీరెడ్డి, అతని కుటుంబం భయపడి ఉంటే, నేరుగా వెళ్లకుండానే మెయిల్ ద్వారా ఆర్.వో.సీ ( రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్) వారికి ఫిర్యాదు చేయవచ్చు.. లేదా ఎన్.సీ.ఎల్.టీ (నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యునల్) వారికి ఫిర్యాదు చేయవచ్చు.
షేర్ల బదలాయింపు జరిగిన ప్పుడు యూరీరెడ్డి అతని కుటుంబం హైదరాబాద్ లోనే ఉంది. మేంచెప్పిన కార్యాల యాలు కూడా అక్కడే ఉన్నాయి. తన ఇంట్లో ఉండే యూరీ రెడ్డి ఈ పనిచేసుంటే ఆనాడే షేర్ల బదలాయింపు నిలిచిపోయేది. ఇంత చిన్న లాజిక్కు తెలియకుండానే యూరీ రెడ్డి లాంటి మేథావి నేడు జగన్ డైరెక్షన్లో చిలుక పలుకులు పలుకుతున్నాడా? ఏపీ సీఐడీ మార్గదర్శి సంస్థ తప్పుల్ని విచారిస్తున్నారని తెలిసి తాను బయటకు వచ్చానని యూరీ రెడ్డి చెప్పడమనేది ముందుగా తనకు అందిన స్క్రిప్ట్ లో భాగమే.
జింకా నర్సయ్యను చంపి అతని గనులు లాక్కున్నప్పుడు, బంజారా హిల్స్ లో ఇంటిపక్క స్థలం యజమానిని బెదిరించి, స్థలం లాక్కున్నప్పుడు ఎవరి చెయ్యి ఎవరిని కాటేసిందో తెలియదా సజ్జలా?
‘ఆదరించిన చెయ్యినే కాటేసిన రామోజీ’ అని అవినీతి పత్రిక సాక్షిలో విషపురాతలు రాయించిన సజ్జల రామకృష్ణారెడ్డి గత చరిత్ర ఏమిటి? గతంలో తనను రామోజీరావు, ఈనాడుసంస్థలే తీర్చిదిద్దాయనే విషయం గుర్తులేదా సజ్జలా? ఆదరించిన చేతుల్ని నరకడం.. అన్నంపెట్టిన వారికి సమాధికట్టడం సజ్జలకు, జగన్మోహన్ రెడ్డికి తెలిసినం తగా మరెవరికీ తెలియదనే చెప్పాలి.
జింకా వెంకట నర్సయ్య అనే బీసీని కిరాతకంగా చంపేసి, అతని గనుల్ని లాక్కున్నప్పుడు.. బంజారాహిల్స్ లో ఇంటి పక్కన ఉండే స్థలం కోసం ఆ స్థలయజమానిని బెదిరించినప్పుడు వై.ఎస్ కుటుంబం ఏ చెయ్యిని నరికిందో, ఎవరి జీవితాల్ని రోడ్డునపడేసి పైకొచ్చిందో సజ్జలకు గుర్తులేదా? ఇతరుల వైపు వేలు చూపించే ముందు తాము ఎక్కడినుంచి వచ్చామో సజ్జల, జగన్మోహన్ రె డ్డి గుర్తుంచుకోవాలి.
అధికారంలోకి రావడానికి తల్లినిచెల్లిని వాడుకొని, అవసరం తీరాక వారిని గెంటేసిన జగన్ నైజం… అధికారపిచ్చితో తండ్రిశవాన్ని చూడటానికి వచ్చే ఎమ్మెల్యేలతో సంతకాలు పెట్టించుకునే ప్రయత్నం చేసిన జగన్ నీతిమాలినతనాన్ని మర్చిపోయావా సజ్జలా? సొంత బాబాయ్ ని కిరాతకంగా చంపించి, అధికారంకోసం ఆనేరాన్ని చంద్రబాబుపైకి నెట్టిన దుర్మార్గపు చరిత్ర ఎవరిదో సజ్జల, సాక్షిమీడియాకు తెలియకపోయినా ప్రజలకు బాగా తెలుసు.
వైసీపీ ప్రభుత్వ అక్రమాలు, దుర్మార్గాలు.. జగన్ దోపిడీ, అవినీతిని ఆధారాలతో ప్రజల ముందు ఉంచడమే రామోజీరావు, ఆయన మీడియా చేసిన తప్పు
రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు.. దుర్మార్గాలు.. .జగన్ అవినీతి, దోపిడీని రామోజీ రావు తన మీడియాద్వారా వాస్తవాలతో ప్రజలకు తెలియచేస్తున్నారన్న అక్కసుతోనే ఆయనపై వైసీపీ ప్రభుత్వం కక్షకట్టింది నిజంకాదా? కాంట్రాక్ట్.., ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు గుర్తుచేయడం.. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు న్యాయం చేయమని రామోజీరావు కోరడమేనా జగన్ దృష్టిలో ఆయన చేసిన నేరం? జగన్ ధన దాహంతో ల్యాండ్, శాండ్, మైనింగ్, మాఫియాలకు పాల్పడుతున్న వైనాన్ని కళ్లకు కట్టినట్టు ప్రజల ముందు ఉంచడమేనా రామోజీరావు చేసిన తప్పు?
గతంలో తన తండ్రి పాదయాత్రను పతాకశీర్షికల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లిన ఈనాడు-ఈటీవీ యాజమాన్యాలు, ఇతర మీడియా సంస్థలు ఆనాడు తండ్రీకొడుకులకు మంచిగా కనిపించి, నేడు చెడ్డవి ఎందుకు అయ్యాయో ప్రజలు గ్రహించలేరు అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను ఈనాడు-ఈటీవీ, ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ సంస్థలు విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లింది నిజంకాదా?
ఇవేవీ నేడు ముఖ్యమంత్రికి, సకలశాఖ ల మంత్రి సజ్జలకు గుర్తులేవా? కాటికి కాళ్లుచాపుకున్న వ్యక్తని నేడు రామోజీరావుని హేళన చేయడం సజ్జల సంస్కార హీనతకు నిదర్శనం. వైసీపీ ప్రభుత్వ అరాచకాలు, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాలు దుశ్చర్యలు ప్రశ్నించేవారిపై అక్రమకేసులు పెట్టడం.. మీడియా సంస్థలకు పచ్చకండువాలు, పచ్చమీడియా అని ముద్రవేయడం జగన్మోహ న్ రెడ్డికి అలవాటుగా మారింది.
ముఖ్యమంత్రి.. సజ్జల ఎవరు వచ్చినా స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ శిక్షణా కేంద్రాల్లోని పరికరాలు.. ఫైబర్ నెట్ ఫలాల్ని కళ్లకుకట్టినట్టు చూపిస్తాం
ముఖ్యమంత్రి, మంత్రులు, సజ్జల రామకృష్ణారెడ్డి, డీజీపీ ఎవరు వచ్చినా స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణాకేంద్రాలను…వాటిలోని పరికరాలను, అలానే ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ ఫలాలను కళ్లకు కట్టినట్టుచూపించడానికి మేం సిద్ధం. ఎవరు వస్తారో రావచ్చు. ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ ద్వారా 10లక్షల కుటుంబాలకు కేవలం నెలకు రూ.149లకే టీవీ, ఇంటర్నెట్, టెలిఫోన్ సౌకర్యాలు అందించడమేనా జగన్ దృష్టిలో చంద్రబాబు చేసిన తప్పు?
దేశానికే బెస్ట్ మోడల్ గా నిలిచేలా చంద్రబాబు ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ ను అమలు చేశాడని ఆ మోడల్ ను అన్ని రాష్ట్రాలు పరిశీలించాలన్న నాటి ప్రధాని మోదీ ప్రశంస లు జగన్మోహన్ రెడ్డికి వినిపించలేదా..కనిపించలేదా?
ఆధారాలు లేకుండా అవాస్తవాలతో.. తప్పుడు కేసులతో గిట్టని మీడియా సంస్థల్ని.. తెలుగుదేశాన్ని జగన్ నియంత్రించలేడు
కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కావాలని పనిగట్టుకొని మరీ గిట్టనివారిపై తప్పుడు కేసులు వేస్తోంది జగన్మోహన్ రెడ్డికాదా? అధికారంలోకి రాకముందు, వచ్చినప్పటినుంచీ జగన్ అతని నీలిమీడియా చంద్రబాబుపై, ఆయన కుటుంబంపై విషప్రచారం చేస్తోంది నిజంకాదా? ఆధారాలు లేకుండా అవాస్తవాలతో ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తోంది వాస్తవం కాదా?
చంద్రబాబు, లోకేశ్ లపై జగన్ సర్కార్ పెడుతున్న కేసులన్నీ తప్పుడు కేసులేనని, రాజకీయ కక్షసాధింపుల్లో భాగమేనని ప్రజలు గ్రహించారు. వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ , రామోజీరావులాంటి వారిపై తప్పుడు కేసులు పెడితే మిగిలిన మీడియా సంస్థలు మనదారికి వస్తాయని.. చంద్రబాబుని జైలుకు పంపితే టీడీపీ లేకుండా పోతుందని పగటికలలు కంటున్నారు.” అని రవిచంద్ర ఎద్దేవాచేశారు.