Suryaa.co.in

Andhra Pradesh

టెరా సాఫ్ట్ సంస్థపై జగన్ సర్కార్ చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారాలే

రూ.149లకే నాడు టీడీపీ ప్రభుత్వం ప్రతి ఇంటికీ టీవీ, ఇంటర్నెట్, టెలిఫోన్ కనెక్షన్ ఇవ్వడం దేశంలోనే గొప్ప సాంకేతిక విప్లవంగా నిలిచింది
స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ .. ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్.. లేని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్.. ఇలా ప్రతిదీ వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపుతో తెరపైకి తెస్తున్న అంశాలే తప్ప..ఎక్కడా దేనిలోనూ తప్పుజరిగినట్టు జగన్ సర్కార్ నిరూపించలేదు
ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ లో తప్పు జరిగిందని..దానికి చంద్రబాబే కారణమని చెప్పాలని అజయ్ జైనే చెప్పాడు
హరిప్రసాద్ తన మిత్రుడు వద్ద కుమార్తె చదువుకోసం తీసుకున్న అప్పు సొమ్ముని ఈ ప్రభుత్వం అవినీతిసొమ్ముగా చూపే ప్రయత్నం చేస్తోంది
ప్రజలు.. రాష్ట్రం కోసం పనిచేయడం తప్ప ప్రచారం చేసుకునే అలవాటు టీడీపీకి లేదు. ఎప్పటికైనా ప్రజలు వాస్తవం గ్రహిస్తారనే విశ్వాసం తెలుగుదేశానిది
ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ పై టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్
వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ పై చట్టసభల్లో చేస్తున్న దుష్ప్రచారాన్ని నిరసిస్తూ, మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో మంగళవారం తెలుగుదేశం ఎమ్మెల్సీలు మాక్ మండలి నిర్వహించి, ప్రాజెక్ట్ కు సంబంధించిన వాస్తవాలను ఆధారాలతో సహా ప్రజలముందు ఉంచారు

వినూత్నమైన ఆలోచనతో టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అమలుచేసిన గొప్ప ప్రాజెక్ట్ ఏపీ ఫైబర్ నెట్ అని, ఒకే కేబుల్ పై టీవీ, ఇంటర్నెట్, టెలిఫోన్ సదుపాయం కల్పిస్తూ 2017లో నాటి రాష్ట్ర ప్రభుత్వం ఈప్రాజెక్ట్ ను రాష్ట్రవ్యాప్తంగా అమలుచేసిందని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భారత్ నెట్ ప్రాజెక్ట్ లో భాగంగా అండర్ గ్రౌండ్ కేబుల్ వేసి, తద్వారా ప్రతి ఇంటికీ కనెక్షన్ ఇవ్వాలని ఆలోచించిందని, దానిలో భాగమే ఏపీ ప్రభు త్వం నాడు ఏర్పాటుచేసిన ఫైబర్ ప్రాజెక్ట్ అని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు తెలిపారు. మిగిలిన వివరాలు ఆయన మాటల్లోనే …

“ ఈ ప్రాజెక్ట్ అమలుకోసం తొలుత ప్రైస్ వాటర్ కూపర్ సంస్థ అధ్యయనం చేసి, మొత్తం ఏపీ అంతటా అండర్ గ్రౌండ్ కేబుల్ వేయడానికి రూ.5,600కోట్ల ఖర్చవుతుందని అంచనా వేసింది. దాంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రప్రభుత్వం దాన్ని ఎలా అమ లు చేయాలా అని ఆలోచించింది. ఆ సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు తనలోని టెక్నోక్రాట్ ను బయటకు తీసుకొచ్చి, కేబుల్ వేయడా నికి అంత ఖర్చుపెట్టాల్సిన అవసరంలేదని, ఇప్పటికే ఉన్న విద్యుత్ స్తంభాల మీదు గా కేబుల్ తీసుకెళితే, తక్కువఖర్చుతో పూర్తవుతుందని చెప్పారు. ఆయన ఆలోచన ప్రకారమే నాటి ప్రభుత్వం కేవలం రూ.330కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా సమర్థవంతంగా ప్రాజెక్ట్ అమలుచేసింది.

ప్రాజెక్ అమలును ఇన్ క్యాప్ (ఆంధ్రప్రదేశ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కు అప్పగించారు. టీవీ కనెక్షన్, ఇంటర్నెట్, ఫోన్ కనెక్షన్ ను కేవలం రూ.149లకే నాటి ప్రభుత్వం అందించడం నిజంగా గొప్ప సాంకేతిక విప్లవమనే చెప్పాలి. దాదాపు 5 వేల గ్రామాలను కలుపుతూ 24 వేల కిలోమీటర్ల వరకు కేబుల్ వేయడం జరిగింది. అండర్ గ్రౌండ్ ద్వారా కేబుల్ వేస్తే రూ.5,600కోట్లు అవుతుందన్న ప్రాజెక్ట్ ను, ఏపీ ప్రభుత్వం కేవలం రూ.330కోట్లతో పూర్తిచేయడంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి.

ఇలాంటి కొత్త ప్రాజెక్టులు అమలు చేసేటప్పుడు సహజంగానే అరకొర ఇబ్బందులు త లెత్తుతాయి. అలానే విద్యుత్ స్తంభాలపై కేబుల్ వేస్తూ, ప్రతి స్తంభానికి పాయింట్ ఆఫ్ కనెక్టివిటీ ఏర్పాటుచేస్తూ, అక్కడినుంచి ఇంటింటికీ కనెక్షన్ ఇవ్వాలని నిర్ణయించి, టెండర్లు పిలవడం జరిగింది. టెండర్లలో నాలుగు కంపెనీలు ఈసీఐఎం, స్టెరిలైట్, టెరా సాఫ్ట్, పేస్ పవర్ సిస్టమ్స్ పాల్గొన్నాయి. వాటిలో స్టెరిలైట్ ఆఫ్టికల్ ఫైబర్ తయారీ సంస్థ. ఈసీఐఎం అనేది డేటా మేనేజ్ మెంట్ కంపెనీ. ఎల్ 1గా టెరాసాఫ్ట్ సంస్థ నిలిచిం ది. ప్రాజెక్ట్ ను ఏ సంస్థకు ఇవ్వాలనే దానిపై నాటి ప్రభుత్వం అజయ్ జైన్ నేత్రత్వంలో హై పవర్ కమిటీ వేసింది. సదరు కమిటీ సూచనమేరకు టెరాసాఫ్ట్ కు ప్రాజెక్ట్ అమలు అప్పగించింది.

2015లో ఎంపికైన టెరాసాఫ్ట్ సంస్థ, 2016నాటికే కొన్నిప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా కనెక్షన్లు ఇచ్చేసింది. 2017 చివరినాటికి మిగిలిన మొత్తం ప్రాజెక్ట్ పూర్తిచేసింది. ప్రాజెక్ట్ అమలు కోసం రాష్ట్రంలో 3.75లక్షల విద్యుత్ స్తంభాలు ఉపయో గించి, 24 వేల కిలోమీ టర్ల వరకు 24 కోర్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేయడం జరిగింది. 24 కోర్ కేబుల్ అనేది చాలా లేటెస్ట్ కేబుల్. కేబుల్ లో తలెత్తే సమస్యల పరిష్కారానికి ఎక్కడికక్కడ ఉండే విద్యుత్ సబ్ స్టేషన్లలో ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ కోసం రిలే స్టేషన్ల లాంటివి ఏర్పాటు చేశారు.

ఆ సబ్ స్టేషన్ల నుంచి మండల కేంద్రాలకు, అక్కడినుంచి గ్రామాలను కలుపుతూ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఈప్రాసెస్ లో 2,455 సబ్ స్టేషన్లను అనుసంధానిస్తూ, 670 మండలకేంద్రాలు, 13 జిల్లా కేంద్రాలమీదుగా కేబుల్ తీసుకెళ్లారు. 2019 మార్చి నాటికి రాష్ట్రంలో మొత్తం 10లక్షల గృహ కనెక్షన్లు, 9వేల వ్యాపార కనెక్షన్లు ఇవ్వడం తో పాటు, 3వేల స్కూళ్లకు కూడా కేబుల్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలన్న సదుద్దేశంతో నాటి ప్రభుత్వం గూగుల్ ఎక్స్ వారితో కూడా ఒప్పందం చేసుకుంది.

కేవలం రూ.149 లకే మూడు సౌకర్యాలు కల్పిస్తూ (టెలిఫోన్, టీవీ, ఇంటర్నెట్) కేబుల్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ పై రాష్ట్రవ్యాప్తంగా ఎమ్.ఎస్.వోలు నిరసన తెలిపారు. 2017లో నాటి టీడీపీప్రభుత్వం మొదలుపెట్టిన ప్రాజెక్ట్ 2019నాటికి పదిలక్షల కనెక్షన్లతో ప్రభుత్వానికి నెలకు రూ.8.70 లక్షల ఆదాయం వచ్చేలా చేసింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ ఆదాయం ఇంకా పెరిగింది. టీడీపీ ప్రభుత్వం రూ.149లకు అందించిన సౌకర్యాన్ని వైసీపీ ప్రభుత్వం రూ.350లు చేసింది. దాంతో కనెక్షన్లు తగ్గినా ఆదాయం మాత్రం తగ్గలేదు.

ప్రాజెక్ట్ ప్రారంభించినప్ప టినుంచీ నేటివరకు రాష్ట్ర ప్రభుత్వానికి రూ.930 కోట్ల నుంచి రూ.1070కోట్ల ఆదాయం వచ్చినట్టు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. గూగుల్ ఎక్స్ తో చేసుకున్న ఒప్పందం వల్ల అటవీప్రాంతమైన అరకు నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతమైన జాజివలస లో కూడా ఫైబర్ నెట్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న వంతల రాజేశ్వరి నాటి ముఖ్యమంత్రి తో ఫైబర్ నెట్ కేబుల్ ద్వారా ఫోన్లో సంభాషించారు. రూ.149లకే నాటి ప్రభుత్వం విశాఖపట్నం డేటా సెంటర్ నుంచి ప్రతి ఇంటికీ 250కి పైగా టీవీ ఛానెళ్లు, 50 ఎంబీపీఎస్ హై స్పీడ్ నెట్, అన్ లిమిటెడ్ ఫోన్ కాలింగ్ సదుపాయాలు కల్పించింది. ఏపీ ప్రభుత్వం తక్కువ వ్యయంతో సమర్థవంతంగా అమలుచేసిన ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ పై దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి.

ఇంత గొప్ప ప్రాజెక్ట్ పై వైసీపీ ప్రభుత్వం నిరాధార ఆరోపణలు చేస్తూ, గతప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్న చేస్తోంది. ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ లో రూ.120కోట్లు అన్యాక్రాంతం అయ్యాయని దుష్ప్రచారం చేస్తోంది. మొత్తం ప్రాజెక్ట్ అమలుకు అయ్యిన వ్యయం రూ.333కోట్లు అయితే, దానిలో నాటి ప్రభుత్వం కాంట్రాక్ట్ సంస్థలకు చెల్లించింది రూ.280 కోట్లే, ఆసొమ్ములో కూడా 120కోట్లు పక్కదారి పట్టాయని చెబితే మరి ఇంత గొప్ప ప్రాజెక్ట్ ఎలా అమలైంది.. పదిలక్షల కనెక్షన్లు ఎలా ఇచ్చారనే ప్రశ్నలకు మాత్రం వైసీపీప్రభుత్వం సమాధానం చెప్పదు

టెరాసాఫ్ట్ సంస్థ ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్ పై దుష్ప్రచారం..
ఎల్-1 ఎంపికైన టెరాసాఫ్ట్ సంస్థ నాటి ప్రభుత్వానికి సమర్పించిన ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్ బోగస్అని ఈ ప్రభుత్వం చెబుతోంది. ఆ సంస్థకు ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్ ఇచ్చిన సిగ్నమ్ సంస్థ ఈ వ్యవహారంపై భిన్నవాదనలు వినిపించింది. వైసీపీప్రభుత్వ ఒత్తిడితోనే తాను నకిలీ ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్ టెరాసాఫ్ట్ కు ఇచ్చినట్టు చెప్పానని సిగ్నమ్ సంస్థ యజమాని గౌరీశంకర్ ఒక సందర్భంలో చెప్పారు.

మరోసందర్భంలో ఆ సర్టిఫికెట్ ఫోర్జరీ అని చెప్పాడు. అలా చెప్పిన అతన్నే ఈ ప్రభుత్వం ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియమించింది. అతను తప్పుడు సర్టిఫికెట్ ఇచ్చి తమకు అనుకూలంగా వ్యవహరించాడనే వైసీపీప్రభుత్వం అతనికి ఈ పదవి కట్టబెట్టింది. గౌరీ శంకర్ విద్యార్హతలు.. అనుభవంపై టీడీపీ సమాచారహక్కుచట్టం కింద వివరాలు అడిగి తే అతను కేవలం ఇంటర్ మాత్రమే చదివాడని తేలింది.

అతని విద్యార్హతల సమాచారం బయటకు పొక్కడంతో ఈ ప్రభుత్వం అతన్ని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా తప్పించి ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఇచ్చి చేతులు దులుపుకుంది. టెరాసాఫ్ట్ సంస్థ కు ఇచ్చిన ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్ ఫోర్జరీనో.. నిజమైనదో గౌరీ శంకర్ ఎలా చెబుతా డు… తేల్చాల్సింది సీఐడీ. కానీ ఇదేమీ జరగలేదు. అతని వాదన పట్టుకొని ఈప్రభు త్వం కావాలనే గతప్రభుత్వంపై ఆరోపణలు చేసింది.

టెరాసాఫ్ట్ సంస్థ కంపెనీల నమోదు చట్టం కింద నమోదుకాలేదనే ఆరోపణ.. వాస్తవం
ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ అమలుకు టెరాసాఫ్ట్ సంస్థను ఎంపిక చేసేముందు నాటి చంద్రబాబు ప్రభుత్వం టెండర్ ఎవాల్యుయేషన్ మరియు హైపవర్ కమిటీలు వేసింది. ఆ కమిటీలు నిర్దారించడంతో పాటు, ఎల్-1గా టెండర్ కోట్ చేశాకే ఆ సంస్థను ఎంపిక చేయడం జరిగింది. టెరాసాఫ్ట్ సంస్థ గతంలో సివిల్ సప్లైస్ ఈ పోస్ మిషన్ల సరఫరాకు సంబంధించి బ్లాక్ లిస్ట్ లో ఉందనే ఆరోపణ … వాస్తవం
ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ టెండర్ దాఖలు చేయడానికి ముందే టెరాసాఫ్ట్ సంస్థ హైకోర్టుని ఆశ్రయించి బ్లాక్ లిస్ట్ పై స్టే తెచ్చుకుంది. టెండర్ ఫైల్ అయ్యేనాటికి ఆసంస్థ బ్లాక్ లిస్ట్ లో లేదు.

హరిప్రసాద్ పై క్రిమినల్ కేసులుంటే, అతన్ని టెండర్ ఎవాల్యుయేషన్ కమిటీలో నియమించారని ఆరోపణ.. వాస్తవం
హరిప్రసాద్ గతంలో ఈవీఎం లు ఎవరైనా ప్రభావితం చేయవచ్చంటూ ప్రజంటేషన్ ద్వారా మీడియాముందు ప్రదర్శన ఇచ్చారు. అప్పుడు అతను తీసుకొచ్చిన ఈవీఎంలు ఎక్కడినుంచి వచ్చాయని, అలా తేవడం తప్పని కేసు పెట్టారు. ఒక సాంకేతిక నిపుణుడిగా ఆయన పనితీరు గమనించే టెండర్ ఎవాల్యుయేషన్ కమిటీలో ఏడుగురు సభ్యుల్లో ఒకడిగా ఆయన్ని నియమించడం జరిగింది. అంతేతప్ప మొత్తం అతనే సర్వంకాదు. అలానే ఆయనకు ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకునే హక్కుకూడా లేదని ఆనాడే ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది.

టెరాసాఫ్ట్ అనే సంస్థకు టెరాక్లౌడ్ అనే మరో అనుబంధ సంస్థ ఉందని.. దానిలో హరి ప్రసాద్ డైరెక్టర్ అనే ఆరోపణ…. వాస్తవం
సాంకేతిక నిపుణులుగా ఉన్నవారు ఎవరైనా అనేక సంస్థలకు వారి సేవలు అందిస్తుం టారు. అది సహజంగా జరిగేదే. న్యాయవాదులు, ఆడిటర్లు పలుసంస్థలకు పనిచేసి నట్టుగా. టెరా క్లౌడ్ సొల్యూషన్స్ సంస్థ 2010లో రిజిస్టర్ అయినా, తరువాత వ్యాపారం ఏమీ చేయని సంస్థగా నిలిచింది. ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ టెండర్ల ఎవాల్యుయేషన్ కమిటీలో సభ్యుడిగా చేరేనాటికి హరిప్రసాద్ టెరాక్లౌడ్ డైరెక్టర్ గా, సాంకేతిక నిపుణుడిగా లేరు.

మొత్తం ప్రాజెక్ట్ లో నాసిరకం మెటీరియల్ సరఫరా చేసి వందలకోట్లు కొట్టేశారని ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రధాన ఆరోపణ.. దానికి సంబంధించిన వాస్తవం
టెండర్ లో నిర్దేశించిన విధంగా కేబుల్, ఇతర పరికరాలు తీసుకురావాలని ముందే నాటి రాష్ట్రప్రభుత్వం కంపెనీలకు నిబంధనలు పెట్టింది. ఆ నిబంధనల్లో చాలా స్పష్టంగా ఆప్టిక్ కేబుల్ ప్రపంచంలోనే బెస్ట్ నెట్ వర్కింగ్ కంపెనీ అయిన సిస్కో, ఇటలీ ప్రభుత్వ సంస్థ అయిన ఆల్టిస్ సంస్థల నుంచే అన్నిరకాల పరికరాలు తీసుకోవాలని చెప్పడం జరిగింది.

24 వేలకిలోమీటర్లు వేయడానికి అవసరమైన 24 కోర్ ఆప్టిక్ ఫైబర్ కేబుల్ వ్యయం మొత్తం రూ.70కోట్లు అయ్యింది. అలానే రూ.90కోట్ల ఖర్చుతో 2,455 పీ.వో. పీ కేంద్రాలు, 670 మండల కేంద్రాలు అనుసంధానం చేయడం జరిగింది. పరికరాలు, ఇతర పరిజ్ఞానం వ్యయం రూ.117కోట్లు అయ్యింది. ఈ విధంగా మూడు అంశాలకు మ మూడు ప్రత్యేక టెండర్లు వేయడం జరిగింది.

ఈ విధంగా ఏసంస్థ దేనికి ఎంత ఖర్చు పెట్టిందనే వివరాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మొత్తం ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ విలువను నాటి ప్రభుత్వం రూ.321కోట్లుగా నిర్ధారిస్తే, దాని అమలుకు వచ్చేసరికి ఆ వ్యయాన్ని రూ.291కోట్లకు తగ్గించింది. ఈ మొత్తంలో రూ.120కోట్ల అవినీతి జరిగిందనడం పచ్చి అబద్ధం కాక మరేమిటి?

తమకు కావాల్సిన వారికి కాంట్రాక్టులు కట్టబెట్టారనే ఆరోపణ.. వాస్తవం
ప్రాజెక్ట్ అమలుకు ముందుకొచ్చిన కంపెనీలకు మాత్రమే ప్రభుత్వం డెరెక్ట్ గా చెల్లింపులు చేస్తుంది. ఆ కంపెనీలు ఇతర కంపెనీలకు చేసే చెల్లింపులతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదు. ఉదాహరణకు పోలవరం ప్రాజెక్ట్ దక్కించుకున్న టాల్ స్టాయ్ కంపెనీకి నేరుగా చెల్లింపులు చేయడం కోసం ఎస్క్యూ ఖాతాలద్వారా నిధులు చెల్లించడం జరిగింది. అలానే ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ కు అవసరమైన పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం అందించిన సిస్కో, ఆల్టిస్ సంస్థలకు ఎస్క్రో అకౌంట్ ద్వారానే చెల్లింపులు చేయడం జరిగింది.

దానికి వారిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ (డీ.ఆర్.ఐ) విచారించి నప్పుడు ముందే అనుకున్న పథకం ప్రకారం చంద్రబాబు పేరుచెప్పాలని ఒత్తిడి చేశారు. కేబుల్ ఏర్పాటు.. పరికరాలు అందించడం, పీ.వో.పీల ఏర్పాటనే మూడు ప్రాజెక్టులు మూడు పద్ధతుల్లో జరిగినప్పుడు ఎక్కడా అవినీతి జరిగిందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఏపీ సీఐడీ పరిధిలోని డీఆర్ఐ వారే ఏదో తప్పు జరిగిందని చెప్పడానికి కట్టుకథలు అల్లారు.

2015లో ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ అమలుకు సంబంధించిన జీవో ఇచ్చింది మొదలు.. 2017లో ప్రాజెక్ట్ లాంఛ్ అయ్యేవరకు మొత్తం ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ అమలు విధివిధానా లు మొత్తం టెక్నికల్ కమిటీ.. టెండర్ కమిటీ… ఎవాల్యుయేషన్ కమిటీల్లోని సభ్యులే పరిశీలించి నిర్ణయాలు తీసుకున్నారు. నేరుగా సీఎం దీనిపై పర్యవేక్షణ చేయడం గానీ, ఫైళ్లు పరిశీలించడం నీ జరగలేదు. కేవలం రాజకీయ కక్షతోనే ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ లో కీలకంగా వ్యవహరించిన సంస్థలు, వ్యక్తుల్ని వైసీపీప్రభుత్వం వేధించి, చంద్రబాబు పేరు చెప్పాలని భయపెట్టింది.

అధికారులు ఒత్తిళ్లకు తలొగ్గి నిధుల దోపిడీకి సహకరించారనే ఆరోపణ.. వాస్తవం
చంద్రబాబుని ఎలాగైనా ఈ వ్యవహారంలో ఇరికించాలన్న దురుద్దేశంతో నాటి ప్రభుత్వం లో ఇన్ క్యాప్ ఎండీగా పనిచేసిన అధికారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. చంద్రబాబు పేరు చెబితే వదిలేస్తామని అతన్ని ప్రలోభపెట్టారు. అతనే కాకుండా మరికొందరిని ప్రభుత్వం ఇలా చేయడంతో కొందరు వారు కోరినవిధంగా స్టేట్ మెంట్లు ఇచ్చారు. కానీ వారు చెప్పినవాటికి ఎక్కడా ఎలాంటిఆధారాలు లేకపోవడంతో న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడం జరిగింది.

హరిప్రసాద్ కుటుంబసభ్యుల ఖాతాల నుంచి పెద్దమొత్తంలో నిధులు ఇతర ఖాతాలకు వెళ్లాయనే ఆరోపణ …. వాస్తవం
హరిప్రసాద్ కుమార్తె అమెరికాలో చదివేటప్పుడు ఆమె చదువుకోసం ఆయన తన స్నేహితుడు.. జెమినీ సంస్థకు చెందిన కోటేశ్వర్రావు వద్ద కొంతడబ్బు తీసుకుంటే, అది అవినీతి ద్వారా వచ్చిన సొమ్ము అని ఈప్రభుత్వం కట్టుకథలు అల్లింది. వారిద్దరిని విచారణ పేరుతో వేధిస్తే.. ఇద్దరూ న్యాయస్థానాలను ఆశ్రయించి బెయిల్ పొందారు. అలానే ఎవాల్యుయేషన్ కమిటీలో సభ్యులైన అజయ్ జైన్ ను కూడా వేధించారు.

ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ లో అవినీతి ఆరోపణలకు సంబంధించి నమోదుచేసిన ఎఫ్.ఐ.ఆర్ లో రూ.120కోట్ల అవినీతి జరిగిందని, రూ.62కోట్లు స్టాండర్డ్ గైడ్ లైన్స్ కు విరుద్ధంగా అన్యాక్రాంతం అయ్యాయని పేర్కొన్నారు. ఆ డీవియేషన్స్ ఏమిటో మరలా స్పష్టంగా ఎక్కడా దానిలో పేర్కొనలేదు. అలానే పీ.వో.పీల ఏర్పాటులో విద్యుత్ స్తంభాల మధ్య సమదూరం పాటించలేదని మరో ఆరోపణ. ఆ స్తంభాలు ఇప్పుడు కొత్తగా వేసినవి కావు. ఎప్పటినుంచో ఉన్నవే. వాటిని టీడీపీప్రభుత్వం కావాలనే పీ.వో.పీలు దగ్గరదగ్గ రగా ఏర్పాటుచేసి రూ.20కోట్లు కాజేసిందని ఆరోపించడం నిజంగా సిగ్గుమాలిన తనమే .

నిధుల విడుదల సమయంలో అన్ని అంశాలు పరిశీలించకుండా 29.29 కోట్లు దుర్వియోగం చేశారని చెప్పడం కూడా పచ్చి అబద్ధమే. సెటప్ బాక్సులు… ఇంటర్నెట్ స్పీడ్, కేబుల్ కనెక్షన్ పనితీరుని సక్రమంగా పరిశీలించాకే నిధులు విడుదల చేయడం జరిగింది. ఇంటర్నెట్ స్పీడు కచ్చితంగా ఎవరూ అంచనా వేయలేరు. ఈ విధంగా మొత్తం రూ.119.90కోట్ల అవినీతి జరిగింది..ఈ సొమ్మంతా రాజకీయనేతలకు చేరింద ని ఆరోపిస్తూ, అనేకసంస్థల్ని, వ్యక్తుల్ని వైసీపీప్రభుత్వం అకారణంగా వేధించింది.

రూ.120 కోట్ల అవినీతి జరిగిందని చెప్పడమే తప్ప, ఆ డబ్బు ఎటు నుంచి ఎవరికి వచ్చిందనే ఆధారాలు వైసీపీ ప్రభుత్వం వద్ద లేవు
రూ.5,600 కోట్ల వ్యయం అయ్యే ప్రాజెక్ట్ ను రూ.320కోట్లతో పూర్తిచేసి, దానిలో కూడా సంస్థలకు కేవలం రూ.290కోట్లు మాత్రమే చెల్లించి రాష్ట్రంలో 10లక్షల కనెక్షన్లు అందిం చి, ప్రభుత్వానికి ప్రతినెలా రూ.930 కోట్ల నుంచి రూ.1000కోట్ల ఆదాయం వచ్చేలా చేయడమే టీడీపీప్రభుత్వం చేసిన తప్పా? రూ.120 కోట్ల అవినీతి జరిగిందని చెప్పడమే తప్ప, ఆ డబ్బు ఎటు నుంచి ఎవరికి వచ్చిందనే ఆధారాలు లేవు. అజయ్ జైనే స్వయంగా ఈ ప్రభుత్వం తనను ఇబ్బందిపెట్టిందని చెప్పారు.

ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ అమలు దేశంలోనేబెస్ట్ మోడల్ గా నిలిచింది అనడం అతిశయో క్తి కాదు. ఈ ప్రభుత్వం తయారుచేసిన ఎఫ్.ఐ.ఆర్ లో స్టాండర్డ్ గైడ్ లైన్స్ అని ఊరికే ఒక మాట చేర్చారు. ఆ గైడ్ లైన్స్ ఏమిటో మాత్రం స్పష్టంగా ఎక్కడా చెప్పలేదు. అలానే పీ.వో.పీల ఏర్పాటులో విద్యుత్ స్తంభాల మధ్య నిర్ణీతదూరం అనేది ఎవరైనా ఎలా చేస్తారు? ఎప్పుడో వేసిన విద్యుత్ స్తంభాలపై టీడీపీప్రభుత్వం వేసిన కేబుల్ లైన్లో తప్పెలా జరుగుతుంది?

ప్రాజెక్ట్ లో అవినీతి జరిగితే 2019 నాటికి రాష్ట్రంలో 9.70లక్షల కనెక్షన్లు ఎలా ఏర్పాటయ్యాయి? వాటిద్వారా అప్పట్లోనే నెలకు ప్రభుత్వా నికి రూ.8.70కోట్ల ఆదాయం ఎలా వచ్చింది? టీడీపీప్రభుత్వంలో ఉన్న కనెక్షన్లు వైసీపీ ప్రభుత్వంలోలేవు. చాలా తగ్గాయి..కారణం ఏమిటంటే ఎం.ఎస్.వోలు వారి సొంత కనెక్షన్లు వినియోగించడం.. కొన్నిఛానెళ్ల కనెక్షన్లు తొలగించడం చేశారు. అయినా కూడా ఈ ప్రభుత్వానికి ఆదాయం తగ్గలేదు. ఎందుకు తగ్గలేదంటే రూ.149ల నెలవారీ ఛార్జ్ ను ఈ ప్రభుత్వం రూ.350కు పెంచింది.

ప్రజలకైనా..రాష్ట్రానికైనా మంచి చేయడమే టీడీపీకి తెలుసుగానీ.. దాన్ని ప్రచారం చేయడం తెలియదు
ప్రజావేదికను కూల్చినప్పుడే ముఖ్యమంత్రి మనస్తత్వం ఏమిటో అర్థమైంది. చంద్రబాబు తీసుకొచ్చిన ఏ ప్రాజెక్ట్ కూడా రాష్ట్రంలో ఉండకూడదన్నదే జగన్ లక్ష్యం. అది ప్రజలకు ఉపయోగపడేదైనా…. రాష్టానికి ఆదాయం వచ్చేదైనా ఉండకూడదంతే. టీడీపీప్రభుత్వం సమర్థవంతంగా రాష్ట్రంలో అమలుచేసిన ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ వల్ల కరోనా సమయంలో చాలా మంది ఇంటినుంచే ఇంటర్నెట్ ద్వారా పనిచేయగలిగారు. ప్రజలకు మంచి చేయడం తెలిసినంతగా… దాన్ని ప్రచారం చేసుకోవడం టీడీపీకి సరిగా తెలియదనే చెప్పాలి.

పోలవరం నిర్మాణంలో జరిగే ఆలస్యం వల్ల రైతులు ఇబ్బంది పడకూడదని ముందుగా కృష్ణా డెల్టా రైతాంగానికి మేలు చేయడంకోసం పట్టిసీమ అమలు చేసింది. కానీ గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 2019 ఎన్నికల్లో టీడీపీని ప్రజలు ఆదరించలేదు. ఈ ప్రభుత్వం ఏమీ చేయకుండానే అన్నీ చేస్తున్నట్టు విషప్రచారం చేస్తోంది.. టీడీపీ ప్రభుత్వం మాత్రం చేసింది చెప్పుకోలేకపోయింది. ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజలకు అంతిమంగా వాస్తవం ఏమిటో కచ్చితంగా తెలుస్తుంది. టీడీపీ ప్రభు త్వం ఏంచేసిందో.. చంద్రబాబు ఎలాంటి నాయకుడో ప్రజలకు నాలుగేళ్ల జగన్ పాలన చూశాక బాగా అర్థమైంది. జగన్ రెడ్డి అతని అవినీతి, బులుగు మీడియాలో ఎంతగా దుష్ప్రచారం చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు.

ఏ సంస్థకైనా ఎస్క్రో అకౌంట్ల ద్వారా నిధులు చెల్లిస్తే అది వెనక్కు రావడం అనేది అసాధ్యం. ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ కోసం అమలుచేసిన సంస్థలకు నాటి ప్రభుత్వం చెల్లించిన సొమ్ములో ఏ సంస్థకు చెల్లించిన రూపాయైనా తిరిగి వెనక్కు వచ్చిందని ఈ ప్రభుత్వమే నిర్ధారించలేకపోయింది. ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ పై ఈప్రభుత్వంలోని విచారణ సంస్థ నమోదు చేసిన ఎఫ్.ఐ.ఆర్ లో ఎక్క డా ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందనిగానీ.. ఒక రూపాయి ఫలానా వ్యక్తి నుంచి ఫలానా వ్యక్తికి వచ్చిందని గానీ నిరూపించలేదు.

దానికి సంబంధించిన ఎలాంటి ఆధా రాలు కూడా ఈ ప్రభుత్వం వద్ద లేవు. గల్లా జయదేవ్ కంపెనీ సెట్ టాప్ బాక్సుల్ని ఈ ప్రాజెక్ట్ లో వినియోగించారనే ఆరోపణ కూడా అవాస్తవమే. ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ లో విని యోగించిన సెట్ టాప్ బాక్సులు అన్నీ విదేశాలనుంచి దిగుమతి చేసుకోబడినవి. అసలు ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ లో వినియోగించిన సెట్ టాప్ బాక్సులు కేవలం కేబుల్ టీవీ ప్రసారాలకోసం మాత్రమే. ఇంటర్నెట్, ఫోన్ కనెక్షన్ కోసం ప్రత్యేక డివైజ్ ఇవ్వడం జరిగింది. ఆ డివైజ్ ద్వారానే అన్ లిమిటెడ్ కాల్స్.. ఇంటర్నెట్ సదుపాయం పొంద వచ్చు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్.. ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్.. అని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులన్నీ వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపులో భాగంగా తెరపైకి తెచ్చిన అంశా లు మాత్రమే.” అని అశోక్ బాబు తేల్చిచెప్పారు.

LEAVE A RESPONSE