Suryaa.co.in

Andhra Pradesh

దేశ హిందువులందరూ ప్రధానికి రుణపడి ఉన్నారు: కన్నా

దివ్య కాశీ-భవ్య కాశీ” కార్యక్రమంలో భాగంగా ప్రముఖ శైవక్షేత్రం.. కాశీ పుణ్యక్షేత్రం నందు నూతనంగా నిర్మించిన “కాశీవిశ్వనాధ్ ధామ్” ను మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన కార్యక్రమాన్ని లైవ్ లో (స్క్రీన్ పై) గుంటూరు, కొత్తపేట శివాలయ ప్రాంగణం నందు వీక్షించిన బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ,జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ,రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెల కిషోర్ బాబు,మాజీమంత్రి శనక్కాయల అరుణ,టుబాకో బోర్డు చైర్మన్ యడ్లపాటి రఘునాదబాబు.
బిజేపి జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ…
కాశీ ప్రదానమైన పుణ్యక్షేత్రం. జీవితంలో ఒకసారి దేవుడు దర్శనం చేసుకోవాలని పురాణాలు చెబుతున్నాయి. కాశీ అభివృద్ధి కోసం మోడీ ప్రధాని అయిన తర్వాత అనేక చర్యలు తీసుకున్నారు. దేశ హిందువులందరూ ప్రధానికి రుణపడి ఉన్నారు. దేశంలో ప్రధాన ఆలయాలను మోడీ అభివృద్ధి

చేస్తున్నారు. దేశం వ్యాప్తంగా యాబై ఒక్క వేల ప్రాంతాల్లో దివ్య కాశి, భవ్య కాశి ప్రొగ్రామ్ లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. మోడి ప్రధానిగా ఉండటం దేశ ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను.
ఈ కార్యక్రమంలో కార్యక్రమ ఇంచార్జ్ దుంప కరుణశ్రీ, మండల అధ్యక్షుడు సురేష్ జైన్,జిల్లా ప్రధాన కార్యదర్శులు రాచమల్లు భాస్కర్, కుమార్ గౌడ్,పాలపాటి రవికుమార్,సుదర్శనా చార్యులు,శనక్కాయల ఉమాశంకర్,ఈదర శ్రీనివాసరెడ్డి,ఎస్టిమోర్చా అధ్యక్షులు ఉయ్యాల శ్యాంవరప్రసాద్,భీమనేని చంద్రశేఖర్,దేచిరాజు సత్యంబాబు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE