Suryaa.co.in

Andhra Pradesh

బందర్ పోర్ట్ సహా, ముఖ్యమంత్రి చేస్తున్న ప్రారంభోత్సవాలు అన్నీ గతంలో చంద్రబాబు చేసినవే

• ఆనాడు చంద్రబాబు చేస్తున్న పనుల్ని ఎన్నికలకోసమన్న జగన్ రెడ్డి, ఇప్పుడు తాను దేనికి చేస్తున్నాడో ప్రజలకు చెప్పాలి
• దేశంలోనే ధనికుడైన ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ రెడ్డి బీదఅరుపులతో ప్రజల్ని మరోసారిమోసగించే ప్రయత్నం చేస్తున్నాడు
• బెంగుళూరు, హైదరాబాద్, పులివెందుల, ఇడుపులపాయలోని భవనాలు, వందలఎకరాలు తనవికావని జగన్ రెడ్డి ప్రజలముందుకొచ్చి చెప్పగలడా?
• భారతిసిమెంట్స్, సాక్షిపేపర్, సాక్షి టీవీ, సండూర్ పవర్, సరస్వతి పవర్ సంస్థలకు తనకు ఎలాంటిసంబంధంలేదని చెప్పేధైర్యం ముఖ్యమంత్రికి ఉందా?
• 2004 నుంచి 2019వరకు జగన్ రెడ్డి ఆస్తులు అమాంతం ఎలా పెరిగాయి? నేడు దేశంలోనే ధనికుడైన ముఖ్యమంత్రి తాను పేదవాడిననిచెప్పడం ప్రజల్ని మోసగించడం కాదా?
• తండ్రి అధికారంతో వేలకోట్లు, తనఅధికారంతో ఈ 4ఏళ్లలో రూ.2లక్షలకోట్లు కొట్టేసిన జగన్ రెడ్డి బీదవాడా? అయన బీదఅరుపుల్ని ప్రజలు నమ్మాలా?
• అమరావతిని ఎడారని, శ్మశానమని, గ్రాఫిక్స్ అని ఎద్దేవాచేసిన జగన్ రెడ్డి, అతని ప్రభుత్వం, ఆప్రాంతంలో పేదలకు ఇళ్లపట్టాలు ఎలా ఇస్తోంది?
• గ్రాఫిక్స్ మధ్యలో 4ఏళ్లుగా తానుఎలా పాలనచేస్తున్నాడో, అక్కడే పేదలకు ఇళ్లస్థలాలు ఎలా ఇస్తున్నాడో జగన్ సమాధానం చెప్పాలి
మాజీ శాసనసభ్యులు కూన రవికుమార్

ప్రజాస్వామ్యప్రక్రియకు భిన్నంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న అరాచకచక్రవర్తి, ఆర్థిక ఉగ్రవాది, అవినీతిపరుడు అయిన జగన్మోహన్ రెడ్డి పనేమీలేదన్నట్టు గతపాలకులు చేసిన శంఖు స్థాపనలు, ప్రారంభోత్సవాలే మళ్లీచేస్తూ, చెల్లికిపెళ్లి జరగాలి మళ్లీమళ్లీ అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడని టీడీపీ సీనియర్ నేత, మాజీశాసనసభ్యులు కూన రవికుమార్ ఎద్దేవాచేశారు. మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు . ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం…!

“నేడు శంఖుస్థాపనచేసిన బందర్ పోర్టుసహా, భావనపాడు పోర్టు, కడప ఉక్కుఫ్యాక్టరీ, భోగాపురం విమానాశ్రయంలాంటి వాటికి మరలా శంఖుస్థాపనలు చేయడం ఆయనకే చెల్లిం ది. గతంలో చంద్రబాబుగారు వాటన్నింటి నిర్మాణానికి అవసరమైన భూసేకరణ పూర్తి చేశారు. అలానే పాలనాపరమైన అనుమతులుకూడా క్లియర్ చేసిపెట్టి, చాలావాటినిర్మా ణాన్ని ప్రారంభించడం జరిగింది. గతంలో చంద్రబాబు ఎన్నికలకోసం వాటిని ఆఖరినిమిషంలో ప్రారంభిస్తున్నాడని నోటికొచ్చినట్టు మాట్లాడిన జగన్, మరి నేడు తానుచేస్తున్న పనేంటి? తన ప్రభుత్వాన్నితానే రద్దుచేసుకునే పరిస్థితిలో ఉన్న జగన్ రెడ్డి, ఆఖరినిమిషంలో హడా విడి ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు ఎందకు చేస్తున్నాడు? జగన్ ఇప్పుడు వేస్తున్న శంఖుస్థాపన రాళ్లు, నిర్మాణానికి పునాది రాళ్లా..లేక తనప్రభుత్వానికి వేస్తున్నసమాధిరాళ్లా?

అమరావతిని ఎడారని, శ్మశానమని, గ్రాఫిక్స్ అని ఎద్దేవాచేసిన జగన్ రెడ్డి, అతని ప్రభుత్వం, ఆ ప్రాంతంలో పేదలకు ఇళ్లపట్టాలు ఇవ్వడం వారిని వంచించడమే
రాజధాని అమరావతిలో తాను పేదలకు సెంటుపట్టాలు ఇస్తుంటే ఓర్చుకోలేని చంద్రబాబు, వారుకట్టుకునే ఇళ్లను సమాధులంటున్నాడని జగన్ రెడ్డి దుష్ప్రచారంచేస్తున్నాడు. గతంలో రాజధానిని ఎడారని, శ్మశానమని, నివాసాలకు అనువైనప్రదేశంకాదని చెప్పింది ఎవరు జగన్ రెడ్డి? నువ్వూ, నీప్రభుత్వం, నీ మంత్రివర్గంకాదా? స్పీకర్ తమ్మినేని అమరావతిని ఎడార ని హేళనచేయలేదా? ఎడారిలో పేదలకు ఇళ్లుఎలా కడతారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి? అమరావతిలో ఒక్కనిర్మాణంలేదు…అంతాగ్రాఫిక్స్ అన్న జగన్ రెడ్డి మరి ఆగ్రాఫిక్స్ మధ్యనే ఉండి సిగ్గులేకుండా 4ఏళ్లుగా పాలనఎలాచేస్తున్నాడు? గ్రాఫిక్స్ మధ్యలో పేదలకు ఇళ్లపట్టాలు ఎలాఇస్తున్నాడు? అంటే జగన్ పేదలకు ఇస్తున్నపట్టాలుకూడా గ్రాఫిక్సేనా? జగన్ రెడ్డి రాజధానిలోపేదలకు ఇవ్వాలి అంటున్న 1200ఎకరాలభూమి ఆయన సొంత భూమా? ఆయన కష్టార్జితమా? అది ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరు ఇచ్చారో జగన్ రెడ్డికి తెలియదా? దాదాపు 28వేలమంది రైతులు 33వేలఎకరాలు రాజధానినిర్మాణానికి ఇస్తే, వారిని రోడ్లపాలు చేసిన జగన్ రెడ్డికి, వారిభూముల్నిఇష్టానుసారం వాడుకునే హక్కు ఎక్కడిది? రైతులు ఉచితంగా ప్రభుత్వానికి భూమిఇవ్వబట్టే, నేడు జగన్ రెడ్డి దాన్ని అప్పనంగా తనఇష్టానుసారం దుర్వినియోగంచేస్తున్నాడు.

పేదలకు రాజధానిలో ప్లాట్లు ఇవ్వాలనే ఆలోచన జగన్ రెడ్డికి ఇప్పుడే ఎందుకొచ్చింది?
జగన్ రెడ్డికి నిజంగా పేదలపై పక్షపాతం..ప్రేమ అభిమానముంటే, ఆయనలో ఏమాత్రమైనా మానవత్వముంటే, చంద్రబాబు గారు గతంలో పేదలకోసం కట్టించిన టిడ్కోఇళ్లను ఎందుకు 4 ఏళ్లుగా వారికి కేటాయించలేదు? రాజధానిప్రాంతంలో పేదలకోసం టీడీపీప్రభుత్వం నిర్మించి న 5వేలఇళ్లను అర్హులకు ఎందుకు ఇవ్వలేదు? దానిపై ముఖ్యమంత్రి ఏంసమాధానంచెబుతా డు? మంత్రి బొత్స ఏంచెబుతాడు? రాజధానికోసం భూములిచ్చి, సర్వంకోల్పోయిన రైతులు 1200రోజులుగా ధర్నాలుచేస్తూ, రోడ్లపై పడి విలపిస్తున్నారంటే, దానికి కారణం జగన్ రెడ్డి కుట్రరాజకీయం కాదా? మూడురాజధానుల నాటకమాడి, రైతుల్ని రోడ్లపాలుచేసింది జగన్ రెడ్డి దుర్మార్గంకాదా? వారిని పోలీసులతో కర్కశంగా కొట్టించింది ఈముఖ్యమంత్రి క్రూరత్వం కాదా? రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని దుష్ప్రచారంచేసింది జగన్ రెడ్డి, అతని ప్రభుత్వంకాదా? ఎలాంటి ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని న్యాయస్థానాలుచెప్పినా కూడా వినకుండా తనపంతం నెగ్గించుకోవడానికి ప్రజారాజధానిని పాతరేసింది జగన్ రెడ్డి కాదా?

విభజన చట్టంలో A NEW CAPITAL అని మెన్షన్ చేశారుగానీ, ఎక్కడా Capitals అనే ప్రస్తా వనలేదు. కానీ జగన్ రెడ్డి పనిగట్టుకొని మూడుముక్కలాట ఆడి రాష్ట్రానికి రాజధానిలేకుం డాచేశాడు. కేంద్రప్రభుత్వం, పార్లమెంట్ సాక్షిగా మూడురాజధానుల ప్రస్తావనను నిర్ద్వందంగా తిరస్కరించినా కూడా జగన్ పదేపదే అదేపాట ఎందుకు పాడుతున్నాడు? అబద్ధాలు, అస త్యాలు, మోసాలతో ఎన్నాళ్లుప్రజల్ని మోసగిస్తావు జగన్ రెడ్డి? రాజధానికి భూములిచ్చిన రైతులకు సంబంధించిన ప్లాట్లువెంటనే అభివృద్ధిచేసి, వారికి కేటాయించాలని హైకోర్టు చెబితే, ప్లాట్లను డెవలప్ చేయడానికి తమవద్ద డబ్బులేదన్న జగన్ రెడ్డి, నేడుపేదలకు సెంటుపట్టా లు ఎలా ఇస్తున్నాడు. అందుకోసం డబ్బులుఎక్కడినుంచి వచ్చాయి? రాజధానికి భూములి చ్చినవారిలో పేదలులేరా? వారిలోఎస్సీలు, ఎస్టీలు, బీసీ, మైనారిటీలు లేరా? వారికి ప్లాట్లు, కౌళ్లుఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిస్థానంలోఉన్న జగన్ రెడ్డికిలేదా? రాజధాని నిర్మా ణంకోసం రైతులుప్రభుత్వానికి ఇచ్చిన భూములమొత్తం విలువ దాదాపు రూ.2లక్ష లకోట్లు. అంతఆస్తిని నాశనంచేసింది జగన్ రెడ్డికాదా? గతప్రభుత్వంతో జరిగిన ఒప్పందం ప్రకారం రాజధానిపనులు పూర్తై, అన్నిసంస్థలు వచ్చిఉంటే రాష్ట్రరూపురేఖలు మారిపోయేవి కావా? యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు లభించేవికావా? తన అహంకారం, అధికారమదంతో రాజధానిని, రైతులజీవితాలను నాశనంచేసింది జగన్ రెడ్డి కాదా? అమరావతి నగరం ఏవిధంగా రూపుదిద్దుకోబోతోందని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తే, జగ న్ వచ్చి దాన్ని నామరూపాలు లేకుండాచేశాడు. అమరావిలో అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి గత ప్రభుత్వం ప్రణాళికలువేస్తే, నిర్మాణమే కాని రోడ్డులో క్విడ్ ప్రోకో జరిగిందంటూ జగన్ , అతని అవినీతిమీడియా ప్రచారంచేయడం సిగ్గుచేటుకాదా?

2004 నుంచి 2019వరకు జగన్ రెడ్డి ఆస్తులు ఏటికేడు కోట్లకుకోట్లు ఎలాపెరిగాయి?
పోలీసులవలయం, పహారా, పరదాలమాటున ముఖ్యమంత్రి చెప్పే అసత్యాలు, అబద్ధాలు నమ్మవద్దని ప్రజలకువిజ్ఞప్తిచేస్తున్నాం. దేశంలోనే ధనికుడైన ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ రెడ్డి పేదవాడా? కేవలం రూ.32కోట్ల ఆస్తులున్న చంద్రబాబు ధనికుడా? 2004లో జగన్ రెడ్డి ఆస్తులెన్ని.. ఇప్పుడు ఆయనకున్న ఆస్తి ఎంత? అతితక్కువకాలంలో జగన్ వేలకోట్లు ఎలా సంపాదించారు? 2004లో ఇన్ కంటాక్స్ వారికి జగన్ రెడ్డి చూపించిన ఆస్తులు రూ.1.74 కోట్లు. అదే జగన్ రెడ్డి 2009ఎన్నికల అఫిడవిట్లో జగన్ రెడ్డి చూపిన ఆస్తులు రూ.77.39కో ట్లు. 2004 నుంచి 2009కి జగన్ రెడ్డి ఆస్తి అమాంతం అంతఎలాపెరిగింది? 2011ఉపఎన్ని కల అఫిడవిట్లో తనఆస్తి రూ.445కోట్లు అని జగన్ చెప్పాడు. అదేవ్యక్తి 2014ఎన్నికల అఫి డవిట్లో తన ఆస్తి రూ.413కోట్లు అనిచెప్పాడు. 2019ఎన్నికల అఫిడవిట్ లో మాత్రం రూ.510 కోట్లుగా చూపాడు. సీబీఐ, ఈడీ వాటి ఛార్జ్ షీట్లలో జగన్ రెడ్డి ఆస్తులుమొత్తం రూ.43వేల కోట్లు అని నిగ్గుతేల్చింది. ది రిచెస్ట్ సీఎం ఇన్ కంట్రీ జగన్మోహన్ రెడ్డి అని దిప్రింట్ మ్యాగ్జైన్ కథనంవేసింది. దానిలో ఆయన ఆస్తి రూ.373.8కోట్లు అనిచెప్పింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిపోర్ట్ (ఏ.డీ.ఆర్)నివేదికప్రకారం జగన్ రెడ్డి ఆస్తి మొత్తం విలువ రూ.510 కోట్లు. ఇంత ఆస్తిఉన్న జగన్ రెడ్డి పేదవాడా? తనకుడబ్బులేదు.. ఇల్లులేదు అంటున్న జగన్ రెడ్డి కొన్నాళ్లకు తనకుభార్యకూడా లేదన్నా ఆశ్చర్యంలేదు. సాక్షిపత్రిక, టీవీ జగన్ రెడ్డివికావా? అవినిర్వహిస్తున్న శ్రీమతి భారతి గారికి జగన్ రెడ్డికి ఏంసంబంధంలేదా? ఇంతటి దిగజారుడు ముఖ్యమంత్రిని ఎప్పుడూచూడలేదు… ఇకపై చూడబోము.

4ఏళ్లలో రాష్ట్రాన్ని మాఫియాలకు అడ్డాగామార్చి రూ.2లక్షలకోట్లు కొట్టేసిన జగన్ రెడ్డి పేదవాడా? 
4ఏళ్లలోజగన్ రెడ్డి ప్రజలపై మోపిన విద్యుత్ ఛార్జీల భారం రూ.50వేలకోట్లు. విద్యుత్ కొనుగో ళ్ల పేరుతో జగన్ రెడ్డి కాజేసింది రూ.12వేలకోట్లు. ఇవన్నీచాలవన్నట్టు మరలా స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలపై అదనపుభారం వేయడానికి సిద్ధమయ్యాడు. స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియ ను తన బినామీకంపెనీకి కట్టబెట్టాడు. మద్యాన్ని నిషేధిస్తాననిచెప్పిన జగన్, 4ఏళ్లలో కల్తీ మద్యంతో రూ.42వేలకోట్లు, ల్యాండ్ మాఫియాతో రూ.40వేలకోట్లు, మైనింగ్ మాఫియాతో రూ.35వేలకోట్లు, ఎర్రచందనం మాఫియాతో రూ.25వేలకోట్లు, లేపాక్షి భూకుంభకోణంతో రూ.15వేలకోట్లు, సిమెంట్ మాఫియాతో రూ.12 వేలకోట్లు, ఇసుక మాఫియా రూ.10వేల కోట్లు, గంజాయి మాఫియాతో రూ.10వేలకోట్లు, సెంటుపట్టాల లూఠీతో రూ.7వేల కోట్లు, సిలికా మాఫియాతో రూ.6వేల కోట్లు, అంబులెన్స్ లు, చెత్త సేకరణ వాహనాలు, బియ్యం వాహనాల కొనుగోళ్ల ముసుగులో రూ.10వేలకోట్లు, రేషన్ బియ్యం విదేశాలకు తరలించి రూ.7వేలకోట్లు కొట్టేసింది ఈ జగన్ రెడ్డికాదా? 4ఏళ్లలోప్రజల్ని పన్నులతో పీక్కుతింటున్నది కాక, మొత్తంగా మాఫియాలతో కలిసి జగన్ రెడ్డి కొట్టేసింది రూ.2లక్షలకోట్లు. ఇది వాస్తవంకాదా అని ము ఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాం. రూ.2లక్షలకోట్లకుపైగా కాజేసిన జగన్ రెడ్డి పేదవాడా? అతని బీద అరుపుల్ని ప్రజలు నమ్మాలా?

బెంగుళూరు, హైదరాబాద్, పులివెందుల, ఇడుపులపాయ, తాడేపల్లి భవనాలు, భారతి సిమెంట్స్, సండూర్ పవర్, సరస్వతి పవర్ సంస్థలు తనవికావు.. వాటితో తనకేం సంబంధంలేదని జగన్ రెడ్డిచెప్పగలడా?
పొద్దున్నలేస్తే అవినీతిచేస్తూ తాను నంగనాచిని అంటాడు. తండ్రి అధికారంతో సాక్షిపత్రిక, టీవీ పెట్టి, వాటిని భార్యతోనడిపిస్తూ అవితనవి కావంటాడు? బెంగుళూరులోని ఎలహంక ప్యాలెస్ ఎవరిది? హైదరాబాద్ లోని లోటస్ పాండ్ భవనం, ఇడుపులపాయ, తాడేపల్లి, పు లివెందులలోని భవనాలుఎవరివి? భారతిసిమెంట్స్, సండూరుపవర్, సరస్వతి పవర్ సంస్థ లు ఎవరివి? ఈ ఆస్తులన్నీ తనవికావు… తనకు వాటితో ఏం సంబంధం లేదని జగన్ రెడ్డి చెప్పగలడా? అక్రమాస్తులు, అవినీతితో లక్షలకోట్లు పోగేసుకున్న జగన్ రెడ్డి, ఏటాఆస్తులు ప్రకటిం చే చంద్రబాబుని, ఆయనకుటుంబాన్ని తప్పుపట్టడం సూర్యుడిపై ఉమ్మేయడమే. చంద్రబా బుగారు అవినీతి చేశాడనిగతంలో జగన్ రెడ్డి తల్లి, తండ్రి ఆరోపణలు చేశారు. విచారణలు జరిపించారు.. చివరకు ఏమీ తేల్చలేక చతికిలపడ్డారు. ఇదే జగన్ రెడ్డి అధికారంలోకి రాక ముందు చంద్రబాబు రూ.6లక్షలకోట్ల అవినీతికి పాల్పడ్డాడని దుష్ప్రచారంచేశాడు. తప్పుడు సమాచారంతో పుస్తకాలు ముద్రించాడు. అధికారంలోకి వచ్చి 4ఏళ్లుఅయినా ఉత్తుత్తి ఆరోప ణలు తప్ప, దేన్నీ నిరూపించలేకపోయాడు. జగన్ రెడ్డి అవినీతి, అక్రమాలు, అరాచకాలు, అన్యాయాన్ని ఎత్తిచూపుతున్న మీడియా వ్యవస్థలు దుష్టచతుష్టయమా? జగన్ రెడ్డిని నమ్మి మరలా మరోసారి మీ జీవితాల్ని సర్వనాశనంచేసుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తిచేస్తున్నాం.

జగన్ రెడ్డి నేడు బందర్ పోర్ట్ శంఖుస్థాపనకు వేసింది ముమ్మాటికీ సమాధి రాయే
నేడు జగన్ శంఖుస్థాపనచేసిన బందరుపోర్టు నిర్మాణానికి చంద్రబాబుగారి హయాంలోనే భూసేకరణ పూర్తిచేయడం జరిగింది. అప్పుడే పనులుప్రారంభిస్తే వాటిని అడ్డుకోవడానికి జగన్ రెడ్డి నానావిధాలుగా దుష్ప్రచారంచేశాడు. నేడు బందర్ పోర్టు నిర్మాణపనులకు జగన్ రెడ్డి వేసింది పునాదిరాయి కాదు…ముమ్మాటికీ సమాధి రాళ్లే. అవినాశ్ రెడ్డి అరెస్ట్ తో మీకేంటి సంబంధం…సీబీఐ చూసుకుంటుంది అని తమ్మినేని చెప్పడం వెనుక, అతని బాగోతం బయటపడకూడదన్న ఆలోచన దాగి ఉంది. తాను నకిలీసర్టిఫికెట్లలతో పదవిపొందాడుకాబట్టి, ఆ భయంతోనే అతను అవినాశ్ రెడ్డి అరెస్ట్ తో మీకేం పని అంటున్నాడు. నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ తయారుచేసుకున్న తమ్మినేని కూడా భవిష్యత్ లో పోలీసుల ముందు నిలబడక తప్పదు. ఆయన నకిలీ లీలలన్నీ త్వరలోనే బయటకువస్తాయి. అందుకే తమ్మినేనికి సీబీఐ అన్నా.. పోలీస్ అన్నా చెమటలు పడుతున్నాయి. తమ్మినేని నకిలీసర్టిఫికెట్ వ్యవహారంపై విచారణ చేయాలని రాష్ట్రగవర్నర్, రాష్ట్రపతిని కోరడం జరిగింది. రాజ్యాంగాధిపతులకు కొంత సమయం ఇవ్వాలని, వారు ఇచ్చే వివరణను బట్టి తదుపరిచర్యలు తీసుకుంటామని చెప్పా రు. అండర్ సీ.ఆర్.పీ.సీ ప్రకారం తమ్మినేని ఎప్పటికైనా శిక్షార్హుడే. ఆయనపై ఫిర్యాదు ని ముఖ్యమంత్రికి కూడా ఇచ్చాము. కానీ ఆయన స్పందించలేదు. ముఖ్యమంత్రే ఫేక్ అయినప్పుడు, అవినీతి పరుడు అయినప్పుడు అతను స్పందిస్తాడా? తమ్మినేని నకిలీ సర్టిఫికెట్ వ్యవహారం ప్రజల ముందుపెట్టి, అతనిసంగతి చూసేవరకు తామువదిలిపెట్టము.”అని రవికుమార్ తేల్చి చెప్పారు.

LEAVE A RESPONSE