– చంద్రబాబు సెటైర్లు
ఏపీ మంత్రులపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు వ్యంగ్యాస్ర్తాలు సంధించి, అందరినీ నవ్వులతో ముంచెత్తారు. మంత్రుల అసమర్థను వెక్కిరిస్తూ చంద్రబాబు చేసిన ఘాటైన సెటైర్లు, సోషల్ మీడియాలో పేలుతున్నాయి.
ఇంతకూ చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే..
ఉదయం లేచింది మొదలు నన్ను తిట్టడమే మంత్రులకు పెద్ద పని.మంత్రులకు సాక్షి నుంచి ఓ నోట్ వస్తుంది.. ఆ నోట్ లో ఉన్నది ఉన్నట్టుగా చదివేస్తారు.అక్రమ మైనింగ్ చేసేవాడు మైనింగ్ మంత్రి.సొంతూళ్లో పిల్ల కాల్వ తవ్వలేని వ్యక్తి ఇరిగేషన్ మంత్రి.నియోజకవర్గంలో 10 ఇళ్లు కట్టలేని వాడు హౌసింగ్ మంత్రి.పెట్టుబడులు గురించి అడిగితే కోడిగుడ్డు గురించి చెప్పేవాడు పరిశ్రమల మంత్రి.
జగనుకు కోర్టుల్లో అనూకుల తీర్పులు రావాలని హిందూ దేవాలయాల సొమ్ముతో యాగాలు చేసేవాడు దేవదాయ శాఖ మంత్రి. రైతు బజార్లను తాకట్టు పెట్టేవాడు ఆర్థిక శాఖ మంత్రి. పిల్లల జీవితాలు నాశనం చేసేవాడు విద్యా మంత్రి. అమరావతి ఎక్కడికీ పోదు.. తొమ్మిది నెలల తర్వాత మళ్లీ అమరావతి నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తా.