– తిరుమలను రాజకీయ వేదిక చేసుకున్న చంద్రబాబు
– వైయస్.జగన్, వైయస్సార్సీపీపై బురద జల్లుతున్న ప్రభుత్వం
– రాజకీయంగా పబ్బం గడుపుకోవడమే లక్ష్యం
– ఛానెల్ అధిపతిగా తప్ప.. టీటీడీ చైర్మన్ గా వ్యవహరించని బీ ఆర్ నాయుడు
– ఆయన బాధ్యతలు చేపట్టిన నుంచీ తిరుమలలో అపశకునాలే
– నా పై మీరు చేస్తున్న ఆరోపణలకు ఏ విచారణకైనా సిద్ధం
– నా వెనుక న్యాయమూర్తి ఉన్నారంటూ అడ్డగోలు వాదన
– మీకు ధైర్యం ఉంటే ఆ న్యాయమూర్తి పేరు చెప్పగలరా?
– బీ ఆర్ నాయుడు మెదడు మీద పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది
– తిరుపతి లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.
తిరుపతి: అధికారం చేపట్టినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం హైందవ ధర్మానికి తూట్లు పొడుస్తుందని, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతి లోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ… తిరుమలను రాజకీయ వేదిక చేసుకున్న చంద్రబాబు అనుక్షణం వైయస్.జగన్, వైయస్సార్సీపీ నేతలపై బురద జల్లడమే లక్ష్యంగా చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైకుంఠఏకాదశి తొక్కిసలాట, తిరుమలలో మాంసం, మద్యం వినియోగం వంటి ఘటనల ద్వారా తిరుమల క్షేత్ర పవిత్రత మంటగలుస్తుంటే… తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని చెప్పారు. బీఆర్ నాయుడు టీటీడీ పాలకమండలి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నుంచే.. తిరుమలలో వరుసగా అపశకునాలు చోటు చేసుకుంటున్నాయని ఆక్షేపించారు. తన వెనుక ఓ న్యాయమూర్తి ఉన్నాడంటూ చేసిన ఆరోపణలపై మండిపడ్డ భూమన.. దమ్ముంటే ఆయన పేరు చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు తన మీద చేస్తున్న ఆరోపణలపై ఏ విచారణకైనా తాను సిద్ధమేనని.. మరోసారి సవాల్ చేశారు.
● అవే పసలేని ఆరోపణలు…
వైకుంఠ ఏకాదశకు సంబంధించిన తొక్కిసలాట, తిరుమల లడ్డూకు సంబంధించిన ఆరోపణలు, పరకామణి కేసుసు సంబంధించిన విషయం కానీ, కొత్తగా శ్రీవారి సాలువాలకు సంబంధించిన వ్యవహారం.. ఉదంతం ఏదైనా హిందూ ధర్మాన్ని, తిరుమల క్షేత్రాన్ని ఆయుధంగా వాడుకుని… ఉద్దేశపూర్వకంగా వైయస్.జగన్ మీద దాడి చేయడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందవచ్చన్నదే చంద్రబాబు ఆలోచన.
ఇవాళ చేస్తున్న ఆరోపణలనే ఏడాదిన్నర పదే, పదే చేస్తూ వస్తున్నారు. వాళ్ల హయాంలో వాల్లు చేస్తున్న తప్పులను సరిదిద్దుకోవాల్సింది పోయి.. ఆ కార్యక్రమాలేవీ చేయకుండా వైయస్.జగన్ పాలనలోనే ఇవన్నీ జరిగాయని ఆరోపణలు చేస్తున్నారు. వీరి ఆరోపణలను ఒక్కదాన్ని కూడా నిరూపించకుండా… నిరంతరం నేరుగా వైయస్.జగన్ మీదనే వేలెత్తి చూపిస్తూ రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు.
సరిగ్గా ఏడాది క్రితం వైకుంఠ ఏకాదశి దర్శనాల కోసం క్యూలైన్లో జరిగిన తొక్కిసలాటలో 6 గురు భక్తులు చనిపోగా… 40 మందికి పైగా తీవ్ర గాయాలు పాలైతే చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన తిరుపతి వచ్చి, 10 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి దర్శనాలు ఎవరు పెట్టమన్నారు అని ప్రశ్నించారు. నేను భక్తులను అడిగాను, భక్తుల దగ్గర సమాచారం సేకరించాను, కొండమీద ఉండి ఉంటే.. కేవలం ఏకాదశి, ద్వాదశి రెండు రోజుల పాటే ఉంటే చాలా బాగుంటుందని చెప్పారు.
ఆ దర్శనానికి 35 గంటలు పట్టినా, 50 గంటలకు పట్టినా మేం క్యూలైన్లో ఉండి ఎంత సమయమైనా వేచి ఉండి స్వామిని దర్శించుకుంటేనే మాకు ఆత్మ తృప్తి కలిగేది, 10 రోజుల దర్శనానికి ఆగమనాలు ఎలా అంగీకరించాయి? కచ్చితంగా దీన్ని రెండు రోజులకు కుదిస్తామని చంద్రబాబు చెప్పాడు. అనంతరం జరిగిన తిరుమల బోర్డు సమావేశంలో టీటీడీ చైర్మన్ సైతం రెండు రోజులే దర్శనం అని తీర్మానం చేశారు.
వాస్తవానికి మా ప్రభుత్వ హయాంలో 26 మంది పీఠాధిపతుల ఆమోదంతోనే 10 రోజుల పాటు వైకుంఠఏకాదశి దర్శనాలను కల్పించాలన్న ఆలోచనకు జడిసి చంద్రబాబు మరలా మాట మార్చారు. ఆ రోజు వైకుంఠ ఏకాదశి తొక్కిసలాటకు కారణం వైయస్.జగన్ హయాంలో 10 రోజుల పాటు దర్శనం కల్పించాలన్న నిర్ణయమేనని టీటడీ చైర్మన్ బీ ఆర్ నాయుడు మా మీద ఆరోపణలు చేశారు.
హరనాథ్ రెడ్డి నా బంధువు అని కూడా ప్రకటించారు. దానికి సంబంధించి సత్యనారాయణ మూర్తి అనే రిటైర్డ్ జడ్జితో విచారణ చేయించారు. ఆయన తన నివేదికను ప్రభుత్వానికి అప్పగించారు. ఇప్పటివరకు ఆ నివేదికను ప్రభుత్వం బయటపెట్టలేదు. దాని ప్రకారం చర్యలు కూడా తీసుకోలేదు. ఆ విచారణ ప్రారంభం కాకముందే డిప్యూటేషన్ మీద వచ్చిన ఒక అధికారిని బలిచేశారే తప్ప… ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంతా ఒక పథకం ప్రకారం వాళ్లు చేసిన తప్పులు మీద మా మీద అభాండాలు వేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు.
● తప్పుడు ఆరోపణలు – డైవర్షన్ పాలిటిక్స్…
లడ్డూ వ్యవహారంలో పందికొవ్వు, ఆవుకొవ్వు కలిసిందని సాక్షాత్తూ చంద్రబాబే చెప్పారు. దీనిపై సుప్రీం కోర్టే ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఈ రకంగా ఆరోపణలు చేయడం సబబా? అని ప్రశ్నిస్తూ, సిబీఐ ద్వారా సెట్ విచారణకు ఆదేశించింది. ఇవాల్టి వరకు అందులో ఒక్కటి కూడా రాజకీయపరమైన అరెస్టు జరగలేదు? కానీ మీరు మాత్రం ఏడాదిన్నర కాలంగా మా మీద అబాండాలు వేస్తూనే ఉన్నారు. పరకామణి వ్యవహారంలో ఏదైనా తప్పులుంటే దానిపై విచారణ చేసి, అందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని మా నాయకుడు వైయస్.జగన్ చెబితే.. దానికి వైయస్.జగన్ అది చాలా చిన్న చోరీ అంటున్నారంటూ ఆయన మీద నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.
సింహాచలంలో రూ.55 వేలు దొంగతనం చేస్తూ అక్కడున్న ఉద్యోగి పట్టుబడితే ఆయనకు స్టేషన్ బెయిల్ ఎలా ఇప్పిస్తారు చంద్రబాబు గారూ? అంటే సింహాచలంలో ఉన్నది దేవుడు కాదా? తప్పులుంటే చర్యలు తీసుకోవాలనే మా నాయకుడు చెప్పారు. పరకామణి వ్యవహారంలో తప్పులుంటే దర్యాప్తు చేసి, చర్యలు తీసుకోమనే మా నాయకుడు వైయస్.జగన్ చెప్పారు. రూ.75వేలు దొంగతనం జరిగిందని కూడా చెప్పారు. దానికి సనాతనవాది అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఏదేదో మాట్లాడుతున్నారు. మా ఇంట్లో ప్రతి రూములో బైబిల్ ఉంటుందని చెప్పింది మీరు కాదా? మా నాయనమ్మ దీపారాధన కోసం వెలిగించిన దీపంతో మా నాన్న… సిగరెట్ ముట్టించుకున్న ఘనత మా ఇంటి చరిత్ర అని చెప్పింది మీది కాదా?
పరకామణి కేసు చాలా చిన్నదని వైయస్.జగన్ అన్నట్టుగా ప్రచారం చేయడంతో పాటు.. ఇవాళ మరలా దేవస్థానంలో వాడినవన్నీ పట్టువస్త్రాలు కావని, సింథటిక్ అని మాట్లాడుతున్నారు.
కానీ విజిలెన్స్ నివేదిక ప్రకారం 2015 నుంచి 2025 వరకు అని చెపితే… దాన్ని మరుగున పెట్టి మా హయాంలో ఈ కుంభకోణం జరిగిందని దీన్ని కూడా మా హయాంలో జరిగిందని రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా దాన్ని పెద్ద నేరంగా చిత్రీకరించి, శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నామన్న స్పృహ కూడా లేకుండా… వైయస్.జగన్ మీద బురద జల్లి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు.
● గతంలో లెక్చర్లు ఇచ్చిన సనాతని ఏమయ్యారు ?
అహోబిలంలో కూడా నాలుగు నెలల క్రితం దొంగతనం జరిగితే ఎందుకు ఏ రకమైన చర్యలు తీసుకోలేదు. కానీ తిరుమలలో మాత్రం ఎందుకు హడావుడి చేస్తున్నారంటే…. తిరుమల వేదికగా ఏం జరిగినా దేశమంతటా ప్రాకుతుంది, దాని మీద ఎన్నిరకాలుగా మాట్లాడినా చెల్లుబాటు అవుతుందన్న దురుద్దేశంతోనే మీరు ఇదంతా చేస్తున్నారు.
అయ్యప్పమాల ధరించడం మూలంగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గిపోయాయని 2014-19 మధ్య మీరు మాట్లాడిన మాట వాస్తవం కాదా? మీ హయాంలోనే దుర్గగుడికి చెందిన విలువైన భూములను మీకు సన్నిహితుడుకి ఇచ్చిన మాట నిజం కాదా? చెన్నై లో ఉన్న దేవుడి పొలాన్ని అతి తక్కువకే అమ్మింది మీరు కాదా? దాని మీద వైయస్.జగన్ పోరాటం చేసిన మాట నిజం కాదా? సనాతనవాదినని చెప్పుకునే పవన్ కళ్యాణ్ దీనిమీద ఎప్పుడైనా ఎందుకు ప్రశ్నించలేదు?
2014-19 మద్య కాలంలో చంద్రబాబుకు సహకరించడానికి లౌకికవాదిగా ముసుగువేసుకున్న పవన్ కళ్యాణ్.. మా ఇంట్లో బైబిల్ ఉంటుంది, అవసరమైతే నేను గొడ్డు మాంసం తింటానని చెప్పింది పవన్ కళ్యాణ్ కాదా? పశుమాంసం విక్రయాలకు సంబంధించి దేశమంతటా ఆందోళనలు జరుగుతుంటే.. దానికి వ్యతిరేకంగా మాట్లాడిన మాట వాస్తవం కాదా? ఈరోజు సనానత ధర్మం గురించి లెక్చర్లు ఇస్తున్న మాట వాస్తవం కాదా?
● బీ ఆర్ నాయుడు ఫెయిల్యూర్ ఛైర్మన్…
దుర్యోధనుడు పుట్టినప్పుడు ఎన్ని దుశ్శకునాలు కలిగాయో… చంద్రబాబు నాయుడు తనకు భజన చేసే భక్తి ఛానెల్ కు చెందిన అధిపతిని టీటీడీ పాలకమండలి చైర్మన్ చేసినప్పుడు కూడా అన్నే జరిగాయి. గోవులు మరణించాయి, విగ్రహాలు మలమూత్రాదుల మద్య ఉన్నాయి. శ్రీ మహావిష్టువు విగ్రహానికి అపచారం జరిగితే దాన్ని శనీశ్వరుడి విగ్రహం అని చెప్పగలరు. మద్య మాంసాలతో మాడ వీధులు బోరున ఏడుస్తాయి. కొండమీద దళారుల విశృంఖల రాజ్యం నడుస్తుంటే.. తాను మాత్రం స్వామి వారి పాదపదసేవలో పునీతుడ్ని అవుతున్నానని బీ ఆర్ నాయుడు చెప్పగలుగుతాడు.
సేవా టిక్కెట్ల విక్రయం అనంతంగా సాగిపోతుంది. దుర్నీతిపరుడు, దుర్వ్యసన వారసుడు, దుర్యోదన సోదరుడు, దుశ్శాసన సమానుడు లాంటి బీ ఆర్ నాయుడు గత ఏడాది కాలంగా చంద్రబాబుకి తన భక్తి ఛానెల్ లో భజన చేస్తూ… మరోవైపు నన్ను తిడుతూ నా మీదనే నడిపిస్తున్నారన్నది వాస్తవం. నిరంతరం నా మీద దాడి చేస్తూ… వైయస్.జగన్ ను నిందిస్తూ ఛానెల్ నడుపుకుంటున్నాడు.
● పురాణ కాలం నుంచి ఎంత మహానుభావులైనా…
శ్రీ మహా విష్ణువును దర్శించడం కోసం వేల ఏండ్లు తపస్సు చేసి.. శరీరాన్ని శుష్కింపజేసుకుంటే అప్పుడు వారికి శ్రీవారి దర్శనం లభించేది. ఇంతవరకు ఏ ఒక్క భక్తుడూ తర,తరాలుగా స్వామి వారి దర్శనానికి ఇంతసేపు వేచి ఉండాలా? అని ఏ ఒక్క భక్తుడూ ఆరోపించిన సందర్భం లేదు. మీరు చేయాల్సిందల్లా భక్తులకు క్యూలైన్లో సరైన సౌకర్యలు కల్పిస్తే చాలు.
గర్భగుడిలో దీపాలు మాత్రమే వెలుగుతాయి. మీరు పదే పదే ఏఐ టెక్నాలజీ అంటున్నారు.
నా మీద నోటికొచ్చినట్లు మాట్లాడుతూ… నా పై నిందలు వేసి దోచుకుంటున్నానని ఆరోపిస్తున్నాడు.
నిరూపించమని సవాల్ చేస్తున్నాను. బీ ఆర్ నాయుడు మనలాంటి వ్యక్తా… పూర్వ మానవ అంశా అన్న అనుమానం కలుగుతోంది. ఆయన హోమో సేపియన్ జాతికి చెందిన మనిషి కాదేమో అనిపిస్తుంది. నియాండెర్తల్ జాతో లేదంటే డెనిసోవిన్ జాతికి చెందినవ్యక్తి అయ్యుంటే తప్ప ఇలాంటి ఆలోచనలు రావు. శాస్త్రజ్ఞలు బీ ఆర్ నాయుడు మెదడు మీద పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది. కారణం ఆయన అంత వింతగా మాట్లాడుతున్నాడు.
భవిష్యత్తులో ఈయన మెదడును మ్యూజియంలోనూ ప్రస్తుతం ఆయన్ను జూలోనూ ఉంచాల్సిన అవసరం ఉంటుంది.
బీ ఆర్ నాయుడు గారు వచ్చిన తర్వాత దేవదేవుడి గుడి రాజకీయ ప్లాట్ ఫామ్ గా మారింది. నా వెనుక ఒక సుప్రీంకోర్టు న్యాయాధికారి ఉన్నాడని బీ ఆర్ నాయుడు, వర్లరామయ్య చెబుతున్నారు. ఆ న్యాయాధికారి కాలిగోటికి సరిపడా విలువ చేయని ఈయన.. ఆయన్ను ప్రతి రోజూ అనరాని మాటలంటున్నాడు. నీకు దమ్మూ, ధైర్యం ఉంటే నా వెనుక ఉన్న న్యాయాధికారి పేరు చెప్పే సాహసం ఉందా? అని ప్రశ్నించారు.
బీ ఆర్ నాయుడు తన ఛానెల్ అధిపతిగా పనిచేస్తున్నాడే తప్ప…. టీటీడీ పాలకమండలి అధ్యక్షుడి హోదాలో పనిచేయడం లేదు. బీ ఆర్ నాయుడు లాంటి పాపాత్ముడు ఉన్నప్పుడు శ్రీ వేంకటేశ్వరుడి దర్శనానికి వెళ్లొద్దని భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాను. కారణం ఆయనలాంటి పాపి ఉంటే శ్రీమహావిష్టువు అక్కడ ఉండడని అర్చకులతో సహా చెప్పుకుంటున్నారు.
మీరు గతంలో నాపై చేసిన ఆరోపణలు సహా, తాజాగా ఆరోపించిన శాలువాల కొనుగోలుపై సైతం ఏ విచారణకైనా సిద్ధమే? అని భూమన మరోసారి సవాల్ చేశారు.