-
పేదవారి ఆకలి తీర్చడానికి అన్న క్యాంటీన్లు
-
వంద రోజుల్లోనే సంతృప్తికర పాలన
-
శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్
-
గొంటివీధిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
శ్రీకాకుళం: ప్రజల ఆరోగ్యమే ముఖ్య లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోంది, పేదవారి ఆకలి తీర్చడానికి అన్న క్యాంటీన్ల, రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలకు సంతృప్తికర పాలనందుతోందని శ్రీకాకుళం శాసన సభ్యులు గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం గోంటి వీధిలో ఆదివారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా శాసన సభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం వైపు నడిపిస్తున్న ఇది మంచి ప్రభుత్వమన్నారు.
ఇది మంచి ప్రభుత్వం! ఎందుకంటే సంక్షోభంలోనూ సంక్షేమం అందించెందుకు
40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి పథంలోకి తీసుకువెళుతున్నారని పేర్కొన్నారు.
అభివృద్ధికి రెక్కలు తొడిగి, మొదటి 100 రోజుల్లోనే ‘ఇది మంచి ప్రభుత్వం!’ అని ప్రజలతో అనిపించు కుంటోందన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వివరాలు తెలియజేసే కరపత్రాల పంపిణీ, స్టిక్కర్లు అంటించే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.
మాటలకే పరిమితం కాకుండా ఇచ్చిన 6 హామీలు నెరవేర్చేదిశగా అడుగులు వేస్తూ ప్రజా సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నామన్నారు. అందులో భాగంగా మెగా డీఎస్సీతో 16,437 ఉపాధ్యాయ పోస్టుల భర్తీని చేపట్టి నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతూ, పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 5 రూపాయలతోనే ఆకలి తీర్చే 175 అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించడం జరిగిందన్నారు.
అలాగే పింఛన్లు ఒకేసారి రూ.1000 పెంచి రూ.4 వేలు ఇస్తున్నామని తెలిపారు. మొదటి నెల ఒక్కొక్కరికీ రూ.7000లు చొప్పున ఒకేరోజు 65.18 లక్షల మందికి ఇంటింటికీ వెళ్లి రూ.4,408 కోట్లు పంపిణీ చేయడం దేశంలోనే ఒక తిరుగులేని సంక్షేమ చరిత్ర అన్నారు. ప్రతి నెలా ఒకటో తారీఖునే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని అన్నారు. స్థానిక సంస్థలకు రూ.1452 కోట్లు ఇచ్చి పంచాయతీలకు ప్రాణం పోసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే అని శాసన సభ్యులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది స్థానిక నాయకులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.