Suryaa.co.in

Telangana

క్యాన్సర్ ఆసుపత్రికి పది ఎకరాలు కేటాయించండి

– రోగుల అవసరాలు తీర్చలేకపోతున్నాం
– తెలంగాణా ప్రభుత్వానికి బోర్డు వినతి
– నానాటికీ పెరుగుతున్న రోగుల అవసరాలను తీర్చలేని స్థితికి చేరుకొన్న
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్
-500 పడకలతో కూడిన సరికొత్త క్యాంపస్ ఏర్పాటుకు సరిపడా పది ఎకరముల స్థలం కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన నందమూరి బాలకృష్ణ నేతృత్వంలోని ట్రస్టుబోర్టు సభ్యులు
-ప్రస్థుతం ఉన్న క్యాంపస్ కు చెందిన లీజు గడువు పెంచుతూ సదరు స్థలాన్ని హాస్పిటల్ కు శాశ్వత ప్రాతిపదికన కేటాయించాలని విజ్ఞప్తి

దేశంలోనే మొదటి పది అత్యుత్తమ క్యాన్సర్ హాస్పిటల్స్ లో ఒకటిగా పేరు గడించిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ స్థాపించి 22 సంవత్సరములు గడచి పోయాయి. నేడు భారత దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎందరో క్యాన్సర్ రోగులకు వరదాయినిగా పేరు గడించిన BIACH&RI కు 26 మే 1989 లో నాటి ప్రభుత్వం హైదరాబాదులో 7.35 ఎకరముల స్థలాన్ని కేటాయించింది. ఆటు పిమ్మట 2000 సంవత్సరములో పూర్తి స్థాయి సేవలను అందించడం ప్రారంభించింది.

నాటి నుండి నేటి వరకూ దినదినాభివృద్ది చెందుతూ 600 పైగా పడకలు కలిగి ప్రతి నిత్యం 2000 వేల మందికి పైగా ఔట్ పేషెంట్లు మరియు 500-600 మంది ఇన్ పేషెంట్లకు చికిత్స అందించే స్థాయికి చేరింది. దీంతో పాటూ నిత్యం 20-25 శస్త్ర చికిత్సలు చేయడమే కాకుండా 1300-1500 ల్యాబొరేటరీ పరీక్షలు, 300 కు పైగా రేడియాలజీ పరీక్షలు, 20-22 ఎండో స్కోపీ పరీక్షలు, 18-20 పెట్ సిటీ స్కానింగ్ లు, 100-120 బ్లడ్ బ్యాంక్ సేవలను BIACH&RI అందిస్తోంది. ఇలా కేవలం అత్యధిక సంఖ్యలో చికిత్స అందించే సంస్థగానే కాకుండా ప్రపంచ స్థాయి వైద్య చికిత్సను అందుబాటైన ధరలలో అందించాలనే తన లక్ష్యానికి అనుగుణంగా అత్యాధునిక వైద్య సామగ్రి, సాంకేతిక పరిజ్ఞానాన్ని హాస్పిటల్ లో ఏర్పాటు చేయడం జరిగింది.

ఇలా వైద్య సేవలు అందించడంలోనే కాకుండా క్యాన్సర్ వ్యాధి రాకుండా అరికట్టడానికై తీవ్ర స్థాయిలో నడుం బిగించి తెలంగాణా రాష్ట్రంలోని మారు మూల ప్రాంతాలలో ఉచిత వ్యాధి నిర్థారణ శిబిరాలను నిర్వహించడంలో BIACH&RI అగ్రగామిగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలలో 2,50,000 మందికి పైగా ప్రజలను స్క్రీనింగ్ చేయడమే కాకుండా ఈ భయంకర వ్యాధిపై అవగాహన కలిపించడంలోనూ సంస్థ ముందంజలో ఉంది. ఇలా సామాన్య పేద ప్రజలకే కాకుండా తెలంగాణా ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు మరియు మిలిటరీ సిబ్బంది, కార్పొరేట్ మరియు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు మరియు వాటి కుటుంభ సభ్యులకు కూడా ఎన్నో క్యాంపులు నిర్వహించడం జరిగింది. ఇలా అత్యాధునికి వైద్య సామంగ్రి సహాయంతో చికిత్స అందిస్తున్నా నగరంలోని ఇతర క్యాన్సర్ హాస్పిటల్స్ తో పోలిస్తే 30 శాతానికి పైగా తక్కువ ధరలలోనే వైద్య సేవలు అందించగలగడం బసవతారకం కు మాత్రమే స్వంతం.

ఇక హాస్పిటల్ కు వచ్చే పేషెంట్లలో 50 శాతానికి పైగా తెలంగాణా రాష్ట్ర ఆరోగ్య శ్రీ పథక లబ్దిదారులైన పేద వారు కావడం విశేషం. ఈ సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. వీరితో పాటూ పలు ఇతర రాష్ట్రాల నుండే కాకుండా ఇతర దేశాలలోని క్యాన్సర్ రోగులకు అందుబాటైన ధరలలో చికిత్స అందిస్తున్న ఘనత BIACH&RI దని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలా సంస్థ అందిస్తున్న సేవలను ఇటీవల భారత ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ వారు అందుబాటైన ధరలలో అత్యంత నాణ్యమైన, ఆధునిక వైద్య పరిజ్ఞానంతో కూడి చికిత్సను అందిస్తున్న అగ్రగామి సంస్థగా పేర్కొంటూ విశేష గుర్తింపునిచ్చారు. ఇలా సంస్థ దిదదినాభివృద్ది చెందడానికి నందమూరి బాలకృష్ణ నేతృత్వంలోని ట్రస్టు బోర్డు సభ్యుల సేవా నిరతి, నిబద్దతే కారణం.

అయితే తెలంగాణా రాష్ట్రంతో పాటూ దేశ వ్యాప్తంగా నానాటికీ పెరుగుతున్న క్యాన్సర్ రోగుల సంఖ్య కారణంగా మంచి చికిత్సను అందించగలిగే పరిజ్ఞానం కలిగి కూడా అందుకు తగిన స్థలం లేకపోవడంతో ఇతర సదుపాయాల కొరత ఏర్పడడం వలన చికిత్స అందించలేని స్థితికి చేరుకోవడం భాదాకరమైన అంశం. నాడు అందించిన స్థలంలో ప్రతి అంగుళాన్ని ఇప్పటికే పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడంతో ఇక ప్రస్థుత స్థలంలో హాస్పిటల్ సదుపాయాలు పెంచడానికి ఏ మాత్రం వీలు కాని పరిస్థితి ఏర్పడింది. గత రెండు సంవత్సరముల కాలంలో తీవ్రమైన పడకల కొరత నేపధ్యంలో అందుబాటులోని ప్రతి అంగుళ స్థలాన్ని వినియోగించుకొని 100 పడకల వరకూ పెంచడం జరిగింది. అయినప్పటికీ పడకల కొరత తీరేలా కనిపించడం లేదు.

ఇలా పడకల కొరతే కాకుండా పార్కింగ్, డార్మిటరీ వంటి వ్యవస్థలపై పడుతున్న ఒత్తిడి అంతా ఇంతా కాదు. పెరిగిన అవసరాలకు అవి ఏ మాత్రం సరిపోవడం లేదు. ఇలా హాస్పిటల్ లోని ప్రతి వ్యవస్థ లు ఒత్తిడి తట్టుకోలేని స్థాయికి చేరుకోవడంతో భవిష్యత్తులో పెరుగుతున్న రోగుల సంఖ్యకు తగినట్లుగా చికిత్స అందించడంలో విఫలమయ్యే పరిస్థితి నెలకొంది.

ఈ పరిస్థితిని సమీక్షించేందుకు.. నందమూరి బాలకృష్ణ నేతృత్వంలోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ ట్రస్టు బోర్డు సభ్యులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.హైదరాబాదులోని BIACH&RI బోర్డు సమావేశ మందిరంలో జరిగిన సమావేశానికి అమెరికాకు చెందిన ట్రస్టు బోర్డు సభ్యులు డా. రాఘవరావు పోలవరపు మరియు డా. దత్తాత్రేయ నోరి లు కూడా నేరుగా, ప్రత్యక్షంగా హాజరై విషయాన్ని సమగ్రంగా సమీక్షించి చర్చించారు.

అనంతరం నానాటికీ పెరుగుతున్న క్యాన్సర్ రోగులకు సంబంధించిన అవసరాలను గమనించిన BIACH&RI ట్రస్టు బోర్డు హాస్పిటల్ విస్తరణ కోసం సరైన ప్రత్యామ్నాయ వేదిక కోసం వెతకాలని తీర్మానించి పలు ప్రదేశాలు, బిల్డింగ్ లను పరిశీలించడం జరిగింది. అయితే అవి సమగ్రమైన క్యాన్సర్ చికిత్స కేంద్రాన్ని నెలకొల్పడానికి అనువుగా లేకపోవడంతో మరో 500 పడకల క్యాన్సర్ చికిత్స కేంద్రానికి అవసరమయ్యే రీతిలో చికిత్సకు వచ్చే రోగులకు అనువైన చోట 10 ఎకముల స్థలాన్ని కేటాయించాలని తెలంగాణా ప్రభుత్వాన్ని కోరాలని తీర్మానించి అందుకనుగుణంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించింది.

స్థలాన్ని కేటాయించిన వెంటనే నిధులు సమకూర్చుకొని హాస్పిటల్ నిర్మాణానికి పూనుకోవాలని ట్రస్టు బోర్డు తీర్మానించడమే కాకుండా స్థలం అందించిన తర్వాత అత్యంత స్వల్ప కాల వ్యవధిలోనే ఈ సరికొత్త చికిత్సా కేంద్రాన్ని ప్రారంభించాలని నిర్ణయిందింది.

ఇలా సరికొత్త స్థలం కేటాయించాలని కోరడంతో పాటూ ప్రస్థుతం హాస్పిటల్ ఉన్న స్థలం యొక్క లీజు గడువు 30 సంవత్సరముల కాలం పూర్తి కావస్తున్నందున లీజు గడువును 99 సంవత్సరముల కాలానికి పాడిగించాలని లేదంటే, సదరు స్థలాన్ని హాస్పిటల్ కు శాశ్వతంగా కేటాయించేందుకు వీలు కలిపించేలా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ని కోరుతూ నందమూరి బాలకృష్ణ నేతృత్వంలో ట్రస్టు బోర్డు సభ్యులు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు కి విజ్ఞప్తి చేస్తూ తీర్మానం చేశారు. ఈ తీర్మానానికి అనుగుణంగా త్వరలోనే ముఖ్యమంత్రిని కలవడం ద్వారా తెలంగాణా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు.

LEAVE A RESPONSE