Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి వేడుకలు

మంగళగిరి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో 125 వ అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకులు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అల్లూరి చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడుతూ…. రవి హస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి తన పోరాట స్ఫూర్తితో మన్యం ప్రజలను చైతన్యం చేసిన వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలను నేడు రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమాన్ని జగన్ రెడ్డి ప్రభుత్వం నిర్వహించడం పోవడం తెలుగు ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

మహాత్మా గాంధీ చేతనే ఘనంగా కొనియాడబడిన పోరాటయోధుడి పటిమను, త్యాగాన్ని జగన్ రెడ్డి ప్రభుత్వం విస్మరించడాన్ని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య దుయ్యబట్టారు. తెదేపా కార్యాలయంలో జరిగిన అల్లూరి సంస్కరణ సభలో వర్లరామయ్య ఘన నివాళి అర్పించారు.

అల్లూరి విషయంలో ముఖ్యమంత్రి చరిత్రక అవగాహన రాహిత్యుడు నిర్లక్ష్య వైఖరిని వెల్లడిస్తున్నాడని తీవ్రంగా విమర్శించారు. నిన్న సాయంత్రం తెదేపా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గారు సమక్షంలో విజయవాడలో ఈరోజు సాయంత్రం అల్లూరి జయంతి వేడుకల సంగతి తెలుసుకొని హడావుడిగా ముఖ్యమంత్రి కలెక్టర్లకు ఫోన్ చేసి కంటితుడువుగా అల్లూరి జయంతి కార్యక్రమాలను నిర్వహించవలసిందిగా ఆదేశించడం జరిగింది.

జగన్ రెడ్డి వైఫల్యాన్ని ఎత్తిచూపుతోందని వర్ల రామయ్య ఆగ్రహం వెల్లిబుచ్చారు. మన్య వీరులు అభం శుభం తెలియని ప్రజలపై బ్రిటిష్ సామ్రాజ్యం చేస్తున్న కుట్రలను ఎదుర్కోవడానికి ఏగు చుక్కలాగా ఒక ఆపద్బాంధవుడులా అల్లూరి వారి కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు. బ్రిటిష్ దోపిడీ నుండి అమాయకులకు, మన్యం జనాంగానికి అండగా ఉండి ఎదుర్కొని మన్య వీరుడుగా పేరుగాంచిన అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారికి కొరకరాని కొయ్యల మారారు.

ఆయన మాట బ్రిటిష్ వారికి సింహగర్జనలా మారింది మిరపకాయ తుటాలతో మీ పోలీస్ స్టేషన్లను కొల్లగొడతానని చెప్పి మరి పోలీస్ స్టేషన్లను ముట్టడించి ఆయుధాలతో బ్రిటిష్ వారిపై దాడి చేసిన చిరుత అల్లూరి. ఆ రోజుల్లో రూ. 10 వేలు నజరేనా ఇస్తామని బ్రిటిష్ సామ్రాజ్యం ప్రకటించిన గిరిజనులు ఆయన జాడ చెప్పలేదు. అంటే అల్లూరిని చూస్తే ఏ విధంగా భయపడుతున్నారో అర్థం అవుతుంది. ఆయన 125వ జయంతి ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రధాని మోడీ సమక్షంలో భీమవరంలో జరిగింది కానీ ముగింపు సభ హైదరాబాద్ లో జరగడం ఆ కార్యక్రమానికి సాక్షాత్తు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరై నివాళులర్పించారు.

ముఖ్యమంత్రి ఆయన గురించి తెలియదు ఆయనను గౌరవించాలని లేదు. దేశానికి దేశ స్వతంత్ర్యానికి ప్రధాన నాయకుడు అలాగే తిరుగుబాటు చేసిన మొట్టమొదటి నాయకుడు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని ముగింపు సభ కూడా మన్యం జిల్లాలో ఏర్పాటు చేసి ఉంటే అల్లూరికి నిజమైన నివాళి. కానీ మన ముఖ్యమంత్రి లోపం తెలుసుకొని తెలంగాణ ముఖ్యమంత్రి ముగింపు సభ అవకాశాన్ని దక్కించుకున్నారు. ఈ ముఖ్యమంత్రి గారికి ప్రకాశం పంతులు గారి గురించి తెలియదు.

పొట్టి శ్రీరాములు గారి గురించి తెలియదు, పెద్దలు కొణిజేటి రోశయ్య గారిని గౌరవించరు. ఆర్థిక స్థితికర్త పివి నరసింహారావు అంటే పడదు ఆయన గురించి పట్టించుకోరు. తెలుగు జాతి ఖ్యాతిని దశ దిశల వ్యాపింపచేసిన విఖ్యాత నటసార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు గారి గొప్పతనాన్ని అంగీకరించరు. అనాలోచితంగా లభించిన ముఖ్యమంత్రిత్వాన్ని మాత్రం దోచుకోవడానికి దాచుకోవడానికి దిట్ట సిద్ధహస్తుడు ముఖ్యమంత్రి అని దుయ్యబట్టారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొత్తపల్లి శామ్యూల్ జవహర్ మాట్లాడుతూ…. భారత స్వాతంత్ర్య చరిత్రలో ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయనం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు. కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడు.

ఆయన పుట్టుకతో క్షత్రియుడు కానీ మన్యం ప్రాంతంలో గిరిజనుల పడుతున్న బాధలను చూసి చలించిపోయి బ్రిటీష్ నాయకులు గుండెల్లో నిద్రపోయారు. గిరిజనులను పెడుతున్న కష్టాలను చూసి బ్రటీష్ ప్రభుత్వాలపై తిరుగుబాటు చేసి జయకేతనం ఎగరవేసిన స్వాతంత్ర్య పోరాట సమరయోధుడుగా శ్రీ అల్లూరి సీతారామరాజు గిరిజనులను బ్రిటీష్ సామ్రాజ్యం నుండి విముక్తి కలిగించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు మాట్లాడుతూ…. స్వాతంత్ర్య సమరయోధుడు మొట్టమొదటి సారిగ గిరిజనుల కోసం పోరాటం కొనసాగించిన పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు మాత్రమే. సాధారణ కుటుంబంలో పుట్టి బీమవరం మోగల్లు అనే ప్రాంతంలో జన్మించారు. వృత్తి రీత్యా డాక్టర్ కానీ మన్యం ప్రాంతంలో గిరిజనుల కోసం కుటుంబం నుండి అడవికి ప్రయాణమై పోయి నిరాక్షరాసులకు అదర్శమైన ఆదర్శమూర్తి అల్లూరి సీతారామరాజు గారని గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో నాయకులు ఏ వి రమణ గారు, పారా రామకృష్ణ, పరచూరి కృష్ణ, దేవినేని శంకర్ నాయుడు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

LEAVE A RESPONSE