Suryaa.co.in

Andhra Pradesh

ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు

మంగళగిరి: మన్యం వీరుడు, పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అల్లూరి చిత్రపటానికి రాష్ట్ర ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పూల మాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ…”అల్లూరి పోరాట పటిమ చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. బ్రీటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన విప్లవ జ్యోతి అల్లూరి. అల్లూరి ధైర్యానికి, త్యాగానికి మారు పేరై శ్రతువులకు దడ పుట్టించారు. ఆడబిడ్డలను ఆయుధాలుగా మలచి, తెలుగునేలకు స్వాతంత్ర్య పోరాటం నేర్పి, బ్రిటీష్ పాలకులని హడలెత్తించి మన్యం గుండెల్లో కొలువైన అల్లూరి సీతారామరాజుకు నా నివాళులు” అని అన్నారు.

అల్లూరికి నివాళులర్పించిన వారిలో మంత్రి కొండపల్లితో పాటు ఎన్ఆర్ఐ టీడీపీ కోఆర్డినేటర్స్ బుచ్చి రాంప్రసాద్, రాజశేఖర్, టీడీపీ మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్ర, టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎ.వి.రమణ, నేతలు కృష్ణ, పారా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE