– సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి డిమాండ్
పరవాడ: మండల కేంద్రమైన పరవాడలో ఆటో కార్మికులతో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ , ఆటో కార్మికులు నిరుద్యోగులుగా ఉంటూ ప్రభుత్వం ఉపాధి కల్పించకపోయినా అనేకమంది వ్యవసాయం లాభసాటిగా లేకపోవడంతో, ప్రైవేట్ ఫైనాన్స్ దగ్గర అప్పులు చేసి బ్యాంకుల దగ్గర లోన్ తీసుకొని ఆటోలు కొనుగోలు చేసి ప్రతినెల ఫైనాన్సర్లకి కిస్తీచెల్లిస్తూ పిల్లల చదివించుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు.
రాష్ట్రంలో సుమారు పది లక్షల మంది ఆటో డ్రైవర్లకు స్వయం ఉపాధి పొందుతున్నారు. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే బేరాలు తగ్గుతాయి. ఉపాధికి దెబ్బతింటుంది. ఉచిత బస్సు ప్రయాణానికి ఆటో కార్మికులుగా మేము వ్యతిరేకం కాదు.ఎన్నికల్లో ఆటో కార్మికులకు ఇచ్చిన హామీల అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికులకు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ప్రతి ఆటో కార్మికుడికి వాహన మిత్ర పథకం కింద సంవత్సరానికి 25000 ఇచ్చి ఆదుకోవాలి.
ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ పై విధించిన వాట్ వ్యాట్ తగ్గించాలి. 2019లో గత ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 21 రద్దు చేయాలి. అన్ని రకాల పెంచిన ఫీజులు పెనాల్టీలు తగ్గించాలి. ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించాలి.వాహన కొనుగోలుకి బ్యాంకుల ద్వారా నాలుగు లక్షల రూపాయలు సబ్సిడీతో కూడిన వడ్డీ లేని రుణాలు మంజూరు చేయాలి.
పట్టణ మండల కేంద్రాల్లో ఆటోలకు పార్కింగ్ స్థలాలు కేటాయించాలి.వాహన ఫిట్నెస్ ఏ టి ఎస్ ఆటోమేటిక్ ట్రాక్ ప్రైవేటు ఇవ్వడం రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన న్యాయసహితే డ్రైవర్లకు భారీ పెనాల్టీలు జైలు శిక్షలు పిఎన్ఎస్ 106 (1)&2 సెక్షన్లు రద్దు చేయాలి. పార్లమెంటులో ఎంపీలు దీనికోసం డిమాండ్ చేయాలి.
ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఈ కార్యక్రమంలో పి. శ్రీనివాసరావు, రాము, అప్పలరాజు, రవి తదితరులు పాల్గొన్నారు