Suryaa.co.in

Andhra Pradesh

ఇసుక తవ్వకం సబ్ లీజుకు ఇవ్వరాదని ఉన్నా.. ఇచ్చారు

– ఇసుక మాఫియా డాన్ పెద్దిరెడ్డి మంత్రి పదవికి ఏమాత్రం అర్హుడు కాదు
– గవర్నర్ వెంటనే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని బర్తరఫ్ చేయాలి
– జేపీ వెంచర్ ఆర్థికంగా కూడా బలోపేతంగా ఉందని పొందుపరచి మరీ ఉత్తర్వులిచ్చారు
– జయప్రకాశ్ పవర్ వెంచర్స్ కు ఆంధ్రప్రధేశ్ ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందంలో..
ఇసుక తవ్వకం సబ్ లీజుకు ఇవ్వరాదని ఉన్నా.. ఇచ్చారు
– మైనింగ్ డైరెక్టర్ వెంకటరామిరెడ్డి కూడా బాధ్యత వహించాల్సిన అవసరముంది
– చంద్రబాబునాయుడు పై వైఎస్ విజయమ్మ వేసిన పిటిషన్ కూడా న్యాయస్థానాలు కొట్టేశాయి
– మాజీ మంత్రి నక్కా ఆనందబాబు

జేపీ వెంచర్ సంస్థతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో సబ్ కాంట్రాక్టు ఇవ్వకూడదన్న నిబంధనను నక్కా ఆనందబాబు బయట పెట్టారు.

ఆదివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు ..

పరిపాలనపై ఏమాత్రం అవగాహన లేదనడానికి రాష్ట్రంలో ఇసుక పాలసే నిదర్శనం. ఇసుక మాఫియా డాన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి పదవికి ఏమాత్రం అర్హుడు కాదు. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ విషయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఒక వ్యక్తికి, ఒక సంస్థకు ప్రయోజనాలు చేకూర్చేలా పెద్దిరెడ్డి వ్యవహరిస్తున్నారు.

ముఖ్యమంత్రి , మంత్రులు, శాసనసభ్యులు, నాయకులు ఇసుకను యదేచ్ఛగా దోచేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఇసుక మాఫియా భరతం పడతాం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేయాలి. గవర్నర్ వెంటనే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని బర్తరఫ్ చేయాలి
3,మే 2021వ తేదీన జయప్రకాశ్ పవర్ వెంచర్స్ కు ఆంధ్రప్రధేశ్ ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందంలో Any other required conditions/may be incorporated during the time of execution of Lease as the Director of Mines and Geology deem fit in accordance with the extant Acts and Rules. SAND LEASE GRANTED THROUGH 3-TENDER IS NOT TRANSFERABLE స్పష్టంగా అగ్రిమెంట్ లో సబ్ లీజుకు ఇవ్వరాదు అని ఉంటే.. నిస్సిగ్గుగా ఉల్లంఘించి పెద్దిరెడ్డి నీతులు చెబుతున్నాడు.

12.05.2021వ తేదీన మైనింగ్ డైరెక్టర్ వెంకటరామిరెడ్డి పేరుతో ఇచ్చిన ఉత్తర్వుల్లో Proceedings No.2793/Sand-P12021 లో జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సాంకేతికపరంగా అనుభవం కలిగిన సంస్థ అని ఆర్థికంగా కూడా ఈ సంస్థ బలోపేతంగా ఉందని పొందుపరచి మరీ ఉత్తర్వులిచ్చారు. అటువంటి సంస్థ జీఎస్టీ సక్రమంగా ఎందుకు చెల్లించలేదు? సబ్ లీజుకు ఇవ్వాల్సిన అవసరమేంటి? ఇందుకు మైనింగ్ డైరెక్టర్ వెంకటరామిరెడ్డి కూడా బాధ్యత వహించాల్సిన అవసరముంది.

మా నాయకుడు చంద్రబాబు జగన్ లాగా 16 నెలలు జైల్లో లేడు. జగన్ లా అవినీతికి పాల్పడలేదు.

11 సభా సంఘాలు, 4 న్యాయ విచారణ కమిషన్లు, 3 మంత్రివర్గ ఉప సంఘాలు, 4 ఉన్నతాధికారుల కమిటీలు, ఒక సీబీసీఐడీ విచారణ జరిపించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటివాళ్లే చంద్రబాబునాయుడు అవినీతి చేసినట్లు నిరూపించలేకపోయారు.

2464 పేజీల తప్పుడు ఆరోపణలతో చంద్రబాబునాయుడు పై వైఎస్ విజయమ్మ వేసిన పిటిషన్ కూడా న్యాయస్థానాలు కొట్టేశాయి. అలాంటి వ్యక్తికి బురద అంటించాలని చూస్తే అది జరగని పని.
పరిపాలనపై ఏమాత్రం అవగాహన లేదనడానికి రాష్ట్రంలో ఇసుక పాలసే నిదర్శనం. ఇసుక కొరత సృష్టించి 103 ఉప వృత్తులను నిర్వీర్యం చేశారు. 40 లక్షల మందిని రోడ్డుపాలు చేశారు.2 సంవత్సరాలపాటు ఇసుక పాలసీని ఒక గాడిలో పెట్టడం చేతకాక భవన నిర్మాణ కార్మికుల్ని పస్తులుంచారు. రెండు సంవత్సరాలపాటు ఇసుక పాలసీ అనేది లేకుండా అడ్డగోలుగా దోచేశారు.

జయప్రకాశ్ పవర్ వెంచర్ వారికి గంపగుత్తగా ఇసుక రీచ్ ల కాంట్రాక్టు కట్టబెట్టారు. ఇందులో ప్రధాన హస్తం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదే. ఒక టన్ను ఇసుక రూ. 475 ధరగా నిర్ణయించి పెద్ద గోల్ మాల్ కు పాల్పడ్డారు. మంత్రి పెద్దిరెడ్డి, మైన్స్ అండ్ జియాలజి డైరెక్టర్ వెంకట్ రెడ్డి లు అవినీతికి పాల్పడ్డారనేందుకు సాక్ష్యాధారాలున్నాయి. మంత్రి పెద్దిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అన్నీ అబద్ధాలు చెప్పారు. జేపీ వెంచర్స్ వారు సబ్ లీజులు ఇచ్చిన టన్కీ ఎంటర్ ప్రైజెస్ 3,302 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సివుందని సెబీకి ఫైల్ చేసినదానిలో చెప్పారు.

ఇదంతా అవినీతి, అక్రమ సంపాదనలో భాగమే. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ విషయంలో పెద్దిరెడ్డి దాన్ని పక్కన పెట్టండి, వస్తే ఎంత? రాకపోతే ఎంత? అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఒక వ్యక్తికి, ఒక సంస్థకు ప్రయోజనాలు చేకూర్చేలా పెద్దిరెడ్డి వ్యవహరించారనేది నిత్యసత్యం.

ముఖ్యమంత్రి , మంత్రులు, శాసనసభ్యులు, నాయకులు ఇసుకను యదేచ్ఛగా ఇష్టానుసారంగా దోచేశారు. మంత్రి, ప్రభుత్వం, డైరెక్టర్, పోలీసులు, కిందిస్థాయి అధికారులు ఇసుక అక్రమాలపై సమాధానం చెప్పాలి.

అందరూ ఎవరికి తగ్గ రీతిలో వారు వాటాలు తీసుకొని మెదలకుండా ఉన్నారు. మంత్రి పెద్దిరెడ్డి ఫిర్యాదులు తీసుకొని సమాధానం చెప్పాలి గాని డొంక తిరుగుడు మాటలెందుకు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి పదవికి అనర్హుడు. ఇసుక అక్రమాల గురించి టీడీపీ నాయకులు ప్రశ్నిస్తే గృహ నిర్బంధాలు చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం? జగన్ తన తండ్రి సీఎంగా ఉన్నప్పుడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని దోచేశాడు.

చంద్రబాబుకు నోటీసులు వచ్చినా సమాధానం చెప్పుకునే ధైర్యం ఆయనకుంది. ఎలాంటి అవినీతికి పాల్పడలేదు కాబట్టి ఆన్సర్ ఇచ్చుకుంటారు. పెద్దిరెడ్డి ప్రజలకు సంబంధించిన అంశాలు పక్కదారి పట్టించడానికి చౌకబారు ఎత్తుగడలు వేస్తున్నారు.

వైసీపీ వారు దుష్ప్రచారం చేయడంలో దిట్టగా ఉన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఇసుక మాఫియా భరతం పడతాం, ఇసుక దందాలో అక్రమాలకు పాల్పడిన మంత్రి పెద్దిరెడ్డి వెంటనే రాజీనామా చేయాలి. గవర్నర్ కల్పించుకొని విచారించి మంత్రిని బర్తరఫ్ చేయాలని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు కోరారు.

 

LEAVE A RESPONSE