Suryaa.co.in

Andhra Pradesh

మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు..

– ఎస్ కే యూ లో పూర్వ విద్యార్థుల కలయిక
– ఎస్ కే యూలో విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు మాజీ మంత్రులు డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, రఘువీరా రెడ్డి, ఎమ్మెల్యేలు ,ఎంపీలు ,మాజీ ఎమ్మెల్యే లు విశ్వ, రామకృష్ణ, ఉన్నతాధికారులు

అనంతపురం: ఎస్కే యూనివర్సిటీలో నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో రాజకీయ ఉద్దండులు ఉన్నతాధికారులు ఒకటయ్యారు మళ్లీమళ్లీ ఇది రాని రోజు అంటూ ఒకరినోకరు ఆప్యాయంగా యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. చదివింది మాత్రం ఎస్కే యూనివర్సిటీలో అయితే వారు రాణిస్తున్నది మాత్రం వివిధ పార్టీల్లో ఉండి ఉన్నత స్థానంలో అత్యున్నత పదవులు పొందిన వారే. ఎపి తో పాటు ఇతర రాష్ట్రాల్లో వివిధ హోదాల్లో ఉన్నత పదవులు అనుభవిస్తున్నవారు కొందరు అనుభవించిన వారు మరికొందరు .

వీరందరూ ఒకే చోట కలిస్తే ఆ ఆనందమే వేరయా…
ఏమి సార్ …బాగున్నరా అంటూ మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ,వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి , సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లు మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిని ఆప్యాయంగా పలకరించారు. ఆరోగ్యం ,కుటుంబ క్షేమాలు ,వివిధ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఒకరినొకరు కుశలంగా మాట్లాడుకుంటూ, చాలా దీర్ఘంగా వివిధ రంగాలపై చర్చించుకున్నారు.

అనంతరం ఆడిటోరియంలో ఏర్పాటుచేసిన పూర్వ విద్యార్థుల సన్మాన కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ, కష్టపడి పని చేస్తే అత్యున్నతమైన స్థానానికి ఎదుగుతారని పేర్కొన్నారు.
అందుకు ఉదాహరణ తానేనంటూ గుర్తు చేశారు .ఓ కుగ్రామం సామాన్య రైతు కుటుంబంలో జన్మించినsv తాను ఉన్నత విద్యను అభ్యసించి ఓ ప్రొఫెసర్ గా, 18 గంటల పాటు విద్యార్థులకు విద్యను బోదిస్తూ లక్షలాదిమంది విద్యార్థులను తీర్చిదిద్దిన సంగతిని గుర్తు చేస్తూ కష్ట పడిన విషయాలను ప్రస్తావించారు .

ఆ తరువాత రాజకీయ ప్రస్థానంలో అడుగుపెట్టిన తర్వాత.. ఎమ్మెల్యేగా ,ప్రభుత్వ విప్ గా, ఎమ్మెల్సీగా మంత్రిగా ప్రభుత్వ చీఫ్ విప్ పదవులు పొంది బాగా రాణించానని గుర్తు చేశారు. ఇదే నా విజయానికి నిదర్శనం అన్నారు.

ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా, రోజుకు 18 గంటలు పాటు పని చేస్తూ ప్రజా సేవ కార్యక్రమాల్లో పాల్గొంటూ సేవ చేయడమే తనకు సంతృప్తినిస్తోందని గుర్తు చేశారు. ఎన్ని కోట్లు సంపాదించినా ఆనందంsv1 ఉండదని, పేదలకు సేవ చేసి న్యాయం జరిగినప్పుడే తగిన సంతృప్తి కలుగుతుందన్నారు. పదవుల్లో ఉన్నప్పుడే కాదు. ప్రజలకు సేవ చేయాలంటే వివిధ రంగాల్లో అనేక మార్గాల ద్వారా పేదలకు సేవ చేయడానికి అవకాశం ప్రతి మనిషి ఉందని గుర్తు చేశారు.

ఆ రోజుల్లో తన దగ్గర చదువుకున్న విద్యార్థులు ఎంతోమంది దేశ ,విదేశాల్లో ఉన్నతమైన పదవుల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో తాను ఐటీ మంత్రిగా అమెరికా వెళ్తే, విదేశాల్లో వివిధ హోదాల్లో తన విద్యార్థులు మంత్రిగా కాకుండా, కేవలం గురువుగా మాత్రమే తనకు అపూర్వ స్వాగతం పలికిన విషయాన్ని గుర్తు చేస్తూ భావోద్వేగాలతో తన మాటలను వ్యక్తం చేశారు.

గురువుకు ఇంతకంటే ఏమి ఆనందం కావాలని గుర్తు చేశారు. కోట్ల డబ్బు ఉన్న మనిషి ఆనందం ఉండదని కేవలం విద్య దానం వల్లే తనకు మంచి సంతృప్తి కల్గిందని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిsv4 అన్నారు. దేశ ,విదేశాల్లో తన విద్యార్థులు అత్యున్నత పదవుల్లో రాణిస్తుండడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందన్నారు.చదువుతోనే పదవులు, కీర్తి ప్రతిష్టలు వస్తాయని నేటి విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు బాగా చదివి భవిష్యత్తులో దేశ అభివృద్ధికి నేటి యువత పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు.

ఎస్కే యూనివర్సిటీలో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు తనతో పాటు అనేకమంది వివిధ రంగాలలో వివిధ పదవుల్లో రాణించారని గుర్తు చేశారు . నేటి యువతీ ,యువకులు మంచి మార్గాన్ని ఎంచుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.భవిష్యత్ లో ఎప్పుడైనా యూనివర్సిటీ అభివృద్ధికి తన సహాయ సహకారాలు అందిస్తానని యూనివర్శిటీ అధికారులకు సూచించారు.

ఎస్కే యూనివర్సిటీలో విద్యను అభ్యసించి ఇప్పుడు వివిధ పార్టీలలో అత్యున్నతమైన పదవులు పొందిన మాజీ మంత్రులు ఎం రఘువీరారెడ్డి ,మాజీ ప్రభుత్వ విప్ యామిని బాల, మాజీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వర్ రెడ్డి , రామకృష్ణ, మాజీ వైస్ ఛాన్స్ లర్లు కొనకలూరి ఇనాక్ ,కాడ రామకృష్ణారెడ్డి , శ్రీనివాస్ రెడ్డి ,కృష్ణా నాయక్ ,ఐఏఎస్, ఐపీఎస్, రాష్ట్ర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులే ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

LEAVE A RESPONSE