Suryaa.co.in

Andhra Pradesh

అమర్.. పంధా మార్చుకోకపోతే రాజకీయంగా కనుమరుగు అయిపోతావు

– జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జి

వైజాగ్ : తిరుమలలో తొక్కిసలాట ఘటన దురదృష్టకరం అని రాష్ట్ర కో-ఆపరేటివ్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జి అన్నారు గురువారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైజాగ్ నుంచి తిరుపతి లో జరిగిన ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము అని చెప్పారు.

క్షతగాత్రులకు పూర్తి స్థాయి చికిత్స అందించి వారి ఇళ్లకు పంపిస్తాము. మృతి చెందినవారి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని తెలిపారు. నిన్న మోదీ పర్యటన లో సుమారు 2 లక్షల కోట్ల పెట్టుబడులకు శంకుస్థాపన చేశారు.ఈ పెట్టుబడులు మూడు నుంచి నాలుగు లక్షల ఉద్యోగాలు వస్తాయి అని అన్నారు. నిన్న శంకుస్థాపనలు చేసిన ప్రాజెక్టులకు గతంలోనే శంకుస్థాపన చేసామని వైసీపీ నాయకులు చెబుతున్నారు.

గతంలో శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ వచ్చి ఎలా శంకుస్థాపన చేస్తారు . వైసీపీ నాయకులకు పరిపాలన చేతకాదు.కేవలం దోపిడీ పైనే గత వైసీపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది.

గతంలో మంత్రిగా ఉన్న సమయంలో అమర్నాధ్ ఎం సాధించావో చెప్పాలి అని డిమాండ్ చేశారు అమర్నాధ్ నెలకి ఒక దేశం వెళ్తున్నారు. ప్రమాదాలు జరిగితే కమీషన్లు వసూలు చేసుకొనే అమర్నాధ్ ఇప్పుడు చంద్రబాబు కోసం మాట్లాడుతున్నారు

సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను విమర్శించే స్థాయి అమర్నాధ్ కు లేదు. మైక్ దొరికింది కాదా అని అమర్నాధ్ మాట్లాడితే సరికాదు. కోడిగుడ్డు మంత్రిగా పేరుపొందిన అమర్ గత ఎన్నికలలోనే నీకు చుక్కలు చూపించారు ఇంకా నీ పంథా మార్చుకోకపోతే రాజకీయంగా కనుమరుగు అయిపోతావు అని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలలో రైల్వే జోన్ కు కనీసం భూములు కూడా కేటాయించలేదు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు గొంపా సత్యనారాయణ జిల్లా ప్రధాన కార్యదర్శి పొలమరశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE