-మూడు రాజధానులు ఆసాధ్యం
-ప్రపంచలోనే అతి పెద్ద రాజకీయ పార్టీ బిజెపి
-కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
-కేంద్ర మాజీ మంత్రి సుజన చౌదరి
ఒంగోలు: రాష్ట్ర భజన అనంతరం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని షయంలో గత ప్రభుత్వ హయాంలో అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలతో 175 మంది ఎమ్మెల్యేల ఆమోదంతో అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటులో అమోదం పొందిన అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని కేంద్ర మాజీ మంత్రి, బిజెపి నాయకులు సుజనా చౌదరి స్పష్టం చేశారు. ఆదివారం ఒంగోలులో ఆయన లేకర్లతో మాట్లాడారు. రాజధాని షయంలో రాష్ట్ర ప్రభుత్వం ధ్వంద వైఖరి అవలంభిస్తుందని ఆయన దుయ్యబట్టారు. మూడు రాజధానులు ఏర్పాటు కావాలంటే అందరి ఆమోదంతో పార్లమెంటు ఆమోదం జరిగినప్పుడే సాధ్యం అని అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మెండివైఖరిగా వ్యవహరిస్తే మూడు రాజధానులు అసాధ్యం అని ఆయన తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధానాన్ని వృధా చేస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించి సమయాన్ని వృధా చేస్తుందని విమర్శించారు. ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధానులను మార్చడం సరికాదన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత ఇసుక, లిక్కరు, మైనింగ్ మాఫియా, పెరిగిపోయిందన్నారు. పాలకులు ప్రభుత్వాలు సక్రమంగా పని చేయాలంటే ఓటరు తన లువైన ఓటు హక్కును సక్రమంగా నియోగించుకోవాలని ఆయన సూచించారు.
ప్రపంచంలోకెల్లా అతి పెద్ద రాజకీయపార్టీ బీజేపీ అని, ఏ రాజకీయ పార్టీకి లేని ధంగా అధిక సంఖ్యలో సభ్యత్వం కలిగిన పార్టీ అని ఆయన పేర్కొన్నారు. ప్రజలను న ఎ మోసం చేస్తున్న రాజకీయ పార్టీలకు బుద్ది చెప్పేందుకు కేవలం 18 నెలలు సమయం ఉందని, ఓటరు ఆలోచించి ఓటు హక్కును నియోగించుకోవాలని ఆయన కోరారు.
కేంద్ర మాజీ మంత్రి సుజనచౌదరి.ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక ధానాలను ప్రజలల్లోకి తీసుకెళ్లాలని కేంద్ర మాజీ మంత్రి సుజన చౌదరి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అభివృద్ధి నిరోధక వైసీపీ ప్రభుత్వ ధానాలకు నిరసనగా బిజెపి ఆధ్వర్యంలో ఆదివారం తల పెట్టిన ప్రజాపోరు యాత్రను సుజన చౌదరి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రదానమంత్రి నరేంద్రమోడీ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు.
జిల్లా అధ్యక్షులు శిరసనగండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 8 ఏళ్లు అయిందని, ఈ వ్యవధిలో టీడీపీ. వైసీపీలు కుటుంబ పాలన, స్వార్థ ప్రయోజనాల కోసం అధికారమే ధ్యేయంగా భరి తెగించి ప్రజలను మోసం చేస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. 38 నెలల వైసీపీ పాలనలో గతంలో వైఎస్ జగన్ తల పెట్టిన పాదయాత్రలో ఇచ్చిన హా’లను స్మరించారని ఆయన మర్శించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక ధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్యవంతులను చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
గత, ప్రస్తుత ప్రభుత్వాలు వెలుగొండ ప్రాజెక్టు షయంలో దోబూచులాడాయని, ఇప్పటికైనా రూ.1500 కోట్ల రూపాయలు తక్షణమే మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆసియా ఖండంలోనే అతి పెద్ద చెరువులైన మోపాడు, కంభం చెరువులను పూర్తి స్థాయిలో పుననిర్మాణం చేపట్టాలని ఆయన జ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో బి.జె.పి అధ్యక్షులు శిరసన గండ్ల శ్రీనివాసరావు ప్రజా పోరు యాత్ర నిర్వహణ ఇంఛార్జి వైసిహెచ్ యోగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య, పి శివారెడ్డి, మదుయాదవ్, దని శెట్టి రాము, నాగేంద్రయాదవ్,జిల్లా ఇంఛార్జి ఎన్. రమేష్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య, డాక్టర్ నరసింగరావు, పి. . శివారెడ్డి, , ఎ. రామయ్య, వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.