– ఎన్నారై టిడిపి నాయకులు వల్లభనేని గిరిబాబు
అమరావతి: ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త, వాస్తు శిల్ప వాచస్పతి డా. ఈమని శివనాగి రెడ్డిని ప్రముఖ ఎన్నారై టిడిపి నాయకుడు వల్లభనేని గిరిబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో రాష్ట్ర అభివృద్ధి, ప్రత్యేకంగా ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణపై చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా గిరిబాబు మాట్లాడుతూ , “అమరావతిని ప్రజా రాజధానిగా తీర్చిదిద్దడంలో శాస్త్రీయ దృష్టి, పురావస్తు అవగాహన, వాస్తు శిల్ప జ్ఞానం అత్యంత ప్రాముఖ్యం కలిగినవి. ఈ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న డా. ఈమని శివనాగి రెడ్డి అనుభవం, మార్గదర్శకత్వం అమరావతి అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది. రాష్ట్రానికి ఆయన అవసరమైన నిపుణుడు. అందువల్లే ఆయన ఆంధ్రప్రదేశ్‌కు తరలివచ్చి రాష్ట్ర పురోభివృద్ధిలో భాగస్వామి కావాలని కోరుతున్నాము” అని తెలిపారు.
డా. శివనాగి రెడ్డి ఇంతవరకు ఎన్నో ప్రాజెక్టులకు, వారసత్వ పరిరక్షణ చర్యలకు తన వంతు సలహాలు, సూచనలు అందించి సమాజంలో విశేషమైన గుర్తింపు పొందిన విషయాన్ని గిరిబాబు గుర్తు చేశారు. అమరావతి డిజైన్స్ ఎక్స్పర్ట్ కమిటి మెంబర్ గా శివనాగి రెడ్డి కొనసాగుతున్నారు.
అమరావతిని కేవలం రాజధానిగా కాకుండా ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక గుర్తింపుగా, వారసత్వానికి ప్రతీకగా తీర్చిదిద్దడంలో డా. శివనాగి రెడ్డి వంటి నిపుణుల సలహాలు, సహకారం అత్యంత కీలకం” అని అభిప్రాయపడ్డారు.