– ఢిల్లీలో విఫలమైన వైకాపా లాబీయింగ్
– ఫ్రస్టేషన్లో ‘సూసైడ్ గ్యాంగ్’ అవుతామంటూ బెదిరింపులు
అమరావతి బిల్లుకు ఆమోదం తెలిపినందుకు గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి శ్రీ నారా లోకేష్ మరియు ఎన్డీఏ ఎంపీలు ధన్యవాదాలు తెలియజేశారు.
ప్రథమ పౌరురాలి దీవెనలు!
కోట్లాది ప్రజల కోరిక అయిన అమరావతి చట్టం తన హయాంలో రూపొందడం సంతోషంగా ఉందని, రాష్ట్రంపై ప్రేమతో రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల త్యాగాలను రాష్ట్రపతి కొనియాడారు. పోరాడి సాధించుకున్నది చిరస్థాయిగా గుర్తుండిపోతుందని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్ అని, ఆయన దూరదృష్టితో రాష్ట్రాన్ని, రాజధానిని అద్భుతంగా అభివృద్ధి చేస్తారని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో పయనించాలని, రాజధాని పనులు నిర్విఘ్నంగా కొనసాగాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు.
వైకాపా విఫల లాబీయింగ్..
మరోవైపు నాడు రాజ్యసభలో తన పక్కన కూర్చున్న బెంగాల్ ఎంపీ కూడా “జై ఆంధ్రా” అనేసరికి వైవీ సుబ్బారెడ్డి మొహంలో నెత్తురు చుక్క లేదు. తమ లాబీయింగ్‌తో దేశంలోని ఏ ఒక్క పార్టీనీ కాదు కదా, కనీసం ఒక్క ఇండిపెండెంట్ ఎంపీ చేత కూడా బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడించలేకపోయారు వైకాపా నేతలు. ఆఖరికి జగన్ ‘జాన్ జిగిరీ’ అయిన గులాబీ ఎంపీలు సైతం అమరావతి చట్టబద్ధతకు, చట్ట సవరణకు మద్దతు తెలపడం గమనార్హం.
విజయసాయి రెడ్డి స్థానంలో తనను నమ్మిన జగన్ కోటరీ ముందు ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి.. పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి పరోక్షంగా వైకాపా తప్పును అంగీకరిస్తూనే, ‘ఆత్మాహుతి దళం’ మాదిరి జగన్ ఏది చెబితే ఆ పని చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక రాజ్యసభ గ్యాలరీలో ఉన్న లోకేష్‌ను ప్రత్యక్ష ప్రసారంలో చూపించడం ఏదో దేశద్రోహం అన్నట్లుగా.. రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం, కోర్టుకు వెళతాం అంటూ ‘కల్తీ డబ్బా’ సుబ్బారెడ్డి కొడుతున్న ‘సుత్తి’ అందరికీ తెలిసిందే.
ఉన్మాదానికి పరాకాష్ట!
ప్రజాస్వామ్యంలో ఆత్మాహుతి దళాలకు తావు లేదు; ప్రజల కోసం ప్రజాస్వామ్యం పనిచేస్తుంది. సైకోలాంటి వ్యక్తులను కుర్చీలో కూర్చోబెట్టడానికి ‘ఆత్మాహుతి దళం’ అవుతాం అని ప్రకటించడం ఉన్మాదానికి పరాకాష్ట. బహుశా వారికి బాహ్య ప్రపంచంలో ఉండటం ఇష్టం లేనట్లుంది. ప్రపంచం ఇలాంటి వారిని ఇప్పటికే టెర్రరిస్టుల రూపంలో చూసింది. ఒక ఎంపీ హోదాలో ఉండి ‘సైకో జగన్’ కోసం ఆత్మాహుతి దళంలా పనిచేస్తామని మిథున్ రెడ్డి చెప్పడం ప్రజాస్వామ్యం మీద, ప్రజల మీద నమ్మకం లేకనే.
ఇప్పటికే లిక్కర్ స్కాములో విచారణలు ఎదుర్కొన్న చరిత్ర ఆయనది. మదనపల్లి ఫైల్స్ నుండి భూములు, గనులు, ఇసుక, కంకర వరకు వేలకోట్లు మింగేసిన వారు.. ఇప్పుడు తమను తాము ఆత్మాహుతి దళ నేతలుగా ప్రకటించుకోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. పేటీఎం బ్యాచ్ నుండి రఫ్ఫా రఫ్ఫా బ్యాచ్ వరకు ఎవరైనా చట్ట వ్యతిరేకంగా రోడ్ల మీదకు వస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మేము అధికారంలోకి వచ్చి దోచుకోవడానికి ఆత్మాహుతి దళం అవుతాం అంటే ఈ వైకోపోన్మాద భూతాన్ని భూస్థాపితం చెయ్యక తప్పదు. దీనికోసం ప్రతి ఒక్కరూ తలో చెయ్యి వెయ్యక తప్పదు.