Suryaa.co.in

Andhra Pradesh

తప్పుల్ని ప్రశ్నిస్తే.. తప్పుడు కేసులా?

-పిచ్చి ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోవడం ఖాయం
– అమర్నాథ్ రెడ్డి

ప్రభుత్వ తప్పుల్ని, ప్రజా సమస్యల్ని ఎలుగెత్తి చాటడమే నేరం అనేలా జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. తప్పుల్ని తప్పు అని చెబితే తప్పుడు కేసులు పెట్టి వేధించడం జగన్ రెడ్డి పిరికితనానికి నిదర్శనం. ఎగ్జిబిషన్ పేరుతో ప్రజల నుండి డబ్బులు దండుకున్న స్థానిక వైసీపీ ఎమ్మెల్యేపై కేసు పెట్టాలి. అలా కాకుండా.. బెదిరించి డబ్బులు దండుకోవడాన్ని ప్రశ్నించిన టీడీపీ ఇంఛార్జి ప్రవీణ్ కుమార్ పై కేసు పెట్టడం సిగ్గుచేటు. జగన్ రెడ్డి లాంటి తప్పుడు వ్యక్తులకు.. తప్పులు చేసేవారే మంచివారు అన్నట్లుగా పరిస్థితులున్నాయి. లక్షల కోట్లు దోచుకున్న జగన్ రెడ్డి లాంటి అవినీతి పరులకు… న్యాయం, ధర్మం, ప్రశ్నించే తత్వం ఎప్పుడూ నచ్చవని తాజా పరిణామాలతో స్పష్టమైంది. తప్పులు చేసిన వారిని వదిలి పెట్టి.. తప్పుల్ని ఎత్తి చూపిన వారిపై కేసులు పెట్టాలని ఏ చట్టంలో ఉందో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ప్రజాస్వామ్య దేశంలో నిరంకుశ విధానాలకు, నియంతృత్వ పోకడలకు చోటు లేదని జగన్ రెడ్డి గుర్తెరగాలి. ప్రపంచాన్ని వణికించామని విర్రవీగిన ఎంతో మంది నియంతలు ప్రజా వ్యతిరేకతతో కాల గర్భంలో కలిసిపోయారు. జగన్ రెడ్డి తన పిచ్చి, పిరికిపంద చర్యలతో పిచ్చి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోవడం తధ్యం.

LEAVE A RESPONSE