Suryaa.co.in

National

అమర్‌నాథ్‌ యాత్ర జూన్‌ 29 నుంచి ప్రారంభం

జమ్మూకశ్మీర్‌లో ప్రఖ్యాత అమర్‌నాథ్‌ యాత్ర జూన్‌ 29 నుంచి ప్రారంభం కానుంది. 52 రోజుల పాటు సాగే ఈ యాత్ర ఆగస్టు 19న ముగియనుంది. ఈ యాత్రకు దేశ విదేశాల నుంచి భక్తులు అధికసంఖ్యలో పాల్గొనాలని జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా పిలుపునిచ్చారు. దక్షిణ కశ్మీర్‌ హిమాలయాల్లోని 3,880 మీటర్ల ఎత్తులోని గుహలో ఏర్పడే మంచు లింగాన్ని దర్శించేందుకు ప్రతి ఏటా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతుంటారు.

LEAVE A RESPONSE