Suryaa.co.in

Andhra Pradesh

పవన్‌ ఎక్కాక వారాహి కాస్తా వరాహి అయ్యింది

– వారాహి పేరు పెట్టుకుని బూతు పంచాంగమా..?
– సినిమాల్లో కథా నాయకుడు.. రాజకీయాల్లో కంత్రీ నాయకుడు పవన్
– ఎన్నికల దాకా హలో ఏపీ.. ఎన్నికలు అయ్యాక ఛలో హైదరాబాద్ః ఇదీ బాబు-పవన్ ల తీరు..!
– హలో ఏపీ… అమ్మేశా జనసేన అని పవన్‌ కళ్యాణ్‌ చెప్పాలి.
– బాబుకు డబ్బింగ్ చెప్పే స్థాయికి పవన్ దిగజారాడు
– వారాహి ఎక్కి పూనకం వచ్చినట్లు బూతులు మాట్లాడుతున్నాడు
– ఆయన చెప్పు చూపించడానికి, గుండు కొట్టించుకోవడానికి ఒక కథ ఉంటుంది.
– పెళ్ళిళ్ళకు, విడాకులకు, చంద్రబాబు ఇంట్లో కలవడానికీ కథలు ఉంటాయి
– రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు

పవన్‌ ఎక్కాక వారాహి కాస్తా వరాహి అయ్యింది:
– పవన్‌ కళ్యాణ్‌ గత కొద్ది రోజుల నుంచి గోదావరి జిల్లాల్లో పర్యటన చేస్తూ…తన రాజకీయ ఉపన్యాసాల్లో నోటికొచ్చినట్లు ఇష్టారీతిన మాట్లాడుతున్నాడు.
– వారాహి అంటే అమ్మవారు అని…వారాహిని వాహనంగా చేసుకోవడం తప్పని, దానిపై ఎక్కి ప్రయాణం చేస్తే అనర్ధాలకు దారితీస్తుందని గతంలోనే చెప్పాను.
– పవన్‌ కళ్యాణ్‌ ఆ రకంగా చేయడం వల్ల ఆయనకు చాలా అనర్ధాలు వస్తాయని స్పష్టంగా చెప్పా.
– ఆయన సినిమాలు ఆడవని, రాజకీయ భవిష్యత్తు ఉండదని కూడా చెప్పా.
– వరాహం అంటే పంది.. వారాహి అంటే శక్తివంతమైన దేవత.
– ఎప్పుడైతే పవన్‌ వారాహి అనే దేవత పేరు చెప్పుకుని ఆ వాహనం ఎక్కడో అప్పుడు అది పంది అయిపోయిందని చెప్పా.
– అంతే తప్ప అమ్మవారిని నేను దూషించడం, కించపరిచడం లేనే లేదు.
– పవన్‌ ఆ వాహనంపైకి ఎక్కి ఊగిపోతున్నాడు.. బూతులు తిడతాడు.
– కానీ ఆయన ఊగిపోతున్నాడు అని జగన్‌ గారు అంటే మాత్రం ఆయనకు చాలా కోపం వచ్చింది.
– పల్లెటూళ్లలో పూనకాలు వచ్చి ఊగిపోయి, చిందులేస్తుంటారు…
– ఇతను కూడా వారాహిపైకి ఎక్కి పూనకం వచ్చినట్లుగా ఊగిపోయి ఏదేదో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు.

ఆయన చెప్పు చూపించడానికి, గుండు కొట్టించుకోవడానికీ కథలుంటాయి:
– జగన్‌ గారు అమ్మ ఒడి కార్యక్రమంలో కొన్ని రాజకీయ వ్యాఖ్యలు చేశారు.
– ఏ సమావేశానికి వెళ్లినా ఆనవాయితీగా చివర్లో సీఎం రాజకీయ వ్యాఖ్యలు ఆనవాయితీగా చేస్తున్నారు.
– అమ్మ ఒడి కార్యక్రమంలో రాజకీయ వ్యాఖ్యలా అంటూ పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతున్నాడు.
– వారాహి అనే మహాదేవత పేరు పెట్టుకుని ఇన్ని ఆబద్దాలు చెప్తున్న నిన్ను ఏమనాలి..?
– ఆయన చెప్పు చూపించడానికి ఒక కథ ఉంటుంది…ఆయన గుండు కొట్టించుకోవడానికి ఒక కథ ఉంటుంది.
– ఆయన రెండు చెప్పులు పోగొట్టుకోడానికి, చంద్రబాబుతో హైదారాబాద్‌ ఇంట్లో కలవడానికి, నోవాటెల్‌కు చంద్రబాబు రావడానికి ఒక కథ ఉంటుంది.
– ఆయన పెళ్లి పెళ్లికీ ఒక కథ ఉంటుంది. విడాకులకీ ఒక కథ ఉంటుంది..
– మొత్తం కథలు కథలుగా ఉంటాయి ఆయన చెప్పేవన్నీ..
– సినిమాల్లో ఆయన కథానాయుడు… రాజకీయాల్లో కాకమ్మ కథలు చెప్పే కంత్రీ నాయకుడు అయ్యాడు.
– ఇలా కథలు చెప్పే దుస్థితికి నేడు పవన్‌ కళ్యాణ్‌ దిగజారిపోయాడు.

జగన్‌ గారు పోవాలనుకునే వాళ్లే.. రాష్ట్రం నుంచి పోవాలిః
– ఎందుకు జగన్‌ గారు పోవాలి..? ఎవరు రావాలి..? నువ్వు వస్తావా..? అంటే తెలియదు అంటావు, ఎవరు రావాలో చెప్పవు.
– జగన్‌ గారు దిగిపోతే ఏమవుతుందో రాష్ట్ర ప్రజలకు తెలియదా.. ?
– ఒక అమ్మ ఒడి పోతుంది. ఒక విద్యా దీవెన పోతుంది.. ఒక రైతు భరోసా.. ఇలాంటి అనేకమైన పథకాలు పోతాయి.
– అందుకే జగన్ గారే కావాలి… అన్ని సంక్షేమ పథకాలూ ఉండాలనేదే ప్రజల కోరిక.
– జగన్‌ గారు పోవాలనుకునే వాళ్లే.. ఈ రాష్ట్రం నుంచి పోవాలని ప్రజలు అనుకుంటున్నారు.
– చంద్రబాబుకు, పవన్‌ కళ్యాణ్‌కు రాష్ట్రంలో ఇల్లూ, వాకిలీ లేదు.

ఎన్నికల వరకూ హలో ఏపీ… తర్వాత ఛలో హైదరాబాద్‌:
– ఎన్నికల వరకూ వీళ్లు హలో ఏపీ అంటారు..ఎన్నికల తర్వాత ఛలో హైదరాబాద్‌ అంటారు.
– వారు ఇక్కడకు వచ్చినప్పుడల్లా వారిది గెస్ట్‌ హౌస్‌ల్లో జీవితం… కానీ ఇక్కడే పోటీ చేస్తారు.
– హలో ఏపీ…అమ్మేశా జనసేన అని పవన్‌ కళ్యాణ్‌ చెప్పాలి.
– తాను జనసేనను చంద్రబాబుకు అమ్మేశానని చెప్పాలి.
– పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్న పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాలకు అనర్హుడు.
– జ్వరం వచ్చిందని యాత్ర ఆపి, సినిమాలకు డబ్బింగ్‌ చెప్పుకుంటున్నాడు.
– తన సినిమాకు తాను డబ్బింగ్‌ చెప్పుకుంటే తప్పేమీ లేదు కానీ… రాజకీయాల్లో చంద్రబాబుకు డబ్బింగ్‌ చెప్పే స్థాయికి ఎందుకయ్యా దిగజారిపోయావ్‌..?

గళం లేని యువగళం.. గరళంతో నిండిన పవన్‌ గళం:
– ఒకాయన యువగళం అంటాడు.. ఆయనకు గళమే లేదు…
– యువగళానికి గళమే లేదు.. పవన్‌ కళ్యాణ్‌ది గరళంతో కూడుకున్న గళం.
– విషం కక్కుతూనే ఉన్నాడు..జగన్‌ పోవాలట..ఆయన మాత్రం రాడట..ఎవడో రావాలట…
– ఎవరో రావడం కోసం జగన్‌ పోవాల్సిన అవసరం లేదు.
– ఈ రాష్ట్రంలో మళ్లీ మళ్లీ జగన్‌ వస్తారు..ఈ రాష్ట్రాన్ని పరి పరిపాలన చేస్తారు.
– జగన్‌ పైనే ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు…అందుకే పూనకం వచ్చినట్లు ఊగిపోతూ జగన్‌ గారిని ఓడించాలని కుట్రలు చేస్తున్నారు.
– మీరు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.
– జగన్‌ ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పయనింపజేయడానికి, ప్రతి సామాన్యుడి కోసం, ప్రతి పేదవాడి కోసం పనిచేస్తున్న నాయకుడు.
– అలాంటి నాయకుడిపై విద్వేషం చిమ్ముతూ, కులాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
– తాను ఓడిపోయినప్పుడు చాలా బాధ పడ్డాను అంటున్నాడు పవన్ కల్యాణ్… అంతకు ముందు తనకు ఓటమి అసలు లెక్కే కాదు అని అన్నాడు.
– స్థిరత్వం లేని వ్యక్తి పవన్‌ కళ్యాణ్‌…ఆయన్ను నమ్ముకుని రాజకీయాలు చేస్తే నష్టపోతారు.
– ఆయన ఆవేశంతో రెచ్చగొట్టే ప్రయత్నం చేసి, తగాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.
– ఆయన అభిమానులు, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి.

ఈనాడు కడుపుమంట అంతా నవయుగ నుంచి కాంట్రాక్టు పోయిందనే:
– గైడ్‌ బండ్‌ కుంగింది.. దానిలో రహస్యమేముంది…?
– నేను వ్యక్తిగతంగా వెళ్లి పరిశీలించి కుంగిందని ఆరోజే చెప్పాను.
– కానీ అది పెద్ద సీరియస్‌ విషయం కాదు.. నిజ నిర్ధారణ కమిటీ గైడ్‌బండ్‌ను పరిశీలించారు.
– నేను వారితో మాట్లాడాను… వారు గైడ్‌ బండ్‌ కుంగటానికి గల కారణాలు అన్వేషిస్తున్నామని చెప్పారు.
– ఇది ప్రమాదకరమైన అంశం కాదు…సరైన సమయంలో సరిచేయవచ్చని చెప్పారు.
– ఈనాడు కడుపుమంట అంతా నవయుగ నుంచి పోలవరం కాంట్రాక్టు పోయిందనేదే.
– తన బంధువులకు కాంట్రాక్టు లేకుండా వేరే వారికి వచ్చిందనే కడుపు మంటతో రాస్తున్న రాతలే ఇవన్నీ..
– దీనికన్నా ప్రమాదకరమైన ఘటన ఒకటి జరిగింది. డయాఫ్రం వాల్‌ కొట్టుకుపోయింది.
– దాని గురించి మాత్రం ఈనాడు రామోజీ ఒక్క ముక్క కూడా రాయలేదు.
– దాన్ని నవయుగ వాళ్లు చేశారు కాబట్టి ఒక్క ముక్క కూడా రాయడు.
– కేంద్ర ప్రభుత్వం సీరియస్‌ అన్న మాట అవాస్తవం. సరిచేయాలనే ప్రయత్నంలో ఉంది. డిజైన్స్‌ పంపడానికి సిద్ధంగా ఉంది.

టీడీపీ వారిది బస్సు యాత్ర కాదు…తుస్సు యాత్ర:
– టీడీపీది బస్సు యాత్ర కాదు..తుస్సు యాత్ర అంటున్నారు.
– వారి యాత్రకు తెలుగుదేశం కార్యకర్తలు కూడా రావడంలేదు…
– దీనికే కన్నా లక్ష్మీనారాయణ సెల్ఫీ చాలెంజ్‌ చేస్తున్నాడు.
– అన్నా కన్నా… వస్తాదన్నా… ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎక్కడున్నావన్నా..?
– నువ్వు ఇవాళ వచ్చి మమ్మల్ని ఛాలెంజ్‌ చేస్తున్నావా..?
– ఎక్కడున్నావో తెలియదు…ఎక్కడ ఉంటావో తెలియదు…అసలు ఉంటావో లేదో తెలియదు.
– అలాంటి నీకు నాపై ఛాలెంజ్‌ చేసే అర్హత లేదు.
– నేను మూడు ఛాలెంజ్‌లు చేస్తున్నా..వాటిని స్వీకరించమని అడుగుతున్నా.
– వంగవీటి మోహన రంగా గారిని హతమార్చింది ఎవరో చెప్పు..?
– నిన్ను చంపడానికి ప్రయత్నం చేసింది ఎవరో చెప్పు..?
– అన్నా కన్నా…చివరి వరకూ చంద్రబాబుతోనే ఉంటావా..? పార్టీ ఫిరాయిస్తావా..? చెప్పు.
– అసలు ఎన్నికల వరకూ సత్తెనపల్లిలోనే ఉంటావా..? పోటీ చేయకుండా పారిపోతావా అనేది సమాధానం చెప్పు. ఆ తర్వాతే మాట్లాడితే మంచిది.

LEAVE A RESPONSE