– బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర
బయ్యారం: దేశ ప్రజలందరూ గర్వించదగ్గ గొప్ప రాజ్యాంగాన్ని అందించిన బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న అని,ప్రజల చిరకాల వాంఛ అయిన స్వరాష్ట్రాన్ని సాధించి పెట్టిన కేసీఆర్ తెలంగాణ జాతిపిత అని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు.
అంబేద్కర్ అందరివాడు అని,ఆయన ఒక కులానికో,వర్గానికో పరిమితం కాదని, మహా నాయకుడని కొనియాడారు.మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సింగారంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎంపీ రవిచంద్ర మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్యేలు హరిప్రియ,శంకర్ నాయక్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ దిండిగాల రాజేందర్ తదితరులతో కలిసి శనివారం ఆవిష్కరించారు.