విజయవాడ స్వరాజ్ మైదానంలో అంబేద్కర్ స్మృతివనం, అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష
విజయవాడలో అంబేద్కర్ స్మృతివనం పనులపై సీఎం సమీక్ష.
125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనుల్లో పురోగతిపైనా సమీక్ష.
దానిచుట్టూ సివిల్ వర్క్స్, సుందరీకరణ పనులపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి.
స్మృతివనంతో పాటు విగ్రహం నిర్మాణ పనులపై సీఎంకు వివరాలందించిన అధికారులు.
స్మృతివనం ప్రాంగణంలో పనులు చురుగ్గా జరుగుతున్నాయన్న అధికారులు.
అన్ని స్లాబ్ వర్కులు ఈ నెలాఖరునాటికి పూర్తవుతాయన్న అధికారులు.
ప్రాంగణంలో ఒక కన్వెన్షన్ సెంటర్ కూడా వస్తుందని తెలిపిన అధికారులు.
విగ్రహ విడిభాగాలు ఇప్పిటికే సిద్ధంగా ఉన్నాయన్న అధికారులు.
ఒక్కొక్కటిగా అమర్చుకుంటూ మొత్తం 13 దశల్లో విగ్రహ నిర్మాణాన్ని పూర్తిచేస్తామన్న అధికారులు.
విగ్రహ నిర్మాణంలో 352 మెట్రిక్ టన్నుల ఉక్కు, 112 మెట్రిక్ టన్నుల ఇత్తడిని వినియోగిస్తున్నామన్న అధికారులు.
విగ్రహం తయారీతో పాటు దాని చుట్టూ సివిల్ వర్క్స్, సుందరీకరణ, మైదానాన్ని ప్రధాన రహదారితో అనుసంధానం చేసే పనులను సీఎంకు వివరించిన అధికారులు.
ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే…:
అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టు శాశ్వతమైన ప్రాజెక్టు.
పనులు కూడా అంతే నాణ్యతతో ఉండాలి.
విజయవాడకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చేలా నిర్మాణాలు ఉండాలి.
స్మృతివనంలో ఏర్పాటవుతున్న కన్వెన్షన్ సెంటర్కూడా అత్యంత ప్రధానమైనది.
నిర్మాణంలో నాణ్యతతో పాటు, సుందరీకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి.
అధికారులు పనులను సమన్వయం చేసుకుని ముందుకు సాగాలి.
పనుల పర్యవేక్షణకోసం ఏర్పాటు చేసిన ఉన్నతస్ధాయి కమిటీ ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలన్న సీఎం.
ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం (దేవాదాయశాఖ) కొట్టు సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, ప్లానింగ్ ఎక్స్ అఫిషియో సెక్రటరీ జి విజయ్ కుమార్, సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్ హర్షవర్ధన్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ జి సృజన, విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.