-చిట్యాల అయిలమ్మ, దొడ్డి కొమురయ్యలను అవమానించడంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్
హైదరాబాద్‌లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డిలతో బిజెపి నిర్వ|హించిన తెలంగాణ విమోచన దినోత్సవం అట్టర్ ఫ్లాప్ ముగిసిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనం లేక వెల వెల పోయిందన్నారు. అలాగే నాడు సమైక్యత కోసం జాతీయ నాయకులు పని చేస్తే, నేడు బిజెపి విచ్చిన్నం కోజం పని చేస్తున్నదన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంతో, స్వాతంత్య్ర ఉద్యమంతో కనీస సంబంధం లేని పార్టీ పెట్టే సమావేశాలను, పార్టీలను తెలంగాణ ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరన్నారు. ఇదే విషయం మరోసారి రుజువైందన్నారు. తెలంగాణ ప్రజలపై కపట ప్రేమను ఒలకబోఏసే బిజెపి, మరి తెలంగాణకు ఎలాంటి నిధులు ఎందుకు ఇవ్వడం లేదని ఎర్రబెల్లి ప్రశ్నించారు.
తెలంగాణ సాయుధ పోరాట యోధులు, తెలంగాణ ప్రజల స్ఫూర్తి ప్రదాతలు, వారిని సంస్మరించుకుంటూ, వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల వేడులపే నిర్వహించుకుంటున్న వేళ, బిజెపి నేత ఒకరు మాట్లాడుతూ, చిట్యాల అయిలమ్మను చిన్న కులంలో జన్మించిన చిట్టెలుక అనడం, సాయుధ పోరాటంలో మొదటి ప్రాణార్పణ చేసిన దొడ్డి కొమురయ్యను ఒక బీసీ చిన్న కులంలో పుట్టాడని చెప్పడం అవమానించడమేనన్నారు. ప్రజలన్నా, ప్రజలు ఆరాధించే స్ఫూర్తి ప్రదాతలన్నా బిజెపి గౌరవం లేదని, అడ్డ, దొడ్డి దారిలో రాజకీయాధికారం కోసం తప్ప మరే ప్రేమ లేదని ఆయన ఆరోపించారు.