విజయవాడ పోలీస్ కమిషనర్ గా భాద్యతలు స్వీకరించిన కాంతిరాణా టాటా ను మర్యాద పూర్వకంగా AP JAC అమరావతి ఛైర్మన్ బొప్పరాజు , సెక్రటరీ జనరల్ వై వి రావు , సహా చైర్మన్ TV ఫణి పేర్రాజు, వైస్ చైర్మన్ కె.గంగాధర్, APRSA రాష్ట్ర ఉపాధ్యక్షులు R వెంకట రాజేష్, విజయవాడ సిటీ జేఏసీ అధ్యక్షులు కె కళాధర్, VRO సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి Ch. సురేష్ బాబు తదితరులు కలిశారు.
ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ, విజయవాడ లో శాంతి భద్రతల పరిరక్షణకు ఉద్యోగులుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అలాగే వారి ఆధీనంలో ఉన్న పోలీస్ మరియు హోమ్ గార్డులకు ఏలాంటి సమస్యలు వచ్చినా, చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా మంచి మనసుతో వారికి సహాయం చేయాలని కోరారు.