అమరావతి భ్రమరావతి అన్న కిరాయిపల్లి కి..
అమరావతి స్మశానం అన్న స్పీకర్ కి..
అమరావతి ఎడారి..అమరావతి yg భూములు నిర్మాణానికి పనికి రావు అన్న బొత్స కి..
అమరావతి నిర్మాణం పర్యావరణానికి చేటు అన్న కుహానా మేధావి బోలి సేట్టీ కి…
ఎవరి రాజధాని.. ఎవరి కోసం రాజధాని అని పుస్తకం రాసిన IYR కృష్ణారావు కి..
ఆ పుస్తకాన్ని ఆవిష్కరించి అదే భావన ఎగదోసిన పవన్ కళ్యాణ్ మరియు ఉండవల్లి కి..
పాలనా వికేంద్రీకరణ ద్వారానే ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి సాధ్యం అని రిపోర్ట్ ఇచ్చిన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ కి..
మూడు రాజధానులు ప్రతిపాదన చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డికి..
దానికి వంత పాడుతూ భజన చేసిన హైలెవల్ కమిటీ కి..
మా మానిఫెస్టో ప్రకారం judicial రాజధానికి మద్దతు ఇస్తున్నాము కానీ అమరావతి కే మా మద్దతు అని చెప్తూ..అమరావతి గురించి మాట్లాడిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సోము వీర్రాజు నాయకత్వం లోని బిజెపి రాష్ట్ర నాయకత్వం కి..
నేను అమరావతికే మద్దతు ఇస్తున్నా కానీ ఈ పూలింగ్ కి చట్టబద్ధత లేకుండా చేసిన చంద్రబాబుదే నేటి ఈ సంక్షోభానికి బాధ్యత అని అవగాహన లేని స్టేట్మెంట్ ఇచ్చే పవన్ కళ్యాణ్ గారికి..
రాజధాని నిర్ణయాధికారం రాష్ట్రానికే.. మాకు ఏ బాధ్యత లేదు అని కోర్టు లో అఫిడవిట్ వేసిన కేంద్ర హోం శాఖ అధికారుల కు..
రాజధాని రైతులను పెయిడ్ ఆర్టిస్ట్ లు..రియల్ ఎస్టేట్ వ్యాపారులు..కూకట్పల్లి ఆంటీలు అని నోరు కొవ్వుతో వాగిన అద్దేపల్లి శ్రీధర్ కి..
రాజధాని మహిళల చీరల ఖరీదు గురించి ప్రస్తావించిన విష్ణువర్ధన్ రెడ్డి కి..
మార్ఫింగ్ ఫోటోలు మార్ఫింగ్ వీడియోలు తో రాజధాని మహిళలను అవమానించి..అసభ్య పోస్టులు పెట్టిన వైసీపీ సోషల్ మీడియా వీరులకు..
రాజధాని రైతులను లం..కొడుకులు అని నోరు కొవ్వుతో కూసిన మంత్రి ధర్మాన కృష్ణదాస్ కి..
జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం అద్భుతం అమోఘం అని పొగిడిన చిరంజీవికి
ఇక్కడ ఈ లెజిస్లేటివ్ క్యాపిటల్ కూడా వుంచవద్దు అని సీఎం కు చెప్తా ఏమి పీక్కుంటారో పీక్కొండి అన్న కొడాలి నాని కి..
నిత్యం టీవీ చర్చలలో విషం కక్కిన పురుషోత్తమ రెడ్డికి..
SC ల మీదే SC అట్రాసిటీ కేసు పెట్టించిన డీజీపీకి..
మీడియా వారి మీద నిర్భయ చట్టం పెట్టించిన డీజీపీకి..
ఓపెన్ బాత్రూం ల మీద డ్రోన్ ఎగరవేయవద్దు అని చెప్పిన రైతుల మీద దౌర్జన్యం చేసిన DSP కి..
ఇలా ఒక్కొక్కరు ఒక్కో పాత్ర పోషిస్తూ..
అజరామరంగా వుండాల్సిన అమరావతి గొంతు నొక్కి ..
రాష్ట్రానికి రాజధాని లేని దుస్థితి సృష్టించడం లో వీళ్ళు అందరూ పోషించిన పాత్రకు నేటి గౌరవ హైకోర్టు తీర్పు అంకితం..జై అమరావతి..జై జై అమరావతి..
– రాజేష్ అప్పసాని