Suryaa.co.in

Andhra Pradesh

ప్రతి ఇంట్లో పారిశ్రామిక వేత్త..ఒక తొలి అడుగు!

– ఆయా శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్

అమరావతి: రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త అవతరించాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షల మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థతో అనుసంధానం కాబడిన అన్ని శాఖల అధికారులు సమిష్టిగా పని చేయాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.

రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆయా శాఖల అధికారులతో మంత్రి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో స్వయం సహాయ సంఘాల్లో ఉన్న సభ్యులను సూక్ష్మ, చిన్న పారిశ్రామికవేత్తలుగా మార్చడంలో భాగంగా తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.

స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వారిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని అన్నారు. ప్రభుత్వ ఆశయాన్ని అమలు చేసే క్రమంలో ఉన్న అడ్డంకులను తొలగించి అందుకు అనుగుణంగా తక్షణ చర్యలు తీసుకునేందుకు ప్రతినెల సమావేశం కావాలని నిర్ణయించారు.

ఈ సమావేశంలో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల సంస్థ సీఈఓ నందని సలారియా, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈఓ జి శేఖర్ బాబు, జాతీయ చిన్నతరహ పరిశ్రమల సంస్థ, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డ్,జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ, మత్స్య, ఉద్యానవన, వ్యవసాయ, పశుగణాభివృద్ధి శాఖల అధికారులతోపాటు, నాబార్డ్, కైతీ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొని ఆయా శాఖలతో అనుసందానం కాబడ్డ పథకాల గురించి వివరించారు.

LEAVE A RESPONSE